YouTube

ఇది యూకేలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిని జోడించుకుంది. ఈ బ్రాండ్ అందిస్తున్న అత్యాధునిక క్లాసిక్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650' గత 12 నెలలుగా యూకేలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా నిలిచింది (జూన్ 2019 నుండి జూన్ 2020 వరకు, ఎమ్‌సిఐఏ డేటా ప్రకారం).

ఇది యూకేలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

గడచిన ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అంతర్జాతీయ మార్కెట్ వాటాలో మొత్తం 96 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్రాండ్ గత సంవత్సరంతో పోలిస్తే ఒక్క యూరప్‌లోనే 100 శాతం వృద్ధిని నమోదు చేసింది. యూకేలో రాయల్ ఎన్ఫీల్డ్ 67 కస్టమర్ టచ్ పాయింట్లను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో తమ బ్రాండ్ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పెట్టుబడులను వెచ్చించింది.

ఇది యూకేలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 విషయానికి వస్తే, ఇందులో 647.95 సిసి ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి శక్తిని మరియు 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

ఇది యూకేలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

ఈ విజయం గురించి రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ మాట్లాడుతూ, "మిడిల్ వెయిట్ మోటార్‌సైక్లింగ్ విభాగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మరియు ఆ విభాగానికి నాయకత్వం వహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. నిజమైన గ్లోబల్ బ్రాండ్‌గా మా స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, అంతర్జాతీయ మార్కెట్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అడుగుజాడలను విస్తృతం చేయడం మరియు ఔత్సాహికులకు ఆకర్షణీయమైన అనుభవాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి సారించాము"

ఇది యూకేలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

"రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇది కస్టమర్ల మదిలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాధించుకుంది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులను గెలుచుకుంది. యూకేలో మిడ్-సెగ్మెంట్‌పై ఒక సంవత్సరం పాటు ఆధిపత్యం చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే, ఇందుకు మేము చాలా గర్వపడుతున్నాము. గత 12 నెలలుగా యూకేలో నిలకడగా అత్యధికంగా అమ్ముడైన మిడిల్-వెయిట్ మోటార్‌సైకిళ్లలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన మా అడ్వెంచర్-టూరర్ హిమాలయన్ విజయం కూడా మాకే అంతే సమానమైన సంతోషాన్ని అందించింది. మా వినియోగదారుల నుండి లభించిన ఈ స్పందన కారణంగానే, యూకేలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మోటారుసైకిల్ బ్రాండ్లలో ఒకటిగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను నిలిపింద"ని అన్నారు.

MOST READ:భారత అమ్ములపొదలో చేరిన మరో బ్రహ్మాస్త్రం : రాఫెల్ ఫైటర్ జెట్స్

ఇది యూకేలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

"ఇంటర్‌సెప్టర్ 650 ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది మరియు ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి వచ్చిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌సైకిల్. అంతర్జాతీయ మార్కెట్లలో మా బ్రాండ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి ఇది మార్గం సుగమం చేసింది. ఇంటర్‌సెప్టర్ 650 మరియు హిమాలయన్ రెండు మోడళ్లు కూడా చాలా మంది మొదటిసారి కొనుగోలుదారులను రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోకి తీసుకురావటంలో సహకరించాయి. ఈ మోటార్‌సైకిళ్ళు మా అంతర్జాతీయ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మేము నమ్ముతున్నామని" ఆయన చెప్పారు.

ఇది యూకేలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 విజయంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

పవర్‌ట్రెయిన్ విభాగం కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 చాలా మంది వినియోగదారులను ఆకర్షించగలిగింది. ఇందులోని కొత్త పారలల్-ట్విన్ ఇంజన్ లీనియర్ పవర్ డెలివరీతో సున్నితంగా ఉంటుంది మరియు మునుపటి ఇంజన్ యొక్క విలక్షణమైన లక్షణాలను కలిగి ఉండక పోవటమే ఈ మోడల్ విజయానికి కారణంగా చెప్పవచ్చు.

MOST READ:పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

Most Read Articles

English summary
Royal Enfield Interceptor 650 Becomes The Best-Selling Middleweight Motorcycle In The UK. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more