టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ 'టీవీఎస్ రేడియాన్'ను ఇప్పటి వరకూ మూడు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

టీవీఎస్ రేడియాన్ బిఎస్6 మోడల్ ఇప్పుడు కొత్తగా రీగల్ బ్లూ మరియు క్రోమ్ పర్పుల్ అనే రెండు కొత్త రంగులలో లభ్యం కానుంది. ఈ కొత్త వేరియంట్లలో కేవలం కలర్ మార్పు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇదివరకటి రేడియాన్ మోటార్‌సైకిళ్లలో లభించే అన్ని ఫీచర్లు ఇందులో కూడా లభ్యం కానున్నాయి.

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

టీవీఎస్ మొట్టమొదటి సారిగా 2018లో రేడియాన్ కమ్యూటెడ్ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైన కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ మోటార్‌సైకిల్ బ్రాండ్ 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. స్టైల్ మరియు మైలేజ్ కలయికలతో రూపొందిన రేడియాన్ దేశంలోని యువ మరియు పరిణతి చెందిన కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

MOST READ:బెంగళూరులో టెస్లా రీసర్చ్ సెంటర్ ప్రారంభించనుందా.. అయితే ఇది చూడండి

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్ రేడియాన్ మోటారుసైకిల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి: బేస్డ్ ఎడిషన్, కమ్యూటర్ బైక్ ఆఫ్ ది ఇయర్ మరియు డిస్క్ బ్రేక్‌లతో కమ్యూటర్ బైక్ ఆఫ్ ది ఇయర్. వీటి ధరలు వరుసగా రూ.59,942, రూ.62,942 మరియు రూ.65,942, (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

ఈ మోటార్‌సైకిల్ ఇప్పటికే అనేక రంగులో లభిస్తోంది. ఇందులో బేస్ వేరియంట్లో ఆరు కలర్ ఆప్షన్స్, కమ్యూటర్ బైక్ ఆఫ్ ది ఇయర్ వేరియంట్లలో రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటార్‌సైకిల్ బ్రాండ్ అమ్మకాల పరంగా సాధించిన మైలురాయి జ్ఞాపకార్థం ఇందులో రెండు అదనపు కలర్ ఆప్షన్స్ లభ్యం కానున్నాయి.

MOST READ:రోడ్ రోలర్‌గా మారిన టివిఎస్ బైక్ [వీడియో]

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

టీవీఎస్ రేడియాన్ బిఎస్6 మోటార్‌సైకిల్‌లో ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే కొత్తగా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులోని 109.7సిసి ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఇంజన్ గరిష్టంగా 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్‌తో కూడిన హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు అదనపు సౌలభ్యం కోసం రియర్-మౌంటెడ్ లగేజ్ ర్యాక్ మరియు ట్విన్-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కార్ బోనెట్ మీద 200 మీటర్లు వేలాడుతూ వెళ్లిన హోమ్ గార్డ్‌ ; కారణం తెలిస్తే షాక్ అవుతారు

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

"కమ్యూటర్ బైక్ ఆఫ్ ది ఇయర్ ఎడిషన్" వేరియంట్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, తొడ మద్దతు (థై సపోర్ట్) కోసం ట్యాంక్ ప్యాడ్లు, పెట్రోల్ ట్యాంక్ కుషన్, ప్రీమియం సీట్ డిజైన్, క్రోమ్ రియర్ వ్యూ మిర్రర్స్ మరియు కొత్త బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి.

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు, టాప్-ఎండ్ వేరియంట్‌లో ముందు భాగంలో ఆప్షనల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. రేడియాన్ సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీని స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

MOST READ:షోరూమ్ కండిషన్‌లో సుజుకి సమురాయ్.. ఇది ఎన్ని సంవత్సరాల బైక్ అని ఆశ్చర్యపోతున్నారా ..!

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

టీవీఎస్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ బిఎస్6 ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మరోసారి పెంచింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ధరలను బిఎస్6 అప్‌డేట్ పొందిన తర్వాత వరుసగా నాలుగు నెలల్లో మూడుసార్లు పెంచారు.

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

గడచిన జూన్‌లో బిఎస్6 ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధరను రూ.910 పెంచగా, ఆ తర్వాత జూలైలో రూ.1500 మేర పెంచారు. తాజాగా ఈనెల (సెప్టెంబర్) ఆరంభంలో ఈ స్కూటర్ ధరను రూ.500 మేర పెంచారు. ధరల పెరుగుదల తర్వాత, బిఎస్6 ఎన్‌టార్క్ 125 స్కూటర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.68,385, టాప్-స్పెక్ రేస్-ఎడిషన్ ధర రూ.74,865 [ఎక్స్ షోరూమ్, ఢిల్లీ]గా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టీవీఎస్ రేడియాన్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల - వివరాలు

టీవీఎస్ రేడియాన్ కొత్త కలర్ ఆప్షన్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ రేడియాన్ మార్కెట్లో విడుదలైన అతికొద్ది సమయంలోనే కొనుగోలుదారుల నుంచి మంచి స్పందను అందుకుంది. ఈ బ్రాండ్ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. కేవలం రెండేళ్లలోనే మూడు లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసి, కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్‌గా నిలిచింది. సింపుల్ డిజైన్, తక్కువ మెయింటినెన్స్, ప్రీమియం అప్పీరెన్స్, మెరుగైన మైలేజ్ వంటి అంశాలు దీని విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
TVS Motor Company has announced that its Radeon commuter motorcycle has registered over three lakh units sold. To celebrate the new sales milestone, the company has introduced new colour schemes for the Radeon motorcycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X