Just In
Don't Miss
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- News
విచ్చలవిడి దోపిడీ: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి, వేలకోట్ల అవినీతి అంటూ వివేక్
- Finance
ఢిల్లీలో రూ.85 దాటిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.92
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ స్కూటర్ ధర స్మార్ట్‌ఫోన్ కన్నా చీప్; ఎక్కడో తెలుసా?
చైనాకి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ షియోమి, మార్కెట్లో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. షియోమి నైన్‌బోట్ సి30 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ చైనా మార్కెట్లో విడుదల చేసింది. అర్బన్ రైడింగ్ కోసం కాంపాక్ట్ సైజులో తయారు చేసిన ఈ స్కూటర్ చాలా సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం దాని ధర. ఈ స్కూటర్ ధర ఓ సాధారణ స్మార్ట్ ఫోన్ ధర కన్నా తక్కువగా ఉంటుంది. షియోమి నైన్‌బోట్ సి30 ను చైనా మార్కెట్లో 2,000 యువాన్ల ప్రారంభ ధరతో విడుదల చేశారు. (ప్రస్తుత మారకపు రేటు ప్రకారం మన దేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.21,300 గా ఉంటుంది).

షియోమి ఇటీవలే ఈ స్కూటర్ ధరను 3599 యువాన్లకు పెంచింది (అంటే మన కరెన్సీలో సుమారు రూ.38,500 కి సమానం, పన్నులు మినహాయించి). ఈ స్కూటర్ ధరలు పెంచినప్పటికీ, ఇది ఇంకా చాలా సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగానే ఉందని కంపెనీ పేర్కొంది. దీని ధర మార్కెట్లో కొన్ని మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే తక్కువగా ఉంటుందని షియోమి తెలిపింది.
MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

షియోమి నైన్‌బోట్ సి30 ఎలక్ట్రిక్ స్కూటర్ లో-రేంజ్ మోడల్, ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపటానికి ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

నైన్‌బోట్ సి30 లోని బ్యాటరీని తొలగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఉపయోగించిన బ్యాటరీ బరువు కేవలం 6 కిలోలు మాత్రమే ఉంటుంది. బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 35 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఇవి చక్కగా సరిపోతాయి, ప్రత్యేకించి మెట్రో రైళ్ల వద్ద వినియోగానికి ఇవి అనువుగా ఉంటాయి.
MOST READ:గంటకు 300 కి.మీ వేగంతో రైడ్ చేసిన బెంగళూరు బైకర్ అరెస్ట్ ; 20 లక్షల బైక్ సీజ్

షియోమి నైన్‌బోట్ సి30 ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లతో వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లతో జతచేయబడి ఉంటుంది. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ లైట్స్‌తో పాటుగా వెనుక వైపు లగేజ్ ర్యాక్ కూడా ఉంటుంది. ఇదొక సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒక్కరి కోసం మాత్రమే తయారు చేయబడినది.

తక్కువ రేంజ్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మ్యాన్యువల్ పెడల్స్‌ని కూడా జోడించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయినట్లయితే పెడల్స్ సాయంతో తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు. షియోమి నైన్‌బోట్ సి30 ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.
MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

షియోమి నైన్‌బోట్ సి30 ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ ఈ స్కూటర్‌ను యుఎస్ఓతో పాటు మరికొన్ని యూరోపియన్ దేశాలలోప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే, నైన్‌బోట్ సి30 ప్రస్తుతం భారత మార్కెట్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

షియోమి నైన్‌బోట్ సి30 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
షియోమి నైన్‌బోట్ సి30 ఎలక్ట్రిక్ స్కూటర్ మెట్రో రైళ్ల వద్ద లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఉపయోగించడానికి లేదా సరదాగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇంటి పరిసర ప్రాంతాల్లో రైడ్ చేయటానికి అనువుగా ఉంటుంది. పూర్తిస్థాయి కమర్షియల్ టూవీలర్‌గా ఉపయోగించడానికి ఇది పనికిరాదు.
MOST READ:ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !