భారత్‌లో నిలిపివేయబడిన టీవీఎస్ జుపిటర్ గ్రాండే స్కూటర్, ఎందుకో తెలుసా..?

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్రవాహన తయారీ సంస్థలలో ఒకటి టీవీఎస్. టీవీఎస్ కంపెనీ ఇప్పటికే చాల వాహనాలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. భారత ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం వాహన సంస్థలన్నీ తమ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయాలి.

బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా అప్డేట్ కానీ వాహనాలను ప్రస్తుతం భారత మార్కెట్లో నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ బ్రాండ్ అయిన జుపిటర్ స్కూటర్ కూడా నిలిపివేయబడింది. టీవీఎస్ జుపిటర్ ఎందుకు నిలిపివేయబడింది అనేదాని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందా.

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

భారత మార్కెట్లో టీవీఎస్ జుపిటర్ గ్రాండేను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అంతే కాకుండా జుపిటర్ సిరీస్ యొక్క ప్రీమియం వేరియంట్ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా తొలగించబడింది.

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

టీవీఎస్ జుపిటర్ గ్రాండే స్కూటర్ ని కంపెనీ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీనీకరించలేదు. 2019 సెప్టెబరులో ఈ జుపిటర్ గ్రాండే వేరియంట్ ను చివరిగా అప్డేట్ చేశారు. ఇందులో సెగ్మెంట్-ఫస్ట్ బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

MOST READ: లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

జుపిటర్ గ్రాండే బిఎస్ 6 అప్‌గ్రేడ్ సిద్ధమయ్యే వరకు ఈ స్కూటర్ తాత్కలికంగా నిలిపివేయబడుతుంది. టీవీఎస్ ఇప్పటికే ఇతర జుపిటర్ మోడళ్లను బీఎస్ 6 వెర్షన్లలో విడుదల చేసింది.

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

నవంబర్ 2019 లో క్లాసిక్‌ను లాంచ్ చేసినప్పుడు జుపిటర్ బిఎస్ 6 అప్‌గ్రేడ్‌తో కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత టివిఎస్ జుపిటర్ బిఎస్ 6 స్టాండర్డ్, జెడ్‌ఎక్స్ మోడళ్లను ఈ ఏడాది జనవరిలో విడుదల చేసింది. భారతదేశంలో కోవిడ్-19 లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే జుపిటర్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నిర్మించబడుతుంది అని మేము ఆశిస్తున్నాము.

MOST READ: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

టీవీఎస్ జుపిటర్ సంస్థ యొక్క స్మార్ట్‌ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీతో బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా కలిగి ఉంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్ ద్వారా కూడా జత చేయవచ్చు, ఇది కాల్ మరియు టెక్స్ట్ నోటిఫికేషన్‌లు, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, హెల్మెట్ రిమైండర్ వంటి ఫీచర్స్ అందిస్తుంది.

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

జుపిటర్ గ్రాండే ఫ్రంట్ ఫెండర్ మరియు రియర్‌వ్యూ మిర్రర్ హౌసింగ్‌పై క్రోమ్ హైలైట్‌లను కలిగి ఉంది. ఇది పూర్తి-ఎల్‌ఈడీ హెడ్‌లైట్ మరియు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇవన్నీ ఈ స్కూటర్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి.

MOST READ: గుడ్ న్యూస్.. టి-రాక్ ఎస్‌యువిని స్థానికంగా తయారుచేయనున్న వోక్స్ వ్యాగన్

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

బిఎస్ 4 జుపిటర్ గ్రాండే 109.7 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 7.8 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బ్రేకింగ్ విధులను గమనించినట్లయితే దీని ముందు భాగంలో అప్సనల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. సస్పెన్షన్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు ఉన్నాయి.

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

బిఎస్ 6 టీవీఎస్ జుపిటర్ మార్కెట్లో ప్రారంభించిన తరువాత, కొత్త హోండా ప్రీమియం స్కూటర్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది. బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసిన తరువాత ఈ స్కూటర్‌ ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుందని ఆశించవచ్చు.

MOST READ: హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే..?

జుపిటర్ గ్రాండే స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసిన టీవీఎస్, ఎందుకో తెలుసా..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం..!

టీవీఎస్ జుపిటర్ గ్రాండే ప్రీమియం స్కూటర్ ఆఫర్. ఇది అనేక ఉత్తమ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది త్వరలో బిఎస్ 6 ఇంజిన్‌తో తిరిగి ప్రారంభించబడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశం లాక్ డౌన్ లో ఉండటం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఏది ఏమైనా టీవీఎస్ జుపిటర్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతుంది.

Most Read Articles

English summary
TVS Jupiter Grande Temporarily Discontinued In India: Unlisted From Website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X