అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

భారత ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న బిఎస్6 వెర్షన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మోటార్‌సైకిల్ ధరను రూ.3,500 మేర పెంచింది. దీంతో మార్కెట్లో ఈ బైక్ ధర రూ.1 లక్షకు చేరుకుంది. విపణిలో టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బిఎస్6 డ్రమ్ బ్రేక్స్ మరియు డిస్క్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

ప్రస్తుతం భారత మార్కెట్లో టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బైక్ డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.97,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంటే డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.1,00,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కాగా.. బిఎస్4 మరియు బిఎస్6 వెర్షన్లలో కేవలం కాలుష్య నిబంధనల్లో మార్పు తప్ప ఇంజన్, పెర్ఫార్మెన్స్‌లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ల్యాప్ టైమర్‌తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 0-60 మరియు టాప్ స్పీడ్ రికార్డర్, ఆకర్షనీయమైన గ్రాఫిక్స్, స్పోర్టీ ఇంజన్ ప్యానెల్, సింగిల్ ఛానెల్ సూపర్ మోటో ఏబిఎస్ వంటి విశిష్టమైన ఫీచర్లు టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బిఎస్6 సొంతం. ఈ బైక్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (పెరల్ వైట్, మ్యాట్ బ్లూ, గ్లాస్ రెడ్, గ్లాస్ బ్లాక్, టి గ్రే మరియు మ్యాట్ రెడ్) లభిస్తుంది.

MOST READ: కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్

అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బైక్‌లో ఉపయోగించిన 159.7 సీసీ సింగిల్-సిలిండర్ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 15 బిహెచ్‌పిల శక్తిని, 13.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో లభిస్తుంది.

అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

ఇక టీవీఎస్‌కి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఈ కంపెనీ ఇటీవలే తమ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి మరియు అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేంజ్ మోటార్‌సైకిళ్ల ధరలను కూడా పెంచింది. మోడల్‌ను బట్టి రూ.2,500 వరకూ ధరలు పెరిగాయి. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధరలను అప్‌డేట్ చేశారు.

MOST READ: భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

టీవీఎస్ తమ కొత్త అపాచే ఆర్‌టిఆర్ 160 4వి మరియు 200 4వి మోడళ్లలో కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, రీపొజిషన్ చేసిన ల్యాంప్స్,ఫెదర్ టచ్ స్టార్ట్ బటన్, కొత్త బాడీ గ్రాఫిక్స్, ఆగి ఆగి వెళ్లే సిటీ ట్రాఫిక్‌లో సులువుగా దూసుకుపోయేలా డిజైన్ చేసిన కంపెనీ జిటిటి (గ్లైడ్ త్రూ టెక్నాలజీ) వంటి ఫీచర్లను ఇందులో జోడించారు. అపాచే ఆర్‌టిఆర్ 200 4విలో 160 4వి కన్నా ఒకటి రెండు ఫీచర్లు ఎక్కువే ఉన్నాయి. ఇందులో అదనంగా బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైక్‌లో కొత్త 197.75 సీసీ సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఫోర్-వాల్వ్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పిల శక్తిని, 16.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బిఎస్4 ఇంజన్‌తో పోల్చుకుంటే బిఎస్6 కొంచెం తక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బిఎస్4 ఇంజన్ గరిష్టంగా 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేసేది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

MOST READ: 3 కోట్ల విలువైన కార్లు దొంగలించిన దొంగల ముఠా, తర్వాత ఏం జరిగించే తెలుసా ?

అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ తాజాగా తమ అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 ధరను పెంచడంతో కంపెనీ అందిస్తున్న మొత్తం అపాచే ఆర్‌టిఆర్ సిరీస్ ధరలు కూడా పెరిగనట్లయింది. ధరల పెంపుకు కంపెనీ ఎలాంటి కారణాన్ని వెల్లడించకపోయినప్పటికీ, బిఎస్6 ఇంజన్ అప్‌గ్రేడ్ లేదా కోవిడ్-19 పరిస్థితులు కారణం అయిడొంచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
The Hosur-based two-wheeler giant TVS has increased the price of the TVS Apache RTR 160 BS6. The motorcycle is now priced at a hike of Rs 3,500 more, and now touches the Rs 1 lakh mark. The Apache RTR 160 BS6 is available in two variants - Drum and Disc. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X