జనవరి 25 న లాంచ్ చేయనున్న టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్-6 మోటార్ సైకిల్!

టివిఎస్ గత సెప్టెంబర్‌లో స్టార్ సిటీ ప్లస్ స్పెషల్ ఎడిషన్‌ను ప్రారంభించింది. టీవీఎస్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటారుసైకిల్‌ లాంచ్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో 2020 స్టార్ సిటీ ప్లస్ యొక్క కొత్త టీజర్‌ను ఆవిష్కరించింది.

జనవరి 25 న లాంచ్ చేయనున్న టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్-6 మోటార్ సైకిల్!

సరికొత్త టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ 2020 జనవరి 25 న ప్రారంభం కానుంది. కొత్త మోటార్‌సైకిల్ బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కొంతవరకు కాస్మెటిక్ అప్‌డేట్‌లను కూడా స్టార్ సిటీ ప్లస్ కలిగి ఉంటుంది.

సంస్థ తమ సోషల్ మీడియా సైట్‌లో ప్రచురించిన కొత్త టీజర్ ప్రకారం సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్ గురించి తెలియజేస్తుంది. ఈ మోటారుసైకిల్‌లో ఎల్‌ఈడీ డిఆర్ఎల్ లు కూడా ఉంటాయి. కొత్త 2020 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ గురించి వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి.

జనవరి 25 న లాంచ్ చేయనున్న టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్-6 మోటార్ సైకిల్!

మోటారుసైకిల్ యొక్క ఫ్రంట్ ఎండ్ బాగా పనిచేయడంతో పాటు సైడ్ ప్రొఫైల్ నవీకరించబడిన గ్రాఫిక్‌లతో కొత్త ప్యానెల్‌లను పొందుతుంది. కొత్త మోటారుసైకిల్లో మరింత సౌకర్యవంతమైన సీటు మరియు ఎగ్జాస్ట్ మఫ్లర్ కోసం క్రోమ్ కవర్‌ను కూడా కలిగి ఉంటుంది.

జనవరి 25 న లాంచ్ చేయనున్న టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్-6 మోటార్ సైకిల్!

స్టార్ సిటీ యొక్క వెనుక భాగంలో పెద్ద గ్రాబ్ రైల్ మరియు స్టైలిష్ టెయిల్-లైట్ డిజైన్ చేయబడి ఉన్నాయి. ఇంజిన్ అల్లాయ్ వీల్స్ మరియు ఎగ్జాస్ట్ పైప్ అన్నీ మునుపటి మోడల్‌లో చూసినట్లుగా ఉంటాయి, అంతే కాకుండా ఇది బ్లాక్-అవుట్ థీమ్‌ని కూడా పొందుతుంది

జనవరి 25 న లాంచ్ చేయనున్న టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్-6 మోటార్ సైకిల్!

2020 టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఆయిల్ డంప్డ్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు హైడ్రాలిక్ రియర్ షాక్ అబ్జార్బర్స్ కలిగి ఉంటుంది. ఇది రైడ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఎక్కువ దూరం ప్రయాణించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులో బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే ముందు భాగంలో 130 ఎంఎం డ్రమ్, వెనుక వైపు 110 ఎంఎం డ్రమ్ నిర్వహిస్తారు.

జనవరి 25 న లాంచ్ చేయనున్న టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్-6 మోటార్ సైకిల్!

2020 టివిఎస్ స్టార్ సిటీ తన బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ఒకే సింగిల్ సిలిండర్ ని కలిగి ఉండి, 110 సిసి ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది. స్టార్ సిటీ ప్లస్ యొక్క ప్రస్తుత తరం 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.3 బిహెచ్‌పి, మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మోటారు నాలుగు-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది.

జనవరి 25 న లాంచ్ చేయనున్న టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్-6 మోటార్ సైకిల్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

టివిఎస్ స్టార్ సిటీ మోటారుసైకిల్ కొంతకాలంగా మార్కెట్లో ఉంది. ఇది ప్రయాణికునికి అత్యంత సౌకర్యంగా ఉండటంతో పాటు మంచి మైలేజ్ ని కూడా ఇస్తుంది. ఇప్పుడు అన్ని నవీనీకరణలతో వస్తున్న టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించనుంది. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఒక్కసారి మార్కెట్లో ప్రారంభించిన తరువాత హీరో పాషన్ ఎక్స్‌ప్రో మరియు హోండా డ్రీమ్ యుగ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

Most Read Articles

English summary
TVS Star City Plus BS6 Teaser Released: Launch On 25 January. Read in Telugu.
Story first published: Tuesday, January 21, 2020, 17:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X