Just In
- 53 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Lifestyle
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Sports
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యుబిసిఓ టూవీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ బైక్స్ - డీటేల్స్
న్యూజిలాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ యుబిసిఓ తమ 2021 ప్రొడక్ట్ లైనప్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ తమ టూవీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ యుటిలిటీ బైక్‌లను ప్రదర్శించింది. కొత్త 2021 మోడల్ ఉత్పత్తులు ఐదవ తరానికి చెందినవి. ఇందులో ఆఫ్-రోడ్ ఓన్లీ 2x2 వర్క్ బైక్ మరియు 2x2 అడ్వెంచర్ బైక్ మోడళ్లు ఉన్నాయి.

ఈ రెండింటినీ ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడ్ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. మెరుగైన టార్క్, ఎక్కువ పవర్ మరియు ట్రాక్షన్లతో ఈ రెండు బైక్‌లు గతంలో కంటే మరింత రగ్గడ్ పెర్ఫార్మెన్స్ను ఆఫర్ చేస్తాయని కంపెనీ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల డిజైన్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, వీటి నిర్మాణం మాత్రం చాలా ధృడంగా ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎలాంటి ఫైబర్ ఆప్రాన్ కానీ లేదా ప్లాస్టిక్ కవరింగ్స్ కానీ ఉండవు. పూర్తి ఫ్రేమ్ బయటకు కనిపించేలా నేక్డ్ బాడీ స్టైల్లో కనిపిస్తాయి. దీని ఫలితంగా ఇవి తేలిక బరువును కలిగి ఉండి, ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేయడంలో సహకరిస్తాయి.
MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

ఈ బైక్ రూపం ఇతర బైక్‌ల కంటే భిన్నంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌లను V ఆకారపు ఫ్రేమ్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇది చాలా బలంగా ఉంటుంది. బైక్ మధ్య భాగంలో బరువును బ్యాలెన్స్ చేసేందుకు తొలగించగల బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఈ రెండు బైక్‌లలో తగిన భద్రతా ఫీచర్లు కూడా ఉంటాయి.

ఈ బైక్‌లను బ్లాక్ అండ్ రెడ్ ఫ్రేమ్ కలర్స్‌లో అందిస్తున్నారు. కమ్యూటర్ వేరియంట్లలో ఇక్కడ సాధారణ టైర్లను అమర్చారు, అడ్వెంచర్ వేరియంట్లలో ఆఫ్-రోడ్ టైర్లను అందిస్తాయి. ఈ బైక్ మూడు పవర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.1 కిలోవాట్, 2.6 కిలోవాట్ మరియు 3.1 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లు ఉంటాయి.
MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు

ఈ రెండు బైక్‌ల గరిష్ట వేగం గంటకు 50 కిమీ. ఈ బైక్‌లు పూర్తి చార్జీపై గరిష్టంగా 120 కి.మీ రేంజ్‌ని ఆఫర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. బైక్‌లోని రెండు చక్రాలలో ఒక్కొక్కటి చొప్పున 1 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.

ఈ బైక్ అన్ని ఉపరితలాలపై నడపడానికి మన్నికైన సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. డ్రైవర్ తన సౌలభ్యం ప్రకారం సస్పెన్షన్ సెటప్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. యుబిసిఓ తమ 2x2 ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2014లో ప్రవేశపెట్టింది. ఈ బైక్ బరువు తక్కువగా ఉండటంతో నడపటానికి చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది.
MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా