భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంప్ భారత మార్కెట్లో తమ సరికొత్త మోటార్‌సైకిల్‌ 'ట్రయంప్ టైగర్ 900' (Triumph Tiger 900)ను విడుదల చేసింది. వాస్తవానికి ఈ బైక్ గడచిన మే నెలలోనే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది.

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ప్రస్తుతం ట్రయంపై భారత మార్కెట్లో విక్రయిస్తున్న ట్రయంప్ 800 ఎక్స్ఆర్ రేంజ్ మోడళ్లను ఈ కొత్త ట్రయంపై టైగర్ 900 రీప్లేస్ చేయనుంది. దేశీయ విపణిలో ఈ బైక్ ప్రారంభ ధర రూ.13.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ట్రయంప్ ఇప్పటికే రూ.50,000 టోకెన్ అమౌంట్‌తో ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. త్వరలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. ట్రయంప్ టైగర్ 900 బైక్‌ను పూర్తిగా స్క్రాచ్ నుంచి తయారు చేశారు. మనుపటి సిరీస్‌ల కన్నా మరింత ఫ్రెష్‌గా కనిపించేలా నాజూగ్గా డిజైన్ చేశారు. పక్షి రెక్కల్లా అనిపించే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, పులి కళ్ల మాదిరిగా అనిపించే హెడ్‌లైట్లను ఇందులో గమనించవచ్చు.

MOST READ: కరోనా టెస్ట్ చేసుకోవడానికి ఇలా కూడా చేస్తారా..?

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ సరికొత్త ట్రయంప్ టైగర్ 900 మోటార్‌సైకిల్‌లో అధునాతన టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు, రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్లను బ్లూటూత్ సాయంతో బైక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టిఎఫ్‌టి డిస్‌ప్లే సాయంతో రైడర్లు తమ సెల్‌ఫోన్ కాల్స్‌ని ఆన్సర్ చేయవచ్చు, మెసేజ్‌లను చదవొచ్చు మరియు నావిగేషన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌ను గోప్రో కెమెరాకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందు కోసం లెఫ్ట్-సైడ్ హ్యాండిల్ బార్‌పై ప్రత్యేకమైన స్విచ్‌లు కూడా ఉంటాయి. ఇంకా ఇందులో రైడ్-బై-వైర్, కస్టమైజబల్ ఏబిఎస్, కార్నరింగ్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, 6-స్పీడ్ ఐఎమ్‌యూ (ఇనెర్టియల్ మెజర్‌మెంట్ యూనిట్) మరియు 6 విభిన్న రైడింగ్ మోడ్స్ (రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్, ఆఫ్-రోడ్ ప్రో, రైడర్) కూడా ఉంటాయి.

MOST READ: రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త ట్రయంప్ టైగర్ 900లో అధిక డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఫలితంగా ఇందులో 888సీసీ త్రీ-సిలిండర్ ఇంజన్ మునుపటి కన్నా సుమారు 2.5 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఫైరింగ్ ఆర్డర్‌ని కూడా 1-2-3 నుంచి 1-3-2కి మార్చారు, ఫలితంగా సైలెన్సర్ బీటింగ్ సౌండ్ మారుతుంది.

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇక ఈ ఇంజన్ పవర్, టార్క్‌ల విషయానికి వస్తే.. ఇందులో 888సీసీ త్రీ-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 94 బిహెచ్‌పిల శక్తిని మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 87 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: ఇండియాలో కార్ కేర్ ప్రొడక్ట్ లాంచ్ చేసిన టర్టల్ వాక్స్

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బేస్ వేరియంట్ ట్రయంప్ టైగర్ 900 జిటి మోడల్‌లో ముందువైపు మార్జూకీ 45 ఎమ్.ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌ (యూఎస్‌డి)ని ఉపయోగించారు, వెనుక వైపు మోనోషార్ సస్పెన్షన్‌ను అమర్చారు. ర్యాలీ మరియు ర్యాలీ ప్రో వేరియంట్లలో ముందు వైపు షోవా నుంచి గ్రహించిన ఫోర్క్‌ని అమర్చారు. బేస్ వేరియంట్ రియర్-వీల్ ట్రావెల్ 170 ఎమ్.ఎమ్‌గా ఉంటుంది, మిడ్ అండ్ టాప్ ఎండ్ వేరియంట్లు సస్పెన్షన్ ట్రావెల్ 240 ఎమ్.ఎమ్‌గా ఉంటుంది.

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ట్రయంప్‌లో డిఫాల్ట్‌గా వచ్చే ఫీచర్లు కాకుండా కస్టమైజేషన్ కోసం కంపెనీ 65 యాక్ససరీలను కిట్‌లను ఆఫర్ చేస్తోంది. బేస్ వేరియంట్ ఎక్సెడిషన్ కిట్‌తో వస్తుంది, ర్యాలీ మరియు ర్యాలీ ప్రో వేరియంట్లు ట్రెక్కర్ కిట్‌తో వస్తాయి.

MOST READ: కరోనా నివారకు NHAI కొత్త టెక్నలాజి, ఏంటో తెలుసా..?

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ట్రైయంప్ టైగర్ 900 అడ్వెంచర్-టూరర్ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి - జిటి (రోడ్-ఫోకస్డ్), ర్యాలీ (ఆఫ్-రోడ్) మరియు ర్యాలీ ప్రో. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

ట్రయంపై టైగర్ 900 జిటి (రోడ్-ఫోకస్డ్) - రూ.13.70 లక్షలు

ట్రయంపై టైగర్ 900 ర్యాలీ (ఆఫ్-రోడ్) - రూ.14.35 లక్షలు

ట్రయంపై టైగర్ 900 ర్యాలీ ప్రో - రూ.15.50 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇక వేరే ట్రయంప్ వార్తల్లోకి వెళితే.. ట్రయంప్ ఇంటీవలే తమ పాపులర్ బోన్‌విల్ టి100, టి120 మోడళ్లలో కొత్తగా 'బ్లాక్ ఎడిషన్' పేరిట స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో ట్రయంప్ బోన్‌విల్ టి100 బ్లాక్ ఎడిషన్ ధర రూ.8.87 లక్షలుగా ఉంటే, ట్రయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ ధర రూ.9.97 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న ఒకినావా

భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

సరికొత్త ట్రయంప్ టైగర్ 900 బైక్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అడ్వెంచరస్ ఆఫ్-రోడింగ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లంటే ఇష్టపడే వారికి ట్రయంప్ టైగర్ 900 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అత్యుత్తమ ఆఫ్-రోడ్ బైకింగ్ సామర్థ్యాలు కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో కొత్తగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900 ఎక్స్ఆర్, డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Triumph Motorcycles have launched their all-new Tiger 900 adventure-tourer motorcycle in the Indian market. The all-new Triumph Tiger 900 replaces its predecessor, the Tiger 800 XR range in the Indian market. Read in Telug.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X