ఇప్పుడు బిఎస్ 6 టివిఎస్ రేడియన్ కొత్త ధరలు వచ్చేశాయ్

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ దారు టివిఎస్ మోటార్ తమ ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ రేడియన్ ధరలను మార్కెట్లో కొంత వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. టివిఎస్ రేడియన్ బిఎస్ 6 బైక్ ఇప్పుడు భారత మార్కెట్లో అన్ని వేరియంట్లలో 750 రూపాయల స్వల్ప ధరల పెరుగుదలను అందుకుంది. ఈ రేడియన్ బైక్ ధరల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇప్పుడు బిఎస్ 6 టివిఎస్ రేడియన్ కొత్త ధరలు వచ్చేశాయ్

టివిఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో బిఎస్-6 కంప్లైంట్ రేడియన్ మోటార్‌సైకిల్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ మోటార్‌ సైకిల్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించబడింది. ఈ కారణంగా కంపెనీ బైక్ ధరలను రూ. 8,600 వరకు పెంచింది.

ఇప్పుడు బిఎస్ 6 టివిఎస్ రేడియన్ కొత్త ధరలు వచ్చేశాయ్

కొత్త టివిఎస్ రేడియన్ బైక్ బేస్-స్పెక్ ధర రూ. 59,742 వద్ద ప్రారంభం కాగా, టాప్-ట్రిమ్ ధర రూ. 65,742 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది. ఈ టివిఎస్ రేడియన్ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి బేస్, డ్రమ్ మరియు డిస్క్ అనే మూడు వేరియంట్లు.

MOST READ:హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

ఇప్పుడు బిఎస్ 6 టివిఎస్ రేడియన్ కొత్త ధరలు వచ్చేశాయ్

కొత్త టివిఎస్ బైక్ కేవలం ధర పెరుగుదల తప్ప బిఎస్ 6 టివిఎస్ రేడియన్ మోటార్‌సైకిల్‌లో ఇతర మార్పులు చేయలేదు. ఈ బైక్ 109 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇప్పుడు బిఎస్ 6 టివిఎస్ రేడియన్ కొత్త ధరలు వచ్చేశాయ్

బిఎస్ 6 మోడల్‌ను ప్రారంభించిన సమయంలో, టివిఎస్ అప్‌డేట్ చేసిన రేడియన్ తన మునుపటి బిఎస్ 4 బైక్ కంటే 15 శాతం మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ బిఎస్ 6 రేడియన్ బైక్ 10-లీటర్ ఇంధన ట్యాంక్ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 79 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

MOST READ:స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

ఇప్పుడు బిఎస్ 6 టివిఎస్ రేడియన్ కొత్త ధరలు వచ్చేశాయ్

టివిఎస్ ఇటీవల భారతీయ మార్కెట్లో తమ ప్రసిద్ధ అపాచీ ఆర్టీఆర్ 160 4 వి మరియు ఆర్టీఆర్ 200 4 వి మోడళ్ల ధరలను కూడా పెంచింది. మోడల్ మరియు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి రెండు మోడళ్ల ధరల పెరుగుదల సుమారు రూ. 2,500 వరకు ఉంటుంది. టివిఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వి, ఆర్టీఆర్ 200 4 వి ధరలు ఇప్పుడు వరుసగా రూ. 1.2 లక్షలు, రూ .1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇప్పుడు బిఎస్ 6 టివిఎస్ రేడియన్ కొత్త ధరలు వచ్చేశాయ్

ఇటీవల కాలంలో టివిఎస్ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు తమ బ్రాండ్ వాహనాల రేట్లను కొంతవరకు పెంచాయి. టీవీఎస్ ప్రత్యర్థి అయిన బజాజ్ ఆటో ఇటీవలే దేశంలో తన మొత్తం ఉత్పత్తి శ్రేణి ధరలను కూడా పెంచింది.

MOST READ:2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

Most Read Articles

English summary
TVS Radeon BS6 Bike Prices Increased Marginally Across Range: Here Is The Updated Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X