ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్స్ బైక్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారులలో టీవీఎస్ ఒకటి. టీవీఎస్ మోటార్స్ కంపెనీ తన బ్రాండ్ అయిన బిఎస్-6 స్పోర్ట్‌బైక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది ఈ కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్ ప్రారంభ ధర రూ. 51,750. ఏ కొత్త టీవీఎస్ మోటార్ సైకిల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్‌బైక్

కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి కిక్‌స్టార్ట్ మరియు రెండు సెల్ఫ్ స్టార్ట్ అనే రెండు వేరియంట్లు. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం కిక్‌స్టార్ట్ వేరియంట్ ధర రూ. 51,750 కాగా, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 58,925. ఈ టీవీఎస్ మోటార్స్ యొక్క బిఎస్ 4 వెర్షన్ కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 48,117 , అదే విధంగా సెల్ఫ్ స్టార్ట్ ధర రూ. 50,908. బిఎస్ 4 వేరియంట్ కంటే బిఎస్ 6 వేరియంట్ కొంత ఎక్కువ ధరను కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్‌బైక్

కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్‌లో బిఎస్ 6, 109.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 8.17 బిహెచ్‌పి శక్తి మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్‌బైక్

కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉంటుంది. కొత్త టీవీఎస్ స్పోర్ట్ బైక్ మునుపటి బిఎస్ 4 తో పోలిస్తే 15 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్‌బైక్

మునుపటి బిఎస్ 4 టివిఎస్ స్పోర్ట్‌బైక్‌లో 99.7 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 7.27 బిహెచ్‌పి శక్తిని మరియు 7.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో బిఎస్ 6 ఉద్గార నిబంధన ప్రకారం కొత్త ఇంజన్ అమర్చారు. టీవీఎస్ తన కొత్త స్పోర్ట్‌బైక్‌లోని ఇంజిన్‌ను మాత్రమే మార్చింది. కానీ ఈ బైక్ రూపకల్పనలో ఎలాంటి మార్పు చేయలేదు.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్‌బైక్

కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్ ఐదు రంగుల ఎంపికలో లభిస్తుంది. అవి వరుసగా వాల్కెనో రెడ్, మెర్క్యురీ గ్రే, రెడ్ విత్ బ్లాక్, రెడ్ మరియు వైట్ తో పర్పుల్ కలర్స్.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్‌బైక్

టీవీఎస్ కి సంబంధించిన ఇతర సమాచారం మేరకు టివిఎస్ మోటార్ మరియు దాని అనుబంధ సంస్థ కరోనాతో పోరాడటానికి మరియు 10 లక్షల ఫేస్ మాస్క్లను క్లెయిమ్ చేయడానికి ప్రభుత్వానికి రూ. 30 కోట్ల గ్రాంట్ కూడా ప్రకటించింది.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్‌బైక్

కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్‌లో భద్రత లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు ఐదు దశల అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో 130 ఎంఎం ఫ్రంట్ మరియు 110 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

టీవీఎస్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలను కలిగి ఉంది. ఇప్పుడు బిఎస్ 6 స్పోర్ట్ బైక్ విడుదలతో ఆ అమ్మకాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, April 6, 2020, 9:51 [IST]
English summary
TVS Sport BS6 launched in India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+