ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

పియాజ్జియో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న వెస్పా మరియు ఆప్రిలియా బ్రాండ్ స్కూటర్ల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఓ ప్రత్యేకమైన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు ఈ వాహనాలను కొనుగోలు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో కస్టమర్లకు సురక్షితమైన పద్ధతిలో వాహనాల కొనుగోలు అనుభూతిని కల్పించే దిశలో భాగంగా పియాజ్జియో ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన స్కూటర్‌ను ఎంచుకోవటం నుంచి నగదు చెల్లింపులు డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

కంపెనీ అందిస్తున్న అన్ని రకాల స్కూటర్ల ఫీచర్లను, వాటి సాంకేతిక వివరాలను, కలర్ ఆప్షన్స్, స్టాక్ స్టేటస్, ఎక్స్-షోరూమ్ మరియు ఆన్-రోడ్ ధరలను ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుంచి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు లోన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఈఎమ్ఐని లెక్కించుకోవచ్చు. రూ.1,000 అడ్వాన్స్ చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

లిమిటెడ్ టైమ్ ఆఫర్ క్రింద ఆన్‌లైన్‌లో స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లకి రూ.2,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంకా ఆకర్షనీయమైన రీటైల్ మరియు ఫైనాన్స్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వెస్పా మరియు ఆప్రిలియా స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి తక్కువ వడ్డీ ఫైనాన్స్ పధకాలు కూడా అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

ఈ సందర్భంగా పియాజ్జియో ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డీగో గ్రఫ్ఫీ మాట్లాడుతూ.. గ్లోబల్ బ్రాండ్ అయిన తాము ఎల్లప్పుడూ తమ కస్టమర్లకు బెస్ట్ ఇన్ క్లాస్ అనుభూతిని అందించేందుకే కృషి చేస్తామని, తమ కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంలో తామెప్పుడూ ముందుంటామని, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉత్తమమైన పరిష్కారాలను అందిస్తామని తెలిపారు.

ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

తాము కొత్తగా పరిచయం చేసిన ఆన్‌లైన్ షాపుల ద్వారా కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ సేవలను అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో తమ కస్టమర్ల డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత మెరుగుపరచేలా మరిన్ని ఫీచర్లను చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా డీలర్లు ఇప్పుడు మరింత ఎక్కవ మంది కస్టమర్లకు చేరువయ్యే అవకాశం లభించింది. కస్టమర్ల కొనుగోలుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు ఇదొక చక్కని డిజిటల్ పరిష్కారంగా చెప్పవచ్చు.

ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

మారుతున్న కాలాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా తమ ఉత్పత్తులు మరియు విధానాలను కూడా మార్చుకుంటూ వస్తున్నామని, తమ కస్టమర్ల కోసం సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రణాళికలను అందుబాటులోకి తెస్తామని గ్రఫ్ఫీ తెలిపారు. తమ ప్రపంచ స్థాయి బ్రాండ్‌లు మరియు ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు ఖచ్చితంగా అద్భుతమైన అనుభూతిని పొందుతారని అన్నారు.

ఆన్‌లైన్‌లో వెస్పా, ఆప్రిలియా సేల్స్; స్పెషల్ డిస్కౌంట్స్

వెస్పా, ఆప్రిలియా స్కూటర్ల ఆన్‌లైన్ బుకింగ్స్ ప్లాట్‌ఫామ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వెస్పా మరియు ఆప్రిలియా రెండూ కూడా ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో మంచి డిమాండ్ ఉన్న అంతర్జాతీ బ్రాండ్‌లు. ఈ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్లు ఇకపై డీలర్‌షిప్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని క్లిక్‌లతోనే కస్టమర్లు తమకు నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల్లో ఇది ఓ మంచి ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Thursday, June 11, 2020, 12:35 [IST]
English summary
Piaggio India has introduced new online booking platforms for Vespa and Aprilia in the Indian market. Both brands now feature an exclusive e-commerce platform for its customers to make an online booking. Read in Telugu.
Read more on: #వెస్పా #vespa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+