Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మూడవసారి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపు - వివరాలు
చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తమ బిఎస్6 వెర్షన్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ స్కూటర్ విడుదల సమయంలోనేక కంపెనీ దాని బిఎస్4 వెర్షన్‌తో పోల్చుకుంటే రూ.7,500 అధిక ధరతో బిఎస్6 మోడల్‌ను విడుదల చేసింది.

గడచిన నెలలో కూడా కంపెనీ ఈ స్కూటర్ ధరలను స్వల్పంగా పెంచింది. తాజా నివేదికల ప్రకారం, టీవీఎస్ మరోసారి బిఎస్6 ఎన్‌టార్క్ 125 ధరలను పెంచింది. తాజాగా ఈ స్కూటర్ ధర అన్ని వేరియంట్లపై రూ.1,000 మేర పెరిగింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి - డ్రమ్, డిస్క్ మరియు రేస్ ఎడిషన్. ధరలు పెరిగిన తర్వాత, ఇప్పుడు ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.67,885 వద్ద ఉండగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.71,885 మరియు రేస్ ఎడిషన్ ధర రూ.74,365 లకు పెరిగింది ) అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
MOST READ:గాడిదలను డీలర్‌షిప్‌కు తీసుకువచ్చిన జావా బైక్ ఓనర్, ఎందుకో తెలుసా ?

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బిఎస్6 స్కూటర్ చూడటానికి బిఎస్4 మోడళ్ల మాదిరిగానే ఉంది. ఈ స్కూటర్‌ను బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ అప్‌గ్రేడ్ మినహా వేరే ఇతర మార్పులు ఏవీ లేవు. ఇందులోని 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఇప్పుడు ఇంధన-ఇంజెక్షన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 9.1 బిహెచ్‌పి శక్తిని మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

అప్‌గ్రేడెడ్ బిఎస్6 స్కూటర్ దాని బిఎస్4 వెర్షన్‌తో పోలిస్తే కొంచెం బరువుగా ఉంటుంది. బిఎస్6 ఎన్‌టార్క్ 125లో ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యాన్ని 5 లీటర్ల నుంచి 5.8 లీటర్లకు పెంచారు. ఇవి కాకుండా, స్కూటర్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు.
MOST READ:బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ; ఫుల్ డీటైల్స్

టీవీఎస్ ఎన్‌టార్క్ 125లో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఉంటుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో జత చేసుకోవచ్చు. బయటి వైపు ఉండే ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్ మరియు ఎల్‌ఈడి లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్ ఎగ్జాస్ట్ నోట్ ఇందులో ప్రధానంగా ఆకట్టుకునే ఫీచర్.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 తో పాటు, కంపెనీ తన జూపిటర్ బిఎస్6 స్కూటర్ ధరలను కూడా పెంచింది. తాజా ధరల పెరుగుదల తరువాత, టీవీఎస్ జూపిటర్ ప్రారంభ ధర రూ.63,102 వద్ద ఉండగా, టాప్-స్పెక్ క్లాసిక్ వేరియంట్ ధర రూ. 69,602 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బిఎస్6 నిబంధనల కారణంగా, పెరిగిన ఉత్పాదక వ్యయం మరియు ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల కారణంగా మార్కెట్లోని చాలా మంది తయారీదారుల మాదిరిగానే, టీవీఎస్ కూడా తమ బిఎస్6 మోడళ్ల ధరలను పెంచినట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ఈ సెగ్మెంట్లో బెస్ట్ స్పోర్ట్స్ స్కూటర్‌గా ఉంటుంది. ఇది హోండా డియోకి పోటీగా ఉంటుంది.