ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 టీవీఎస్ అపాచీ 160 లాంచ్, ధర రూ. 93,500 మాత్రమే

టీవీఎస్ మోటార్ కంపెనీ 2020 బిఎస్-6 అపాచీ ఆర్టీఆర్ 160 ని రూ. 93,500 (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 టీవీఎస్ అపాచీ 160 లాంచ్, ధర రూ. 93,500 మాత్రమే

పునర్నిర్మించబడిన టీవీఎస్ అపాచీలో క్లీనర్ పవర్ ప్లాంట్‌తో పాటు కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు ఫ్యూయల్-ఇంజెక్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ ఎక్స్-షోరూమ్ ధరలను గమనించినట్లయితే ఎంట్రీ లెవల్ ఫ్రంట్-డిస్క్ వేరియంట్‌కు 93,500 రూపాయలు మరియు ట్విన్-డిస్క్ వేరియంట్‌కు 96,500 రూపాయలుగా ఉంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 టీవీఎస్ అపాచీ 160 లాంచ్, ధర రూ. 93,500 మాత్రమే

2020 అపాచీ 4 వి శ్రేణి మోడళ్ల మాదిరిగానే ఆర్టిఆర్ 160 2వి సెగ్మెంట్-ఫస్ట్ గ్లైడ్ టెక్నాలజీని (జిటిటి) కలిగి ఉంది. ఇది పట్టణ వాతావరణంలో కూడా మంచి రైడింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఫ్యూయల్-ఇంజెక్షన్ వ్యవస్థకు ఇన్పుట్లను ఉపయోగించి థొరెటల్ ప్రతిస్పందనను సర్దుబాటు చేయడం ద్వారా మోటారుసైకిల్ గట్టి ట్రాఫిక్ పరిస్థితులలో నిలిచిపోకుండా సిస్టమ్ నిరోధిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 టీవీఎస్ అపాచీ 160 లాంచ్, ధర రూ. 93,500 మాత్రమే

ఈ మోటార్ సైకిల్ లో 159.7 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ సుమారు 15.3 బిహెచ్‌పి మరియు 13.9 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బిఎస్-4 మోడల్ అయితే 14.9బిహెచ్‌పి మరియు 13.03ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని బిఎస్-6 ఉద్గారా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయడం వల్ల వీటి ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ కి అనుసంధానించబడి ఉంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 టీవీఎస్ అపాచీ 160 లాంచ్, ధర రూ. 93,500 మాత్రమే

టివిఎస్ మోటార్ కంపెనీ అప్‌డేట్ చేసిన ఆర్‌టిఆర్ 160 లైన్ తన ఇతర ఉత్పత్తుల మాదిరిగానే రేసింగ్ ను ప్రదర్శిస్తుందని హామీ ఇచ్చింది. ఐకానిక్ డాకర్ ర్యాలీతో సహా భారతీయ మోటార్ స్పోర్ట్స్ రంగంతో పాటు విదేశాలలో కూడా ఈ సంస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 టీవీఎస్ అపాచీ 160 లాంచ్, ధర రూ. 93,500 మాత్రమే

2020 టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 2వి ఇప్పుడు ఆరు రంగులతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అవి పెర్ల్ వైట్, మాట్టే బ్లూ, మాట్టే రెడ్, గ్లోస్ బ్లాక్, గ్లోస్ రెడ్ మరియు టి గ్రే. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మోటార్ సైకిల్ యొక్క రంగుల పేర్లు దాదాపుగా చాలా సరళంగా ఉంటాయి, ఒక్క టి గ్రే' తప్ప.

ఇండియన్ మార్కెట్లో బిఎస్ 6 టీవీఎస్ అపాచీ 160 లాంచ్, ధర రూ. 93,500 మాత్రమే

అపాచీ ఆర్టిఆర్ 160 మార్కెట్లో బజాజ్ పల్సర్ 150 కి ప్రత్యర్థిగా ఉంటుంది . దాదాపు 15 సంవత్సరాలుగా 150-160 సిసి మోటారుసైకిల్ విభాగంలో చాలా వాహనాలు వెలువడ్డాయి . అవి యమహా ఎఫ్‌జడ్ 15 వి 3.0, సుజుకి జిక్సెర్ 150, హోండా సిబి హార్నెట్ 160 ఆర్, మరియు ప్రస్తుత తరం బజాజ్ పల్సర్ 150 ఉన్నాయి. టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 4 వి కూడా మార్కెట్లో మంచి అంతర్గత పోటీని ప్రదర్శిస్తుంది.

Most Read Articles

English summary
TVS Apache 160 BS6 launch price Rs 93.5k – Bookings open. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X