నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

సాధారణంగా నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో మత భేదాలు, చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరు చాల ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో యువత మరింత ఉత్సాహాన్ని చూపిస్తుంది. ఇందులో భాగంగా మందుతాగడం, బైక్ రైడింగ్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఈ విధంగా మందు తాగి రహదారుల మీద మితిమీరిన వేగంతో వెళ్ళేటప్పుడు అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చెన్నైలో ఈ విధంగా ప్రమాదానికి గురైన ఒక విషయాన్ని గురించి ఇప్పుడు మరింత తెలుసుకుందాం!

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

చెన్నైలో ఒక పాఠశాల ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ అందరు సంతోషంగా ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై చెన్నై మొత్తం కలకలం రేపింది.

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

చెన్నైలోని నలంగలం ప్రాంతానికి చెందిన నవీన్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో షోలింగనల్లూరులో ఒక ప్రయివేట్ కాలేజీలో రెండవసంవత్సరం చదువుతున్నాడు. నవీన్ తన స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నాడు. స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మందు తాగి ఉన్నాడు.

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

ఇంటికి బయలుదేరిన నవీన్ వేలచేరి రహదారిపైకి చేరుకున్నాడు. ఈ రహదారిపై హై స్పీడ్ లో వాహనాన్ని నడుపుతున్నాడు. అనుకోకుండా నవీన్ నడుపుతున్న వాహణం రహదారిపై పడిపోయింది. పడిన తరువాత వాహనం యొక్క వేగం వళ్ళ వాహనం నుండి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన పాఠశాల దగ్గరలో సంభవించడం వల్ల అక్కడున్న వారంతా ఒక్క సారిగా భయాందోళనలకు గురయ్యారు.

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

వాహనం నుంచి చెలరేగిన మంటలవల్ల నవీన్ కొంత గాయాలపాలయ్యాడు. కానీ అక్కడున్న ఇరుగుపొరుగువారు నవీన్ ని తీసుకుని వెంటనే అక్కడికి సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి పంపారు. ఈ విషయంపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు మనకు సమాచారం.

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

నూతన సంవత్సరం రాగానే పోలీసులు చాల హెచ్చరికలను జారీ చేస్తారు. కానీ యువత అవేమి పట్టించుకోకుండా మందు తాగి బైక్ రైడింగ్లు వంటివి చేస్తూనే వుంటారు. పోలీసులు వీటిని ఎంత వరకు తగ్గించాలని తమ సాయశక్తులా ప్రయత్నించినా కూడా ఎక్కడో ఒక దగ్గర నిరాశ ఎదురవుతూనే ఉంది.

Read More:జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

నూతన సంవత్సరాల్లో వేడుకలు చూడటమే కాకుండా ఇటువంటి ప్రమాదాలు కూడా చూడాల్సివస్తోంది. ఆనందంగా సంబరాలు జరుపుకోవాల్సిన సమయంలో విశాదాలు కూడా నూతన సంవత్సరంలో నూతనంగా మిగిలిపోతున్నాయి.

గమనిక: ఈ ఆర్టికల్ లోని చిత్రాలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
High-speed two-wheeler burst into flames-Read in Telugu
Story first published: Thursday, January 2, 2020, 12:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X