టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

భారతదేశపు ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ టర్బోచార్జర్‌ను అమర్చిన ఓ కస్టమ్-మేడ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. 'ఎమ్‌జెఆర్ రోచ్' అని పిలిచే ఈ మోడల్‌ని రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి చెందిన కస్టమ్ బైక్ తయారీ విభాగం యూకె టెక్ సెంటర్ మోడిఫై చేసింది.

రెగ్యులర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఎమ్‌జెఆర్ రోచ్‌ను తయారు చేశారు. ఈ కస్టమ్ మేడ్ మోటార్‌సైకిల్‌కు చేసిన మార్పులు కాస్మోటిక్ వరకే పరిమితం కాకుండా ఇంజన్‌ను కూడా మార్పు చేశారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఇంజన్‌కు మరింత బూస్ట్ ఇచ్చేందుకు ఇందులో టర్బోచార్జర్‌ను అమర్చారు.

టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ఉపయోగించిన 411 సిసి ఎస్ఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ ఇంజన్‌కు గారెట్ జిటి 125 టర్బోను అమర్చారు. ఈ ఇంజన్‌కు చేసిన మోడిఫికేషన్‌లో ఇది ప్రారంభం మాత్రమే, ఎమ్‌జెఆర్ రోచ్‌లో తక్కువ బరువు కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ, కె అండ్ ఎన్ ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్, కొత్త ఫ్యూయెల్ పంప్ మరియు సింగిల్ సైడెడ్ ఎక్స్‌టెండెడ్ స్వింగ్ఆర్మ్ కూడా ఉన్నాయి.

MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి హీరో మోటోకార్ప్ కొత్త టార్గెట్, ఏంటో తెలుసా?

టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

ఈ మోడిఫికేషన్ అనంతరం మోటారుసైకిల్ ఇప్పుడు 50 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, పెంచిన వీల్‌బేస్ కారణంగా మోటార్‌సైకిల్ మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ మోడిఫైడ్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి ప్రస్తుతం లభిస్తున్న ట్విన్-సిలిండర్ ఇంజన్ పవర్ కన్నా ఎక్కువ. రెగ్యులర్ స్టాక్ ఇంజన్ 24.3 బిహెచ్‌పి శక్తిని మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ కస్టమ్ మోటార్‌సైకిల్‌ పవర్ స్టాండర్డ్ మోటార్‌సైకిల్ కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట.

టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

డిజైన్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్ బేర్-బోన్ రూపాన్ని (అంటే కేవలం ఫ్రేమ్, ఫ్యూయెల్ ట్యాంక్ మాత్రమే కనిపించే రూపాన్ని) కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ కస్టమ్ మేడ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌తో ఉంటుంది, ఇందులో నాలుగు ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి, ఇవన్నీ మెటల్ ఎన్‌క్లోజర్‌లో ఉంచబడతాయి. చూడటానికి ఇది మ్యాడ్ మ్యాక్స్ మూవీలో కనిపించే వాహనంలా అనిపిస్తుంది.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ రెగ్యులర్ హిమాలయన్ బైక్‌లో ఉపయోగించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌నే ఇందులో ఉపయోగించినప్పటికీ, దీనికి టర్బోచార్జ్డ్ ఇంజన్ కోసం బూస్ట్ గేజ్‌ను కూడా జోడించారు. ఇందులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ముందు భాగంలో బంగారు రంగులో ఫినిష్ చేసిన యూఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

ఈ మోటారుసైకిల్ డిజైన్‌లో మరో హైలైట్ ఏంటంటే, హెడర్ పైపును రెండుగా చీల్చినట్లు ఉండే కస్టమ్ మేడ్ ట్విన్ ఎగ్జాస్ట్‌ (సైలెన్సర్ పైప్). ఈ రెండు స్ప్లిట్ ఎగ్జాస్ట్‌లు పైకి లేచినట్లుగా ఉండి, మోటారుసైకిల్ కుడి వైపు కవర్ పక్కన అమర్చబడి ఉంటాయి.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కార్ డ్రైవ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

ఈ కస్టమ్ మేడ్ మోటార్‌సైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను మాత్రం మార్చలేదు. ఇందులో వెడల్పాటి సీట్ ఉంటుంది, అయితే ఈ మోటారుసైకిల్‌పై ఎవరైనా పిలియన్‌గా కూర్చోవడానికి ధైర్యం చేయరనేది మా అభిప్రాయం. ఎమ్‌జెఆర్ రోచ్ రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. అయితే, మరి ఇది ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుందా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ మోటారుసైకిల్‌లో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ షాడ్, 180/55 ప్రొఫైల్‌ టైర్లను కలిగి ఉంటుంది. ముందు భాగం మాత్రం స్టాండర్డ్ మోటారుసైకిల్ నుండి అసలు సెటప్‌ను కలిగి ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'ఎమ్‌జెఆర్ రోచ్' కస్టమ్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మరోసారి చాలా బహుముఖమైన మోటార్‌సైకిల్ అని నిరూపించబడింది. ప్రత్యేకించి బైక్ కస్టమైజేషన్ కోసం ఈ మోటార్‌సైకిల్ చాలా అనువుగా ఉంటోంది. ఈ మోటార్‌సైకిల్‌ను ఇప్పటికే స్క్రాంబ్లర్, కేఫ్ రేసర్, ఫ్లాట్ ట్రాక్ రేసర్ మోడళ్లుగా కస్టమైజ్ చేయగా, తాజాగా అపోకలిప్టిక్ కాలానికి అనువైన బైక్‌గా మార్చారు. ఏదేమైనప్పటికీ, ఎమ్‌జెఆర్ రోచ్‌లో ప్రధానమైన మార్పు, ఇంజన్‌కు శక్తినిచ్చే టర్బోచార్జర్‌ను జోడించడంగా చెప్పుకోవచ్చు.

MOST READ:గంటకు 300 కి.మీ వేగంతో రైడ్ చేసిన బెంగళూరు బైకర్ అరెస్ట్ ; 20 లక్షల బైక్ సీజ్

Most Read Articles

English summary
Royal Enfield has unveiled a custom-made Himlayan that is fitted with a turbocharger. Called the MJR Roach is built by the brand's custom bike development arm at the UK Tech Centre. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X