టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో కొత్త అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోటర్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2020 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఇప్పుడు సూపర్ మోటో ఏబీఎస్‌తో లభ్యం కానుంది. మార్కెట్లో దీని ధర రూ.1,23,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇందులో నిరుత్సాహ పరచే అంశం ఏంటంటే, అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఇప్పుడు కేవలం సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇకపై ఇందులో డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ లేదా స్విచబల్ ఏబిఎస్ మోడ్ అందుబాటులో ఉండబోదు. ఈ ఒక్క మార్పు మినహా కొత్త అపాచే ఆర్‌టిఆర్ 200 4విలో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4విలో ఫెదర్ టచ్ స్టార్ట్, డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్, స్టాప్-స్టార్ట్ ట్రాఫిక్‌లో ఇంధనం ఆదా చేయటానికి బ్రాండ్ (జిటిటి) గ్లైడ్ త్రూ టెక్నాలజీ మరియు బ్రాండ్ యొక్క స్మార్ట్ఎక్స్ కనెక్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్ టెలిమెట్రీ డేటాతో సహా అనేక సమాచారాన్ని అందిస్తుంది.

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇంజన్ విషయానికి వస్తే, కొతత్ 2020 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4విలో ఇదివరకటి 197.75 సిసి సింగిల్ సిలిండర్, ఫోర్-వాల్వ్, ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.8 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ మోటార్‌సైకిల్‌లో భాగాలైన సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ హార్డ్‌వేర్ వంటి విడిభాగాలను కూడా బిఎస్4 మోడల్ నుండే గ్రహించారు. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇరువైపులా పెటల్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అపాచే ఆర్‌టిఆర్ 200 4వి పెరల్ వైట్ మరియు గ్లోస్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.

MOST READ:విదేశీ దళాలు ఉపయోగిస్తున్న మేడ్ ఇన్ ఇండియా కార్లు, ఇవే

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టీవీఎస్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ 'టీవీఎస్ రేడియాన్'ను ఇప్పటి వరకూ మూడు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నట్లు టీవీఎస్ తెలిపింది.

టీవీఎస్ రేడియాన్ బిఎస్6 మోడల్ ఇప్పుడు కొత్తగా రీగల్ బ్లూ మరియు క్రోమ్ పర్పుల్ అనే రెండు కొత్త రంగులలో లభ్యం కానుంది. ఈ కొత్త వేరియంట్లలో కేవలం కలర్ మార్పు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇదివరకటి రేడియాన్ మోటార్‌సైకిళ్లలో లభించే అన్ని ఫీచర్లు ఇందులో కూడా లభ్యం కానున్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టీవీఎస్ రేడియాన్ బిఎస్6 మోటార్‌సైకిల్‌లో ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే కొత్తగా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులోని 109.7సిసి ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఇంజన్ గరిష్టంగా 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 ప్రో, స్పోర్ట్ ప్రో విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోటార్‌సైకిల్ సెల్లింగ్ పాయింట్‌లో ప్రధానమైనది డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్. అయితే, కంపెనీ ఇప్పుడు ఇందులో ఆ ఆప్షన్‌ను తొలగించి, సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌గా మార్చింది. ఈ మార్పు వలన ఆర్‌టిఆర్ 200 4వి అమ్మకాలు ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Most Read Articles

English summary
TVS Motor has launched the TVS Apache RTR 200 4V motorcycle with Super-Moto ABS at Rs 1,23,500 ex-showroom (Delhi). Sadly, now the Apache RTR 200 4V will be offered with a single-channel ABS instead of the dual-channel or switchable ABS mode. Other than this, nothing has been changed on the motorcycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X