బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

టీవీఎస్ మోటార్ కంపెనీ ఎట్టకేలకు తమ 125సీసీ టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌ను బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే బీఎస్6 వెర్షన్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ధర సుమారుగా రూ. 10 వేల వరకూ పెరిగింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బీఎస్4 మరియు బీఎస్6 వెర్షన్ మధ్య తేడా, మార్పులు మరియు వేరియంట్ల వారీగా ఎంత మేరకు ధరలు పెరిగాయో చూద్దాం రండి...

బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

ఏప్రిల్ 01, 2020 నుండి మార్కెట్లో విక్రయించే అన్నిటూ వీలర్లు మరియు ఫోర్ వీలర్లలో భారత ప్రభుత్వం బీఎస్6 అప్‌డేట్ పొందిన ఇంజన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని మోడళ్లలో బీఎస్6 వెర్షన్ అందించిన టీవీఎస్, తాజాగ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను బీఎస్6 ప్రమాణాలతో అప్‌డేట్ చేసింది.

బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

బీఎస్6 అప్‌‌గ్రేడ్ అనంతరం టీవీఎస్ ఎన్‌‌టార్క్ 125 ధరలు ఇలా ఉన్నాయి.

  • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డ్రమ్ వేరియంట్ ధర రూ. 65,975
  • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ ధర రూ. 69,975
  • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 72,445
  • వేరియంట్ల ఆధారంగా ఒక్కోదాని మీద రూ. 6,513 నుండి రూ. 9,980 వరకూ ధరలు పెరిగాయి.
బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

సాంకేతికంగా ఇందులో జరిగిన మార్పల గురించి టీవీఎస్ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, బీఎస్6 ప్రమాణాలను అందుకునేందుకు కార్బోరేటర్ స్థానంలో ఫ్యూయల్ ఇంజెక్షన్ అందించే అవకాశం ఉంది.

బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్, టార్క్ మరియు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపకుండా బీఎస్6 ప్రమాణాల కోసం సైలెన్సర్‌లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని తెలుస్తోంది.

బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో సాంకేతికంగా 124.79సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 9.1బిహెచ్‌పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ కథనం మేరకు, దీని గరిష్ట మైలేజ్ లీటరుకు 47కిలోమీటర్లు ఇస్తుంది

బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బీఎస్6 వెర్షన్ వేరియంట్ల వారీగా ధరలు వెల్లడించిన టీవీఎస్, బీఎస్6 అని గుర్తించేందుకు కాస్మొటిక్స్, బాడీ గ్రాఫిక్స్ మరియు స్టైలిష్ ఎలిమెంట్ల పరంగా జరిగిన మార్పులకు సంభందించిన ఫోటోలను కూడా రివీల్ చేయలేదు.

బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

హోండా కంపెనీ కూడా తమ అన్ని మోడళ్లలో ఇప్పటికే బీఎస్6 ఇంజన్ అప్‌డేట్ చేసింది, పలు బీఎస్6 స్కూటర్లలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ కూడా వచ్చాయి. బహుశా టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ వేరియంట్లో ఎల్ఈడీ లైట్లు వచ్చే అవకాశం ఉంది.

మార్కెట్లో లభించే బీఎస్6 125సీసీ స్కూటర్లను పరిశీలిస్తే, టీవీఎస్ ఎన్‌టార్క్ చౌకైన మోడల్ కాదు, అయితే అంత ఖరీదైన మోడల్ కూడా కాదు. ఎన్‌టార్క్ 125 బేస్ వేరియంట్ ధర రూ. 65,975 కంటే బీఎస్6 సుజుకి యాక్సెస్ 125 ధర రూ. 64,800. రెడింటికీ పెద్ద తేడా ఏం లేదు.

బ్రేకింగ్: టీవీఎస్ ఎన్‌‌టార్క్ బీఎస్6 విడుదల: భారీగా పెరిగిన ధర!

ఇదే శ్రేణిలో ఉన్న యమహా రే జడ్ఆర్ 125 ధర రూ. 66,730 కాగా, భారతదేశపు పాపులర్ సెల్లింగ్ స్కూటర్ యాక్టివా 125 ఎఫ్ఐ ధర 67,490 రూపాయలుగా ఉంది. అన్ని మోడళ్ల ధరలు పరిశీలిస్తే నామమాత్రపు వ్యత్యాసం మాత్రమే ఉంది. ఫీచర్లు మరియు పర్ఫామెన్స్ ఆధారంగా మీకు నచ్చిన 125 స్కూటర్‌ను ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
BS-VI TVS NTorq launched in India, priced from INR 65,975. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X