రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

టీవీఎస్ మోటార్ కంపెనీ కంపెనీ అందిస్తున్న ప్రీమియం స్కూటర్ 'జూపిటర్' బిఎస్6 మోడల్ ధరను కంపెనీ మరోసారి పెంచింది. ఈసారి అన్ని బిఎస్6 జూపిటర్ వేరియంట్లపై ధరలు రూ.1,040 మేర పెరిగాయి. గత నెలలో కూడా టీవీఎస్ తమ జూపిటర్ స్కూటర్ ధరలను అన్ని వేరియంట్లపై రూ.651 వరకూ పెంచిన సంగతి తెలిసినదే.

రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

పెరిగిన ధరల తర్వాత ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ బేస్ వేరియంట్ ధర రూ.63,102గా ఉండగా, జెడ్‌ఎక్స్ వేరియంట్ ధర రూ.65,102 మరియు క్లాసిక్ వేరియంట్ ధర రూ.69,602 గానూ (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

టీవీఎస్ జూపిటర్ బిఎస్6 స్కూటర్‌లో దాని మునుపటి బిఎస్4 మోడల్‌లో కనిపించిన అనేక ఫీచర్లను క్యారీ చేశారు. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆప్రాన్‌లో గ్లోవ్‌బాక్స్, బయట ఉండే ఫ్యూయెల్ క్యాప్, 21-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్లాసిక్ వేరియంట్‌లో ప్రత్యేకంగా విండ్‌షీల్డ్ లభిస్తుంది. జెడ్‌ఎక్స్ మరియు క్లాసిక్ వేరియంట్‌లలో యుఎస్‌బి ఛార్జర్ ఆప్షన్ లభిస్తుంది.

రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

ఇంజన్ విషయానికి వస్తే, టీవీఎస్ జూపిటర్ బిఎస్6 స్కూటర్‌లో 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఇప్పుడు ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 7.4 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

టీవీఎస్ జూపిటర్ బిఎస్6 స్కూటర్‌లో కొత్తగా ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం వలన ఇది, మునుపటి మోడళ్లతో పోల్చుకుంటే మెరుగైన రీఫైన్‌మెంట్‌ను కలిగి ఉంటంతో పాటుగా ఉత్తతమైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తుంది. అదే సమయంలో పనితీరు విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండదు.

రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

టీవీఎస్ జూపిటర్ సప్పెషన్‌ను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్స్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విభాగానికి సంబంధించినంతవరకు, ఈ స్కూటర్‌లో ముందు వైపు 130 మి.మీ డ్యూయల్ డ్రమ్ బ్రేక్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

ఇందులో 90/90 సెక్షన్ ట్యూబ్ లెస్ టైర్లను జోడించిన రెండు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అయితే, బిఎస్4 మోడళ్లలో కనిపించినట్లుగా, జెడ్‌ఎక్స్ వేరియంట్‌పై ఆఫర్ చేసిన ఆప్షనల్ డిస్క్ బ్రేక్ ఫీచర్‌ను కంపెనీ బిఎస్6 మోడళ్లలో నిలిపివేసింది.

రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

టీవీఎస్ జూపిటర్ బిఎస్6 ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 తర్వాత ఇలా వరుసగా రెండవసారి కూడా టీవీఎస్ జూపిటర్ బీఎస్6 ధర పెరగడం విచారకరం. ఈ మహమ్మారి తర్వాత దేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న తరుణంలో స్కూటర్ల ధరలను పెంచడం సరికాదనేది మా అభిప్రాయం.

More from DriveSpark

Article Published On: Friday, July 24, 2020, 16:10 [IST]
English summary
TVS Motor Company has once again increased the price of Jupiter BS6 scooter. This time around, all the variants of the BS6 scooter receive a price hike of around Rs 1,040. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+