డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

ఇటలీలోని రిమినిలో ఉన్న మోటారుసైకిల్ తయారీదారు వైరస్, తమ తాజా ఉత్పత్తిని అలీన్ అని వెల్లడించారు. డుకాటీ ఇంజిన్ కారణంగా అలీన్ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ కొత్త వైరస్ అలీన్ సూపర్ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. !

డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

వైరస్ అలీన్ అనేది బ్రాండ్ చేత ఆవిష్కరించబడిన హై-ఎండ్ మోటార్ సైకిల్. ఈ మోటారుసైకిల్ ధర సుమారు రూ. 45 లక్షలు వరకు ఉంటుంది. అలీన్ ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త మోటార్ సైకిల్ లో సింగిల్ సైడెడ్ స్వింగార్మ్, ఎక్స్‌పోజ్డ్ ఇంజన్, సొగసైనస్లీక్ లుకింగ్ హెడ్‌లైట్లు మరియు టెయిల్ లైట్లు ఈ బైక్ కి చాల అనుకూలంగా ఉండే విధంగా ఉంటాయి.

డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

ఇందులో సూపర్ బైక్ డుకాటీ నుండి అరువు తెచ్చుకున్న ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ లో సూపర్క్వాడ్రో 1,285 సిసి వి-ట్విన్-ఇంజన్ ఉంటుంది. ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 205 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, అంతే కాకుండా ఇది ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

వైరస్ అలీన్ కమ్స్ డబుల్-బీమ్ మెగ్నీషియం చాసిస్ మీద నిర్మించబడింది. దీనిని సంస్థ ‘డబుల్ ఒమేగా డిజైన్' అని పిలుస్తారు. బాడీ పార్ట్స్ మరియు చక్రాలు కార్బన్ ఫైబర్ నుండి తయారవుతాయి. దీనితో మోటారుసైకిల్ తేలికైనదిగా ఉండటమే కాకుండా మరియు శక్తివంతమైనదిగా కూడా ఉంటుంది. సూపర్ బైక్ లో ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ కలిగిన కాంపోజిట్ హ్యాండ్‌గార్డ్‌లు ఉన్నాయి.

డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

కన్వెన్సినలీన్ ఫోర్క్ మరియు టి-స్టెమ్ సెటప్‌కు బదులుగా హైడ్రాలిక్ వైర్డ్ స్టీరింగ్ సిస్టమ్ అని పిలువబడే హబ్-సెంటర్ స్టీరింగ్‌ను అలీన్ కలిగి ఉంది. హబ్-సెంటర్ స్టీరింగ్ సిస్టమ్ స్టీరింగ్ మరియు సస్పెన్షన్ డ్యూటీస్ ని వేరు చేస్తుంది. వైరస్ యొక్క ప్రాజెక్ట్ లీడర్ అస్కానియో రోడోరిగో 2004 లో ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు మరియు బిమోటా టెసి 2 డి సూపర్ బైక్ లో ప్రదర్శించారు.

డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

అలీన్ పై బ్రేకింగ్ విధులను రెండు చివర్లలో బ్రెంబో జిపి 4 సిరీస్ యూనిట్లు నిర్వహిస్తాయి. సస్పెన్షన్ సెటప్‌లో కంపెనీ వైరస్ పుష్-రాడ్ ట్విన్-పివట్ సిస్టమ్ రెండు చివర్లలో ఉంటుంది. ఈ బ్రాండ్ మోటారుసైకిల్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది.

అయితే వైరస్ ధర మరియు ఉత్పత్తి చేయబోయే యూనిట్ల సంఖ్యను ఇంకా వెల్లడించలేదు. వైరస్ అలీన్ సూపర్బైక్ ప్రత్యేకతను కొనసాగించడానికి కంపెనీ పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేస్తుందని ఆశించవచ్చు.

డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

ఈ కొత్త వైరస్ బైక్ చూడటానికి చాలా కొత్త డిజైన్ ని కలిగి ఉంటుంది. ఈ బైక్ గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. కానీ ఈ బైక్ చాల ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అంతే కాకుండా సూపర్ బైక్ డిజైన్ ని కలిగి ఉంటుంది. కాబట్టి మార్కెట్లో చాల మంది వాహన ప్రియులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Vyrus Alyen Superbike Powered By Ducati Engine Revealed: Next Batman Motorcycle. Read in Telugu.
Story first published: Thursday, April 9, 2020, 10:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X