ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 మోటార్‌సైకిల్ ధరను మరోసారి పెంచింది. ఈ ఏడాదిలో అపాచే ఆర్‌టిఆర్ 180 బైక్ ధరలు పెరగడం ఇది రెండవసారి. గడచిన మార్చ్ నెలలో టీవీఎస్ ఇందులో బిఎస్6 వెర్షన్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొదటి సారి ధరలను పెంచింది.

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

ఆ తర్వాత ఇప్పుడు ఈ బైక్ ధరను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొదటి సారి ధరల పెంపు తర్వాత టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 బైక్ ధర రూ.1,01,450గా ఉంటే, తాజాగా రూ.2,500 ధరను పెంచడంతో ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ.1,03,950కి పెరిగింది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

బిఎస్6 కి అప్‌గ్రేడ్ చేసిన కొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 బైక్‌లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రేసింగ్ గ్రాఫిక్స్, మరింత పెద్దగా ఉండే ఫ్యూయెల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, సింగిల్ పీస్ సీట్, ఇంజన్ క్రింది భాగంలో ఉండే కవర్స్, స్ప్లిట్ పిలియన్ గ్రాబ్ రెయిల్, అల్లాయ్ వీల్స్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్, ముందు వైపు 270 మి.మీ. పెటల్ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక వైపు 200 మి.మీ పెటల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇందులో సింగిల్ చానెల్ సూపర్ మోటో ఏబిఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది.

MOST READ: మలేషియా పోలీస్ ఫోర్స్‌లో చేరిన హోండా సివిక్ కార్లు

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180లో ఉపయోగించిన 177.4 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 16 బిహెచ్‌పిల శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 15.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన రేస్ ట్యూన్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఆర్‌టి-ఎఫ్ఐ) ఇంజన్. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

ఇక టీవీస్‌కి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. కంపెనీ అందిస్తున్న బిఎస్6 వెర్షన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మోటార్‌సైకిల్ ధరను కూడా రూ.3,500 మేర పెంచింది. దీంతో మార్కెట్లో ఈ బైక్ ధర రూ.1 లక్షకు చేరుకుంది. విపణిలో టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బిఎస్6 డ్రమ్ బ్రేక్స్ మరియు డిస్క్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ: 19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

ప్రస్తుతం భారత మార్కెట్లో టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బైక్ డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.97,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంటే డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.1,00,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కాగా.. బిఎస్4 మరియు బిఎస్6 వెర్షన్లలో కేవలం కాలుష్య నిబంధనల్లో మార్పు తప్ప ఇంజన్, పెర్ఫార్మెన్స్‌లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ల్యాప్ టైమర్‌తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 0-60 మరియు టాప్ స్పీడ్ రికార్డర్, ఆకర్షనీయమైన గ్రాఫిక్స్, స్పోర్టీ ఇంజన్ ప్యానెల్, సింగిల్ ఛానెల్ సూపర్ మోటో ఏబిఎస్ వంటి విశిష్టమైన ఫీచర్లు టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బిఎస్6 సొంతం. ఈ బైక్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (పెరల్ వైట్, మ్యాట్ బ్లూ, గ్లాస్ రెడ్, గ్లాస్ బ్లాక్, టి గ్రే మరియు మ్యాట్ రెడ్) లభిస్తుంది.

MOST READ: కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 బైక్‌లో ఉపయోగించిన 159.7 సీసీ సింగిల్-సిలిండర్ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 15 బిహెచ్‌పిల శక్తిని, 13.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో లభిస్తుంది.

ఈ ఏడాదిలో రెండు సార్లు పెరిగిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 ధరలు

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 బైక్‌పై వరుసగా రెండోసారి ధరను పెంచడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ గడచిన మార్చ్ నెలలో బిఎస్6 అప్‌గ్రేడ్ కారణంగా తమ అపాచే ఆర్‌టిఆర్ 180 బిఎస్6 వేరియంట్ ధరను మొదటిసారి పెంచింది. అయితే, తాజాగా ఈ మోడల్‌పై రెండోసారి కూడా ధరను పెంచింది. ప్రస్తుత ధరల పెంపుకు సంబంధించి కంపెనీ ఎలాంటి కారణాన్ని వెల్లడించకపోయినప్పటికీ, కోవిడ్-19 వల్ల ఏర్పడిన పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం అయిడొంచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
The TVS Apache RTR 180 received a price hike along with the BS6 upgrade in March, and now, it has received another hike in its prices. When the BS6 update happened in March, earlier this year, it carried a price tag of Rs 1,01,450. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X