వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

2020 ఆటో ఎక్స్‌పోలో వెస్పా రేసింగ్ సిక్స్టీస్ అనే ఒక కొత్త స్కూటర్ ని పరిచయం చేసింది. ఈ వెస్పా యొక్క కొత్త స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

ఇటాలియన్ వాహన తయారీదారు అయిన వెస్పా 2020 ఆటో ఎక్స్‌పోలో మరో కొత్త బ్రాండ్ ని విడుదల చేసింది. దీని పేరే వెస్ప రేసింగ్ సిక్స్టీస్. ఇది బిఎస్- 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడింది.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ కొత్త ఫీచర్స్ మరియు కొన్ని సౌందర్య మార్పులను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా మునుపటి వెస్పా రేసింగ్ లివరీల నుండి ప్రేరణ పొందింది.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

వెస్పా నుండి విడుదలైన ఈ కొత్త స్కూటర్ కి సంభందించిన ధరల గురించి ఇంకా కంపెనీ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. కానీ వెస్పా 125 తో పాటు వచ్చే నెల నుంచి విక్రయాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ తెలుపు రంగులో ఉంటుంది. ముందు భాగంలో మరియు ఇరువైపులా ఎరుపు రంగుతో ఉంటుంది. గోల్డ్ కలర్ చక్రాలను కలిగి ఉంటుంది. బైక్ యొక్క కలర్ కి సరిపోయే విధంగా సీటుపై తెలుపు రంగు పైపింగ్ ఉంటుంది. హెడ్‌లైట్ సరౌండ్, మిర్రర్స్ మరియు ఎగ్జాస్ట్ షీల్డ్ వంటి భాగాలు బ్లాక్ కలర్ లో ఉంటాయి.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

వెస్పా సిక్స్టీస్ లో 150 సిసి ఇంజిన్ ఉంటుంది. ఇది 7,600 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 హెచ్‌పి మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే ఇందులో ముందు భాగంలో 200 ఎంఎం డిస్క్, వెనుక వైపు 140 ఎంఎం ఉంటాయి. ఇందులో అండర్ సీట్ లైట్ మరియు యుఎస్బి ఛార్జర్ సదుపాయం కూడా ఉంటుంది.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

సాధారణంగా బిఎస్-6 కంప్లైంట్ ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.26 లక్షలు వరకు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఉంటుంది. కానీ రేసింగ్ సిక్స్టీస్ కి ఎక్కువ ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. అంటే దీని ధర దాదాపుగా రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఉంటుందని ఆశిస్తున్నారు.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ చూశారా!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వెస్పా యొక్క సిక్స్టీస్ చూడటానికి చాల ఆకర్షణీయంగా ఉంటుది. ఇది బిఎస్-6 ఉద్గారా ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేయబడి ఉంటుంది. దీని ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఉండవచ్చు. వీటి విక్రయాలు ఈ ఏడాది మార్చి నుంచి ఆరంభమయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 8, 2020, 10:12 [IST]
English summary
Limited-edition Vespa Racing Sixties to launch next month. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+