యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్లో రెండు కొత్త బిఎస్6 ద్విచక్ర వాహనాలను మార్కెట్లో విడుదల చేసింది. అందులో ఒకటి యమహా ఎఫ్‌జెడ్25, మరొకటి యమహా ఎఫ్‌జెడ్ఎస్25. యమహా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌జెడ్ఎస్25తో పాటుగా ఎఫ్‌జెడ్25 మోడల్‌ను ఆవిష్కరించింది.

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన బిఎస్6 కంప్లైంట్ 249 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.5 బిహెచ్‌పి శక్తిని మరియు 10.2 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో మోనోటోన్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడి హెడ్‌లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు, టెయిల్ లైట్లు, ఇంజన్ కౌల్ మరియు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

యమహా ఎఫ్‌జెడ్25 మరియు ఎఫ్‌జెడ్ఎస్25 మోడళ్లలో ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, పొడవైన వైజర్, హ్యాండిల్ గ్రిప్స్‌పై బ్రష్ గార్డ్స్ మరియు గోల్డ్ ఫినిషింగ్‌తో కూడిన అల్లాయ్ వీల్స్.

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

ఈ రెండు మోటార్‌సైకిళ్ళ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సెవే-వే అడ్జస్టబల్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 282 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా కలిగి ఉంటాయి.

MOST READ:గర్భిణీ స్త్రీకి సహాయం చేసినందుకు ఇబ్బందుల్లో పడిన ఆటో డ్రైవర్ ; ఎలానో తెలుసా ?

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

యమహా ఎఫ్‌జెడ్25 రేసింగ్ బ్లూ మరియు మెటాలిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ఎఫ్‌జెడ్ఎస్25 మాత్రం డార్క్ మ్యాట్ బ్లూ, పాటినా గ్రీన్ మరియు వైట్ వెర్మిలియన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

దేశీయ మార్కెట్లో బిఎస్6 కంప్లైంట్ యమహా ఎఫ్‌జెడ్25 ధర రూ.1,52,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఇకపోతే యమహా ఎఫ్‌జెడ్ఎస్25 బిఎస్6 మోడల్ ధర రూ.1,57,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

MOST READ:ఇది చూసారా.. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదిక మీ ఇంటికే వస్తుంది

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

యమహాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కోవిడ్-19 వారియర్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన ఫైనాన్స్ పథకాలను ప్రకటించింది. వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు పోలీసు అధికారుల కోసం ప్రత్యేక ఈఎమ్ఐ పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

ఈ ఏడాది జూలై చివరి వరకు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత యమహా డీలర్‌షిప్‌లలో ఈ పథకం వినియోగదారులకు అందుబాటులో ఉందని యమహా తెలిపింది. ఈ బ్రాండ్ కోవిడ్-19 యోధుల కోసం ప్రత్యేక సర్వీస్ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించింది.

MOST READ:అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

యమహా ఎఫ్‌జెడ్25 బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

యమహా ఎఫ్‌జెడ్25 ఈ విభాగంలో ఓ అద్భుతమైన మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది. హై క్వాలిటీ ఫినిషింగ్‌తో అత్యుత్తమ సౌకర్యాన్ని మరియు రిలాక్స్డ్ రైడ్‌ను అందించడంలో ఈ మోటార్‌సైకిల్ చక్కగా అనిపిస్తుంది. యమహా బ్రాండ్‌కు ఈ కొత్త బిఎస్6 ఎఫ్‌జెడ్25, ఎఫ్‌జెడ్ఎస్25 ప్రీమియం మోటార్‌సైకిళ్లు మార్కెట్లో మంచి ఫలితాలు తెచ్చిపెట్టగలవని మా అభిప్రాయం.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Japanese auto manufacturer Yamaha has launched its BS6 compliant FZ25 in India at a price of Rs 1,52,100, ex-showroom Delhi. The Yamaha FZ25 was unveiled during February this year along with the Yamaha FZS25. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X