Just In
- 11 hrs ago ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- 12 hrs ago పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- 13 hrs ago ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్‌లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
- 13 hrs ago మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్.. బుక్ చేసుకున్న వారికి పండగే!
Don't Miss
- Movies Karthika Deepam 2 బంటును టార్గెట్ చేసిన దీప.. అనుమానంతో అలా!
- News కలలో శ్రీరామ దర్శనం.. మీ జీవితంలో ఊహించని అద్భుత ఫలితం
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
బిఎస్ 6 టీవీఎస్ జుపీటర్ : ఫీచర్స్, ప్రైస్, ఇతర వివరాలు
చెన్నై ఆధారిత కంపెనీ అయిన టీవీఎస్ తన బ్రాండ్ అయిన బిఎస్ 6 జుపీటర్ మోడల్స్ ని విడుదల చేయకముందే దాని యొక్క స్పెసిఫికేషన్లను విడుదల చేసింది. టీవీఎస్ విడుదల చేసిన ఈ స్పెసిఫికేషన్లను గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !
టీవీఎస్ స్కూటర్‌లోకి తీసుకువచ్చిన కొత్త మార్పులలో బ్యాటరీని సీటు కింద నుండి ఫ్రంట్ ఆప్రాన్‌కు మార్చడం, అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ 17 లీటర్ల నుండి 21 లీటర్లకు పెంచబడింది. ఇప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ సామర్త్యాన్ని 5 లీటర్ల నుండి 6 లీటర్ల పెంచడం జరిగింది.
బిఎస్ 6 టీవీఎస్ జుపీటర్ ఇప్పుడు 104 కిలోల నుండి 107 కిలోల మధ్య బరువును కలిగి ఉంది. ప్రస్తుత టీవీఎస్ స్కూటర్ మునుపటి మోడల్స్ కంటే 15 శాతం వరకు ఎక్కువ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.
బిఎస్ 6 టివిఎస్ జుపీటర్ స్టాండర్డ్, జెడ్ఎక్స్ మరియు క్లాసిక్ అనే మూడు వేరియంట్లలో ముందు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు మాత్రమే ఉంటాయి. కొత్త స్కూటర్ కోసం డిస్క్ బ్రేక్‌లను అందించాలని కంపెనీ యోచిస్తుందో లేదో డీలర్లు నిర్ధారించలేకపోయారు.
కొత్త బిఎస్ 6 జుపీటర్ లో 109 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.3 బ్రేక్ హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
కొత్త టివిఎస్ జూపిటర్ బిఎస్ 6 స్కూటర్ స్టాండర్డ్, జెడ్ఎక్స్ మరియు క్లాసిక్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ల ధర వరుసగా రూ .61,449, రూ .63449, రూ .67,911 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). సంస్థ యొక్క డీలర్‌షిప్‌లు బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించాయి మరియు వచ్చే వారం మధ్యలో డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
టీవీఎస్ కి సంబంధిత వార్తల ప్రకారం అపాచీ ఆర్ఆర్ 310 మోడళ్ల తర్వాత రెండవ ప్రీమియం మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడానికి కంపెనీ కృషి చేస్తోంది. కొత్త మోటార్‌సైకిల్ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ప్లాట్‌ఫామ్‌లో నిర్మించబడుతుంది మరియు ఇది 2021 లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టివిఎస్ కొత్త బిఎస్ 6 కంప్లైంట్ జుపీటర్ మోడళ్లకు తీసుకువచ్చిన మార్పుల వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది వినియోగదారుని మరింత అనుకూలంగా ఉంటుంది.