Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విపణిలోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
టీవీఎస్ మోటార్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఐక్యూబ్ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 లక్షలుగా కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు.

హోసూర్ కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్స్ తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ "ఐక్యూబ్"ను తొలుత బెంగళూరులో మాత్రమే విక్రయిస్తోంది. జనవరి 27, 2020 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. దీని మీద ఇప్పటికే 5 వేల రూపాయలతో బుకింగ్స్ కూడా ప్రారంభించారు.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి. యువ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని ప్రవేశపెట్టిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కనెక్టెడ్ టెక్నాలజీని కూడా అందించారు.

ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు మరియు ఇల్యుమినేటెడ్ లోగో వంటివి వచ్చాయి. డిజైన్ పరంగా చూసుకుంటే సింపుల్ మరియు స్టైలిష్ డిజైన్‌లో డెవలప్ చేశారు. ప్రస్తుతానికైతే ఇది సింగల్ పెయింట్ స్కీమ్‌లో మాత్రమే లభిస్తోంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, జియో-ఫెన్సింగ్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, న్యావిగేషన్ అసిస్ట్, ఇన్‌కమింగ్ కాల్స్/మెసేజ్ అలర్ట్ ఇంకా ఎన్నో ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సాంకేతికంగా 4.4kW సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ కలదు, దీని గరిష్ట వేగం గంటకు 78కిలోమీటర్లు మరియు 4.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-40కిమీల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 75కిలోమీటర్లు నడుస్తుంది.

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్-ఛార్జింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది, దీనికి తోడు కస్టమర్ల సౌకర్యం కోసం పలు ప్రాంతాల్లో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎకానమీ మరియు పవర్ అనే రైడింగ్ మోడ్స్‌తో పాటు క్యూ-పార్క్ అసిస్ట్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా వచ్చాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ యొక్క మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ స్కూటర్. మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యూబ్ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ఇది విపణిలో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు ఏథర్ 450 స్కూటర్‌కు గట్టి పోటీనిస్తుంది.