Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2020 వెస్పా స్కూటర్లకు బుకింగ్స్ ప్రారంభం - వివరాలు
వెస్పా స్కూటర్లలో కొత్త 2020 వెర్షన్లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, పియాజియో ఇండియా ఇప్పటికే తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వెస్పా విఎక్స్ఎల్ మరియు వెస్పా ఎస్ఎక్స్ఎల్ స్కూటర్లకు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ రెండు మోడళ్లను అందరి కంటే ముందుగా సొంతం చేసుకోవాలనే కస్టమర్లు రూ.1,000 అడ్వాన్సు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆన్లైన్లో కూడా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే, ఈ స్కూటర్ ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ నెలాఖరు నాటికి ఈ రెండు మోడళ్లు మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫేస్ లిఫ్ట్ మోడళ్లలో చేసిన మార్పుల చేర్పులను గమనిస్తే, ఇందులో స్కూటర్ యొక్క ఫ్రంట్ డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించవు. ఇంకా ఈ స్కూటర్లో ఎల్ఈడి డిఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్స్ మరియు యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను కూడా జోడించారు.
MOST READ: టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]

ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో ఓవరాల్ స్కూటర్ డిజైన్, కర్వడ్ బాడీ ప్యానెల్స్, రెట్రో-డిజైన్ యదావిధిగా ఉండనుంది. వెస్పా విఎక్స్ఎల్ మరియు ఎస్ఎక్స్ఎల్ స్కూటర్లు 125 సిసి మరియు 149 సిసి ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి.

వెస్పా ఎస్ఎక్స్ఎల్ మరియు విఎక్స్ఎల్ 149 ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ 149 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7,600 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 10.3 బిహెచ్పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అదేవిధంగా, ఈ రెండు మోడళ్లు 125 సిసి ఇంజన్‌తో కూడా లభ్యం కానున్నాయి. ఇందులోని 125 సిసి ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.7 బిహెచ్పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
MOST READ: 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

ఈ చిన్నపాటి మార్పులతో పాటు, ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలోని ఇతర అన్ని ఫీచర్లు కూడా ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ 2020 మోడళ్లలో కొనసాగుతాయి.
MOST READ: ఒకే రోజు 11 జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

వెస్పా ఎస్ఎక్స్ఎల్ శ్రేణి స్కూటర్లలో దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉండే హెడ్‌లైట్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫైవ్-స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటి ఇతర ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. దీనికి దిగువ వేరియంట్ అయిన విఎక్స్ఎల్ మోడళ్లలో గుండ్రటి ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇకపోతే, ఈ రెండు మోడళ్లలో ఏర్పాటు చేసిన సస్పెన్షన్ సిస్టమ్ ఒకేలా ఉంటుంది. ముందు భాగంలో సింగిల్ సైడ్ ఆర్మ్ సెటప్ మరియు వెనుక భాగంలో డ్యూయల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. రెండు స్కూటర్లలో బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో 200 ఎంఎం వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు 140 ఎంఎం డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.
MOST READ: నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

వీటితో పాటు, 125 సిసి స్కూటర్లను కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కంపెనీ అందిస్తుండగా, 149 సిసి స్కూటర్లను మాత్రం అదనపు భద్రత కోసం సింగిల్-ఛానల్ ఏబిఎస్‌తో ఆఫర్ చేస్తున్నారు. ఫేస్ లిఫ్ట్ మోడళ్ల ధరలు స్కూటర్‌కు చేసిన అప్గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

కొత్త 2020 వెస్పా ఫేస్‌లిఫ్ట్ స్కూటర్ల బుకింగ్స్ ఓపెన్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
క్లాసిక్ డిజైన్, మోడ్రన్ ఫీచర్లతో మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన వెస్పా స్కూటర్లకు మొదటి నుంచి ప్రత్యేకమైన డిమాండ్ ఉండి. యువకులు, పెద్దవారు అనే తేడా లేకుండా ఈ మోడళ్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో, కొత్తగా రానున్న 2020 వెస్పా ఫేస్‌లిఫ్ట్ స్కూటర్లు కూడా ఇదే జోరును కొనసాగిస్తాయని మేము ఆశిస్తున్నాము.