Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జపాన్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా ఆర్ 3 బైక్, భారత్‌కు వస్తుందా..?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ అయిన యమహా తన 2021 ఆర్ 3 బైక్‌ను జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ అనేక కొత్త డిజైన్స్ కలిగి ఉంటుంది, అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఇందులో ప్రవేశపెట్టబడ్డాయి. కొత్త యమహా ఆర్ 3 బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

యమహా బైక్ కంపెనీ అత్యంత స్టైలిష్ బైకులను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ అనేక కొత్త బైకులను ఆవిస్కరించింది. ఇప్పుడు ఈ కొత్త ఆర్ 3 బైక్ విడుదలైంది. యమహా తన హోమ్ టౌన్ లో ప్రతి ఏటా 3700 కొత్త ఆర్3 బైక్‌లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జపాన్ మార్కెట్లో కొత్త యమహా ఆర్ 3 బైక్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 4.89 లక్షలు. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించడానికి, యమహా తన 2021 యమహా ఆర్ 3 బైక్ కి కొత్త మరియు ఆకర్షణీయమైన సియాన్ కలర్ ఆప్షన్ ఇవ్వబడింది. కొత్త బైక్‌లో సియాన్ కలర్ ఫినిష్‌తో ఎక్కువ శాతం బాడీవర్క్ జరిగింది.
MOST READ:గురుగ్రామ్‌లో 55 శాతం తగ్గిన ట్రాఫిక్ ఫైన్స్.. దీనికి కారణం ఇదే

2021 యమహా ఆర్ 3 బైక్ కొత్త గ్రాఫిక్స్ డిజైన్స్ తో మరింత స్పోర్టి లుక్ ఇస్తుంది. సియాన్ కలర్ ఆప్షన్ పక్కన పెడితే, 2021 యమహా ఆర్ 3 బైక్‌లో అప్‌డేట్ చేసిన మాట్టే బ్లాక్ షేడ్ ఉంటుంది. 2021 యమహా ఆర్ 3 బైక్ డీప్ పర్పుల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

కొత్త యమహా ఆర్ 3 బైక్ మునుపటికంటే ఆకర్షణీయమైన మరియు స్పోర్టి లుక్ కలిగి ఉంది. ఈ కొత్త బైక్ లో 320 సిసి ప్యారలల్-ట్విన్ లిక్విడ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 42 బిహెచ్‌పి శక్తిని, 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
MOST READ:అప్పుడే హ్యాక్ చేయబడిన HSRP అధికారిక వెబ్‌సైట్ ; తర్వాత ఏం జరిగిందంటే

యమహా తన ప్రసిద్ధ వైజెడ్ఎఫ్-ఆర్ 6 బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో నిలిపివేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో చాలా సంవత్సరాలుగా సూపర్‌స్పోర్ట్ విభాగంలో ఆధిపత్యం వహించిన బైక్ ఈ యమహా వైజెడ్ఎఫ్-ఆర్ 6. యమహా వైజెడ్ఎఫ్-ఆర్ 6 సూపర్స్పోర్ట్ బైక్, ఇది భారీ అభిమానులను కలిగి ఉంది. ట్రయంఫ్ ఇటీవల డేటోనా 675 సూపర్‌స్పోర్ట్‌ను నిలిపివేసింది.

ఇప్పుడు యమహా కూడా వైజెడ్ఎఫ్-ఆర్ 6 బైక్‌ను అప్‌గ్రేడ్ చేయదని తెలిపింది. అయితే యమహా, వైజెడ్ఎఫ్-ఆర్ 6 బైక్‌ను ట్రాక్-ఓన్లీ మోడల్‌గా అమ్మడం కొనసాగిస్తుందని పేర్కొంది. సంస్థ ప్రకారం ఈ వైజెడ్ఎఫ్-ఆర్ 6 మిడిల్‌వెయిట్ సూపర్‌స్పోర్ట్‌ను అప్‌గ్రేడ్ చేసే ఖర్చు చాలా ఎక్కువ.
MOST READ:కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

ఈ విభాగంలో యమహా యొక్క మొత్తం అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఎందుకంటే సూపర్‌స్పోర్ట్ కేటగిరీలోని బైక్‌లు చాలా ఖరీదైనవి. 600 సిసి సూపర్‌స్పోర్ట్స్ అభివృద్ధి ఖర్చులు దాని లీటర్-క్లాస్ మోడళ్ల ఖర్చులతో సమానంగా ఉంటాయి.

యమహా ఆర్ 3 భారత మార్కెట్లో తన విభాగంలో అత్యుత్తమ బైకులలో ఒకటి. దాని స్పోర్టి లుక్‌తో బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని కారణాల వల్ల, యమహా నవీకరించబడిన మోడల్‌ను భారత మార్కెట్‌కు తీసుకురాలేదు, బిఎస్-6 ఉద్గార ప్రమాణాల కారణంగా యమహా ఆర్ 3 మోడల్‌ను భారతదేశంలో నిలిపివేసింది. కానీ ఈ కొత్త 2021 ఆర్ 3 ని వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయాలని యమహా సన్నాహాలను సిద్ధం చేస్తోంది.
MOST READ:చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు