భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారులలో టీవీఎస్ కంపెనీ ఒకటి. టీవీఎస్ మోటార్స్ ఇప్పటికే చాలా వాహనాలను భారతీయ మార్కెట్లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు టీవీఎస్ కంపెనీ కొత్తగా నార్టన్ మోటార్‌సైకిళ్లను సొంతం చేసుకుంది. టీవీఎస్ సొంతం చేసుకున్న ఈ మోటార్ సైకిల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

టివిఎస్ మోటార్ కంపెనీ బ్రిటిష్ ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ నార్టన్ ను విజయవంతంగా కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. నార్టన్ మోటార్‌ సైకిళ్ల యొక్క డీల్స్ కోసం టివిఎస్ కంపెనీ జిబిపితో 16 మిలియన్ల నగదు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

నార్టన్ మోటార్‌సైకిళ్లను 1898 లో యుకెలోని బర్మింగ్‌హామ్‌లో జేమ్స్ లాన్స్‌డౌన్ నార్టన్ స్థాపించారు. క్లాసిక్ రెట్రో రీ బూట్ల నుండి ఆధునిక సమకాలీన సూపర్ బైక్‌ల వరకు విభిన్నమైన ఆఫర్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్‌లలో ఇది కూడా ఒకటి.

భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

టీవీఎస్ మోటార్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ 'సుదర్శన్ వేణు' మాట్లాడుతూ, "టివిఎస్ మోటార్ కంపెనీలో ఇది చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే నార్టన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్, మరియు ప్రపంచవ్యాప్తంగా స్కేల్ చేయడానికి మాకు మంచి అవకాశాన్ని అవకాశాన్ని అందిస్తుంది. ఈ మోటార్ సైకిల్ ఉత్పత్తుల ద్వారా ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా అంతర్జాతీయ మోటారుసైకిల్ ల్యాండ్‌స్కేప్‌లో నార్టన్ గత వైభవాన్ని తిరిగి పొందడానికి మా పూర్తి మద్దతును అందిస్తామన్నారు.

భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

నార్టన్ మోటార్ సైకిల్ నిర్దిష్ట వ్యాపార ప్రణాళికలతో తన విలక్షణమైన గుర్తింపును నిలుపుకుంటుంది. నార్టన్ మోటార్ సైకిల్స్ బ్రాండ్ యొక్క విజయం మరియు ప్రాముఖ్యతను పెంపొందించడంలో టివిఎస్ మోటార్ కస్టమర్లు మరియు ఉద్యోగులతో కలిసి పనిచేస్తుంది మరియు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా దీనిని వృద్ధిని పెంపొందించడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

హోసూర్ ఆధారిత సంస్థ కూడా భారత మార్కెట్లో నార్టన్ లైనప్ నుండి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ధ్రువీకరించింది. కమాండో, డామినేటర్ మరియు వి 4 ఆర్ఆర్ వంటి మోడళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది త్వరలో దేశీయ మార్కెట్లో అమ్మకాలను జరపనుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

నార్టన్ మోటార్‌సైకిల్స్ టీవీఎస్ మోటార్స్ యొక్క అమ్మక సామర్థ్యాలను ప్రభావితం చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో కొత్త మార్కెట్లలోకి కొత్త వాహనాలను ప్రవేశపెట్టడానికి ఈ బ్రిటిష్ బ్రాండ్‌ కూడా చాలా సహాయంగా ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న నార్టన్ మోటార్‌ సైకిల్స్

యుఎస్ మరియు ఐరోపాతో సహా ప్రపంచంలోని 21 దేశాలలో నార్టన్ మోటార్ సైకిల్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్నాయి. వచ్చే ఏడాదికల్లా ఈ కొత్త మోటార్ సైకిల్ ఎప్పుడైనా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. నార్టన్ మోటార్‌సైకిల్స్ చాలావరకు 800 సిసి మరియు అంతకంటే ఎక్కువ కేటగిరీలో ఉన్నప్పటికీ, టివిఎస్ 500 సిసి మోటార్‌సైకిల్‌ను త్వరలో భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 18, 2020, 12:23 [IST]
English summary
TVS Motors Acquire Norton Motorcycles: Commando & Dominator Models Among Those Coming To India Soon. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+