గుడ్ న్యూస్... జనవరి 25 న లాంచ్ చేయనున్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కంపెనీలలో టీవీఎస్ కంపెనీ ఒకటి. టీవీఎస్ కంపెనీ ఇప్పటికే చాలా వాహనాలను మార్కెట్లోకి విడుదలచేయడం జరిగింది. ఇప్పుడు టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 వెహికల్ ని జనవరి 25 న ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

గుడ్ న్యూస్... జనవరి 25 న లాంచ్ చేయనున్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310

టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310, 2017 లో భారతదేశంలో లాంచ్ చేయబడి భారతీయ ద్విచక్ర వాహనాల తయారీకే విజయకేతనంగా నిలిచింది. ఇప్పుడు అదే అపాచీ మోటారుసైకిల్‌కు కొన్ని కాస్మెటిక్ ట్వీక్స్ మరియు కొన్ని కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310 ని బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా జనవరి 25, 2020 న కంపెనీ విడుదల చేయనుంది.

గుడ్ న్యూస్... జనవరి 25 న లాంచ్ చేయనున్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310

బిఎస్ 6 ఆర్ఆర్ 310 లో కనిపించే కొన్ని ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో ఆల్-న్యూ ఫుల్లీ-డిజిటల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది. ఇది మోటారుసైకిల్‌కు చేసిన అతిపెద్ద నవీకరణ అని చెప్పవచ్చు. రేసింగ్-ఇన్స్పైర్డ్ గ్రాఫిక్‌లతో సరికొత్త డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ ఉంటుంది. ఆర్ఆర్ 310 ట్రాక్స్‌లో మెరుగైన పనితీరు కోసం ఇప్పుడున్న వాటికంటే మెరుగైన టైర్లను కలిగి ఉంటుంది.

గుడ్ న్యూస్... జనవరి 25 న లాంచ్ చేయనున్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310

బిఎస్ 6 అపాచీ ఆర్ఆర్ 310 అదే 312 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది. ప్రస్తుత తరం ఇంజిన్ 9,700 ఆర్‌పిఎమ్ మరియు 27.3 ఎన్ఎమ్ పీక్ టార్క్ వద్ద 34 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడి ఉంటుంది.

గుడ్ న్యూస్... జనవరి 25 న లాంచ్ చేయనున్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310

ఈ మార్పులు మాత్రమే కాకుండా, కొత్త బిఎస్ 6 ఆర్ఆర్ 310 మోటారుసైకిల్‌లో ఒకే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ టైల్లైట్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ మరియు స్లిప్పర్ క్లచ్ ఉంటాయి. అపాచీ ఆర్ఆర్ 310 అగ్రశ్రేణి ఏరోడైనమిక్ పనితీరును అందించడానికి విస్తృతంగా రూపొందించబడింది. ఈ మోటారుసైకిల్ మునుపటి కంటే సున్నితంగా ఉంటుంది.

గుడ్ న్యూస్... జనవరి 25 న లాంచ్ చేయనున్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310

ప్రస్తుత బిఎస్ 4 మోడల్ ధర రూ .2.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాబట్టి కొత్తగా వస్తున్న బిఎస్ 6 వేరియంట్ ప్రస్తుతం ఉన్న బిఎస్ 4 మోడల్ కంటే ఎక్కువ ప్రీమియంని కలిగి ఉంటుంది. అంటే అపాచీ ఆర్ఆర్ 310 ధర దాదాపుగా 2.50 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

గుడ్ న్యూస్... జనవరి 25 న లాంచ్ చేయనున్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

టివిఎస్ పోర్ట్‌ఫోలియో నుండి బిఎస్ 6 అపాచీ ఆర్ఆర్ 310 మోటార్ సైకిల్ ని లాంచ్ చేసిన తర్వాత, ఇది కెటిఎమ్ ఆర్‌సి 390, బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మరియు బజాజ్ డొమినార్ 400 లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2020, 12:33 [IST]
English summary
TVS Apache RR310 BS6 Is Expected To Launch On 25th Of January. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+