Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ - ఆకర్షనీయమైన రేసింగ్ యల్లో కలర్లో
ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పెర్ఫార్మెన్స్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125లో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ పేరుతో అతి త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ స్కూటర్ యల్లో పెయింట్ స్కీమ్‌తో లభ్యం కానుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ ఒకే ఒక రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో లభిస్తోంది. తాజాగా టీమ్బీహెచ్పీ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, కంపెనీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌కు మరో పెయింట్ స్కీమ్‌ను చేర్చే అవకాశం ఉంది. లీకైన చిత్రం ప్రకారం, ఇది కొత్త డ్యూయల్-టోన్ యల్లో అండ్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో రానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే, దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్షిప్ కేంద్రాలలో ఈ స్పెషల్ ఎడిషన్ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభం అయ్యాయి. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, సైలెంట్‌గా ఈ స్కూటర్ మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్కూటర్ ఆగస్ట్ నెలలో ఎప్పుడైనా డీలర్‌షిప్‌లకు వచ్చే అవకాశం ఉంది.
MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి

టీవీఎస్ నుంచి వస్తున్న ఈ కొత్త ఎన్టోర్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్ ధరలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బ్లాక్ అండ్ రెడ్ ఎన్‌టార్క్ స్కూటర్ ధర రూ.74,365, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. ఈ నేపథ్యంలో, కొత్త రేస్ ఎడిషన్ ధర కూడా ఇదే రెంజ్లో ఉండొచ్చని అంచనా.

ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను స్టాండర్డ్ ఎన్‌టార్క్ 125 మోడల్‌పై ఆధారపడి తయారు చేశారు. ఇందులో కేవలం కాస్మోటిక్ అప్గ్రేడ్లు మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ స్కూటర్లోని పలుచోట్ల చెకర్డ్ ఫ్లాగ్ డిజైన్ ఉంటుంది, ఇది స్కూటర్‌కు మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది.
MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో తయారు చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్లోని కొన్ని ఇతర మార్పులను గమనిస్తే, బ్రాండ్ యొక్క ‘రేస్ ఎడిషన్' చిహ్నం, ‘టీవీఎస్ రేసింగ్' డెకాల్స్‌తో ఇది టీవీఎస్ రేసింగ్ ఫ్యామిలీని తలపిస్తుంది. కొత్త ‘రేస్ ఎడిషన్' స్కూటర్లో పూర్తిగా కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్లను జోడించారు.

ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.1 బిహెచ్పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది, ఇది స్మార్ట్‌ఫోన్‌తో జత చేయడానికి వీలుగా టీవీఎస్ బ్రాండ్ స్మార్ట్కనెక్ట్ను సపోర్ట్ చేస్తుంది. బయటి వైపు అమర్చిన ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్, ఎల్ఈడి లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్లో ఆకట్టుకునే మరో ప్రధాన అంశం, దీని ఎగ్జాస్ట్ నోట్, ఇది మరింత స్పోర్టీ రైడ్ అనుభవాన్ని ఇస్తుంది.

టీవీఎస్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ ఎన్‌టార్క్ స్కూటర్ ధరలను మరోసారి పెంచింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:వరద నీటిలో చేపలాగా ఈదుతున్న ఎలక్ట్రిక్ కారు

భారత మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 యువ తరం కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడినది. ఇందులో కొత్తగా వస్తున్న ఈ రేస్ ఎడిషన్ బ్లాక్ అండ్ యల్లో కలర్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీని స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్ మరియు అగ్రెసివ్‌గా కనిపించే ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌తో స్కూటర్ ఫంకీ లుక్ మరింత మెరుగ్గా ఉంటుంది.