తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ గత నెలలో తమ ట్రైడెంట్ రోడ్‌స్టర్ కాన్సెప్ట్ మోటర్‌సైకిల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్ తుది పరీక్ష దశలో ఉంది.

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

ట్రైయంప్ 1970 చివర్లో బిఎస్ఏ (బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్) కంపెనీతో చేతులు కలిపి ట్రైడెంట్ మరియు బిఎస్ఏ రాకెట్ 3 అనే మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ తిరిగి 1990 ఆరంభంలో ట్రైడెంట్ పేరుతో 900సిసి ట్రిపుల్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. అయితే, ఆ మోటార్‌సైకిల్ 1998లో నిలిపివేయబడింది.

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

కాగా.. ట్రైయంప్ ముచ్చటగా మూడోసారి ట్రైడెంట్ పేరును తమ కొత్త 2021 మోటార్‌సైకిల్ కోసం ఉపయోగించనుంది. ట్రైయంప్ ట్రైడెంట్ 2021లో ఎప్పుడైనా విడుదల కావచ్చని సమాచారం. ఈ కొత్త రోడ్‌స్టర్ ట్రైయంప్ లైనప్ నుండి అత్యంత చౌకైన ఆఫర్‌గా ఉంటుందని మరియు దీనిని స్ట్రీట్ ట్రిపుల్ 765 మోడల్‌కు దిగువన ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

MOST READ:భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

ఈ ఏడాది చివరి నాటికి ట్రైయంప్ తమ ట్రైడెంట్ మోటార్‌సైకిల్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌ను ఆవిష్కరించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్‌ను కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విస్తృతంగా పరీక్షిస్తోంది.

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

చిత్రాలలో చూసినట్లుగా, ట్రైయంప్ ఇదివరకు ఆవిష్కరించిన ట్రైడెంట్ కాన్సెప్ట్ మోడల్‌కి మరియు ప్రొడక్షన్ మోడల్‌కి అనేక పోలికలు ఉండే అవకాశం ఉంది. ఇందులో విశాలమైన హ్యాండిల్‌బార్‌లు, గుండ్రటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, మోకాలి ఇండెంట్‌లతో కూడిన వంపులు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, స్టెప్-అప్ సీట్, పెరిగిన టెయిల్ డిజైన్, ఎక్స్‌పోజ్డ్ మెకానికల్ బిట్స్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ మరియు కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:బస్సుకి దారి ఇవ్వని బైకర్‌కి భారీ జరిమానా.. ఎంతో తెలుసా?

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

ఇంకా ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త 2021 ట్రైయంప్ ట్రైడెంట్‌ను రోడాల్ఫో ఫ్రాస్కోలి (గతంలో కొత్త ట్రైయంపై టైగర్ 900 మోడల్ కోసం కంపెనీతో కలిసి పనిచేశారు) రూపొందించారు.

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

ట్రైయంప్ ట్రైడెంట్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ఈ మోడల్‌ను సరికొత్త ట్యూబ్లర్ స్టీర్ ఛాస్సిస్‌పై తయారు చేయనున్నారు. దీని ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న ఫోర్కులు (అప్‌సైడ్ డౌన్ ఫోర్క్) మరియు వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ ఉంటాయి. ఇందులోని బ్రేక్‌లను నిస్సిన్ నుండి గ్రహించారు. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటుగా డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ కూడా ఉండే అవకాశం ఉంది.

MOST READ:మీకు తెలుసా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, ఇదే

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

ఇంజన్ పరంగా, ట్రైయంప్ ట్రైడెంట్లో గత తరం స్ట్రీట్ ట్రిపుల్ మరియు డేటోనా మోడళ్లలో ఉపయోగించిన 675 సిసి, లిక్విడ్-కూల్డ్ ట్రిపుల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. ఈ ఇంజన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది మరియు ఇది సుమారు 88 బిహెచ్‌పి శక్తి మరియు 65 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది మరియు ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు, అయితే ఈ మోటార్‌సైకిల్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు లభిస్తాయని తెలుస్తోంది.

MOST READ:ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

తుది దశ టెస్టింగ్‌లో ట్రైయంప్ ట్రైడెంట్; వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల!

ట్రైయంప్ ట్రైడెంట్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రైయంప్ ట్రైడెంట్ కాన్సెప్ట్ చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ ప్రదర్శించిన ప్రోటోటైప్‌కు మరియు ప్రొడక్షన్ వేరియంట్ చాలా పోలికలు ఉంటాయని తెలుస్తోంది. మార్కెట్లో ఇది కవాసకి జెడ్650 మరియు హోండా సిబి650ఆర్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

Most Read Articles

English summary
Last month, Triumph motorcycle unveiled the prototype of the Trident roadster globally and now the motorcycle is in its final testing stage. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X