టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహనతయారీదారులలో ఒకటిగా పేరు గాంచిన ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి బ్రాండ్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ప్రవేశపెట్టింది. టీవీఎస్ సంస్థ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుందాం.. !

హోసూర్ ఆధారిత సంస్థ అయిన టీవీఎస్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 యొక్క రిఫ్రెష్ వెర్షన్ను విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ షార్ప్ స్టయిలింగ్ తో పునః రూపకల్పన చేయబడింది.

కొత్తగా రూపకల్పన చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ధర దాదాపు రూ. 2.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్తగా రిఫ్రెష్ చేసిన ఈ మోడెల్లో స్మార్ట్ ఫోన్ సపోర్ట్ మరియు కొత్త బాడీ గ్రాఫిక్స్ తో పాటు టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ను కలిగి ఉంది.

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ 313 సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 27.3 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా స్లిప్పర్ క్లచ్‌తో ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడుతుంది.

ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. ఇటీవల కాలంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ అపాచీ మోటార్‌సైకిల్‌ను మరింత సొగసైనదిగా చిత్రించింది.ప్రస్తుతానికి కంపెనీ ఈ మోటార్ సైకిల్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసే ప్రణాళికలో ఉంది.

ఈ చిత్రాలలో కనిపించినట్లు టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ఆధారిత ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ అసలు రూపకల్పనలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ దాని గ్రాఫిక్స్ మరియు కలర్ స్కీమ్‌లో చిన్న పునర్విమర్శలను పొందుతుంది. ఈ విధంగా పునః రూపకల్పన చేయడం వల్ల ఇది కొత్త రూపాన్ని కలిగి ఉంటుంది.

ఈ కొత్త బైక్ ఫ్రంట్ ఎండ్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లను కోల్పోగా, వెనుక-ఎండ్ మరింత అధునాతన స్వింగార్మ్‌తో వస్తుంది. ఈ మోటారుసైకిల్ ప్రస్తుత అవతార్ కంటే చాలా ఫ్యూచరిస్టిక్ గా కనిపించడంలో ఈ రెండు అంశాలు ఏకువ పాత్రను పోషిస్తాయి.

ఏది ఏమైనా పునఃరూపకల్పన చేసిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ప్రస్తుతానికి ఒక ఊహాచిత్రం మాత్రమే. ఇప్పటికి మోటార్ సైకిల్ తయారీదారు ఈ మోటారుసైకిల్‌ను ప్రొడక్షన్ రియాలిటీగా మార్చే ప్రణాళికలు లేవు. కానీ ఈ చిత్రానికి దగ్గరగా ఉండే విధంగా ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల చేస్తున్నాడని ఆశించవచ్చు.
Image Courtesy: Simon Designs


Click it and Unblock the Notifications








