Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెస్పా రేసింగ్ సిక్స్టీస్ 125సీసీ, 150సీసీ స్కూటర్స్ విడుదల - ధర, వివరాలు
ఇటాలియన్ ప్రీమియం స్కూటర్ బ్రాండ్ వెస్పా భారత మార్కెట్లో "వెస్పా రేసింగ్ సిక్స్టీస్" పేరిట కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్లను విడుదల చేసింది. వెస్పా రేసింగ్ సిక్స్టీస్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానున్నాయి, మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
-> వెస్పా రేసింగ్ సిక్స్టీస్ 125సీసీ - రూ.1.20 లక్షలు
-> వెస్పా రేసింగ్ సిక్స్టీస్ 150సీసీ - రూ.1.32 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్లను కంపెనీ విక్రయిస్తున్న వెస్పా ఎస్ఎక్స్ఎల్ 125 మరియు ఎస్ఎక్స్ఎల్ 150 మోడళ్లను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. వెస్పా ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను తొలిసారిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

ఇప్పుడు ఈ రెండు మోడళ్లను కంపెనీ అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్సపై ఆసక్తిగల కస్టమర్లు ఏదైనా వెస్పా బ్రాండ్ అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ రూ.1000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో స్కూటర్‌ను బుక్ చేసుకునే కస్టమర్లు రూ.2,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ డిజైన్‌ను గమనించినట్లయితే, ఇది పేరుకు తగినట్లుగానే 1960 కాలంలోని వెస్పా రేసింగ్ స్కూటర్ల నుండి ప్రేరణ పొంది వీటిని కస్టమైజ్ చేశారు. ఈ కొత్త స్కూటర్ స్పోర్టి ట్విస్ట్‌తో క్లాసిక్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

లిమిటెడ్ ఎడిషన్ వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ రెడ్ కలర్ రేసింగ్ స్ట్రైప్స్ మరియు వైట్ పెయింట్ కలర్‌తో లభ్యం కానుంది. ఫ్రంట్ ఫెండర్, ఆప్రాన్ మరియు వెనుక బాడీ ప్యానెళ్ల నుండి స్కూటర్ యొక్క మొత్తం పొడవునా ఈ రెడల్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి. దీనికి మరింత స్టైల్‌ను జోడించడానికి, ఇందులో బంగారు రంగు అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.
MOST READ:ట్రాక్టర్ వెనుకవైపు పెద్ద టైర్లు ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

ఈ లిమిటెడ్ ఎడిషన్ రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్లో పైన పేర్కొన్న మార్పుల మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవు. ఇంజన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ ఎస్ఎక్స్ఎల్ 125 మరియు ఎస్ఎక్స్ఎల్ 150 స్కూటర్లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఇందులోనూ ఉపయోగించారు.
వెస్పా రేసింగ్ సిక్స్టీస్ 125 స్కూటర్లో అప్డేట్ చేయబడిన బిఎస్6 124సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 బిహెచ్పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే, వెస్పా రేసింగ్ సిక్స్టీస్ 150 స్కూటర్లో బిఎస్6 149సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7600 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 బిహెచ్పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.30 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.
MOST READ:ఇది బుల్లెట్ బైక్ నుంచి తయారైన పాప్‌కార్న్ [వీడియో]

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్లలో కాస్మెటిక్ అప్డేట్స్తో పాటుగా ఇతర యాంత్రిక పరికరాలు మరియు కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో మోనోకోక్ ఫుల్-స్టీల్ బాడీ, డిస్క్ బ్రేక్‌లతో కూడిన ట్విన్-పాట్ కాలిపర్స్, ఎంచుకునే వేరియంట్‌ను బట్టి యాంటీ-లాక్ బ్రేకింగ్ (ఏబిఎస్) లేదా కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్టాండర్డ్ ఎస్ఎక్స్ఎల్ 125 మరియు 150 స్కూటర్లలో లభించే అన్ని ఫీచర్లు, పరికరాలు ఈ లిమిటెడ్ ఎడిషన్‌లోనూ లభ్యం కానున్నాయి. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ముందు భాగంలో విండ్ డిఫ్లెక్టర్, అండర్-సీట్ స్టోరేజ్‌లో యుఎస్బీ ఛార్జర్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

వెస్పా రేసింగ్ సిక్స్టీస్లో కాంట్రాస్ట్ వైట్ స్టిచింగ్‌తో కూడిన బ్లాక్ లెదర్ సీట్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది. ప్రత్యేక పెయింట్ స్కీమ్‌తో రానున్న ఈ మోడల్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తుందని వెస్పా ఆశిస్తోంది.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
వెస్పా రేసింగ్ సిక్స్టీస్ ఒక ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్, ఇది 1960 కాలం నాటి ఐకానిక్ మొనాకో మరియు మోన్జా వంటి రేసింగ్ సర్క్యూట్లలో ఉపయోగించిన వెస్పా రేసింగ్ వారసత్వాన్ని గుర్తు చేసేలా వీటిని డిజైన్ చేశారు. భారత మార్కెట్లో ఇది యువతరాన్ని ఆకట్టుకుట్టుందని డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.