టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ అపాచే ఆర్‌టిఆర్ శ్రేణి ధరలను మరోసారి పెంచింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 అప్‌డేట్ చేసిన తర్వాత వీటి ధరలను పెంచడం ఇది రెండవసారి.

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

అపాచే ఆర్‌టిఆర్ 160, అపాచే ఆర్‌టిఆర్ 160 4వి, అపాచే ఆర్‌టిఆర్ 180 మరియు అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోడళ్లు ఈ ధరల పెంపును అందుకున్నాయి. ఆర్‌టిఆర్ శ్రేణిలోని మిగిలిన మోటారుసైకిళ్లు కూడా ఈ పెద్ద ఇంజన్ మోడళ్ల మాదిరిగానే ధరల పెరుగుదలను అందుకుంటాయి.

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

భారత మార్కెట్లో టీవీఎస్ ఈ మోటారుసైకిళ్ల ధరలను రూ.1,050 మేర పెంచింది. అపాచే ఆర్‌టిఆర్ సిరీస్‌లోని ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్, 160 డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధరల పెరుగుదల తర్వాత ఈ రెండు మోడళ్లు ధరలు వరుసగా రూ.98,050 మరియు రూ.1,01,050 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

MOST READ:భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

ఈ మోడళ్లోల అప్‌గ్రేడ్ చేయబడిన బిఎస్6 ఇంజన్ మాత్రమే కాకుండా, దాని బిఎస్4 మోడల్‌తో పోల్చుకుంటే అనేక ఇతర మార్పులను కూడా కలిగి ఉంది. ఇందులో 159.7 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 15 బిహెచ్‌పి శక్తిని మరియు 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

అపాచే ఆర్‌టిఆర్ 160 4 వాల్వ్ మోడల్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు కూడా పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత, డ్రమ్ బ్రేక్ మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1,04,000 మరియు రూ.1,07,050 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

MOST READ:ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బిఎస్6 మోటార్‌సైకిల్‌లో 159.7 సిసి, సింగిల్ సిలిండర్, ఫోర్-వాల్వ్, ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 15.8 బిహెచ్‌పి గరిష్ట శక్తి ఉత్పత్తి మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.12 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బిఎస్4 వెర్షన్ కంటే ఇది 0.8 బిహెచ్‌పి మరియు 0.7 ఎన్ఎమ్ తక్కువ పవర్, టార్క్‌లను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

అపాచే ఆర్‌టిఆర్ 180 బిఎస్6 కూడా సంస్థ నుండి రెండవసారి ధరల పెరుగుదలను అందుకుంది. ఈ మోటార్‌సైకిల్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. ధరల పెంపు తర్వాత దీని ధర రూ.1,05,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

MOST READ:కెటిఎమ్ డ్యూక్ 390 ఇంజిన్ కేస్ బ్రోకెన్, ఎలాగో తెలుసా ?

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

ఆర్‌టిఆర్ 180 మోటార్‌సైకిల్ మార్కెట్లో మొదటగా ప్రవేశపెట్టిన ఆర్‌టిఆర్ మోటార్‌సైకిల్ యొక్క అసలైన రూపకల్పనను కలిగి ఉంటుంది. ఈ ఏడాది కంపెనీ ఈ మోడల్‌లోని కాస్మోటిక్ అప్‌డేట్స్ చేసింది. కానీ, బైక్ యొక్క ఓవరాల్ సిల్హౌట్ మాత్రం అలానే ఉంటుంది.

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180లో బ్రాండ్ యొక్క రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ఆర్టీ-ఫై)తో 177.4 సిసి ఎయిర్ / ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 16 బిహెచ్‌పి శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 15.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:టొయోటా అర్బన్ క్రూజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ ఇమేజ్ లీక్!

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

ఆర్‌టిఆర్ సిరీస్‌తో పాటు భారత మార్కెట్లో విక్రయిస్తున్న అపాచే ఆర్‌ఆర్ 310 ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ ధరలను కూడా కంపెనీ ఇటీవలే పెంచింది. ఆర్‌టిఆర్ సిరీస్ మాదిరిగా కాకుండా, ఆర్ఆర్310 ధరలు దాని బిఎస్6 అప్‌గ్రేడ్ తర్వాత పెరగటం ఇదే మొదటిసారి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టీవీఎస్ అపాచే సిరీస్ బైక్‌ల ధరల పెంపు - ఇలా పెంచడం రెండవసారి

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ మోటార్ కంపెనీ బిఎస్6 అప్‌డేట్ తర్వాత మళ్లీ అపాచే ఆర్‌టిఆర్ లైనప్‌లో తమ అన్ని మోడళ్ల ధరలను మరోసారి పెంచింది. చెన్నైకి చెందిన ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ వరుసగా రెండవసారి ధరల పెంచడం వెనుక కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. కోవిడ్-19 వ్యాప్తి తర్వాత దేశంలో అనేక ఆటోమొబైల్ కంపెనీ ఆర్థికంగా నష్టపోయాయి, బహుశా ఆ నష్టాలను పూడ్చుకునేందుకే కస్టమర్లపై భారం మోపుతున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
TVS Motor Company has announced prices increase for its Apache RTR range in the Indian market. These motorcycles now receive a price hike for the second time after its BS6 update earlier this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X