Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కస్టమర్ల కోసం కొత్త టెస్ట్ రైడ్ క్యాంపైన్‌ను ప్రారంభించిన యమహా - బహుమతులు
యమహా మోటార్ ఇండియా, భారతదేశంలోని తమ కస్టమర్ల కోసం ఓ సరికొత్త టెస్ట్ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పటికే యమహా స్కూటర్లను కలిగిన ఉన్న కస్టమర్లు, తమ సహచరులకు వ్యక్తిగతమైన టెస్ట్ రైడ్ అనుభూతిని అందించేలా కంపెనీ ఈ కొత్త క్యాంపైన్‌ను ప్రారంభించింది.

"టెస్ట్ రైడ్ మై యమహా" అని పిలువబడే ఈ క్యాంపైన్ కొత్త రైడర్లకు మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించేందుకు సహాయపడుతుంది. ఈ క్యాంపైన్‌లో భాగంగా, యమహా స్కూటర్లను కలిగిన ప్రస్తుత కస్టమర్లు, తమ స్కూటర్‌ని టెస్ట్ రైడ్ కోసం ఉపయోగించవచ్చు.

ఇలా సదరు కస్టమర్లు తమ మిత్రులు, సహోద్యోగులు, ఇరుగు పొరుగు వారు మొదైలన వారికి తమ స్వంత యమహా స్కూటర్ సాయంతో టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని అందించవచ్చు. ఇలా చేసినందుకు గాను ప్రస్తుత యమహా స్కూటర్లను కలిగి ఉన్న కస్టమర్లకు కంపెనీ ప్రత్యేక బహుమతులను అందజేయనుంది.
MOST READ:ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ, రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ మరియు స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ స్కూటర్లను కలిగి ఉన్న యమహా కస్టమర్లు తమ స్కూటర్లను టెస్ట్ రైడ్ ప్రచారం కోసం ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. తమ స్కూటర్ ద్వారా 20 టెస్ట్ రైడ్‌లు పూర్తి చేసిన వినియోగదారులకు యమహా టాలెంట్ బ్యాగ్‌తో రివార్డ్ చేస్తుంది.

అదే, ఇలా 50 టెస్ట్ రైడ్‌లు నిర్వహించిన కస్టమర్లకు ఈ ప్రోగ్రాం కింద ఓ యమహా టీ షర్టును అందిస్తుంది. కస్టమర్లు ఇంకా ముందుకెళ్లి 1000 టెస్ట్ రైడ్‌లను ఆఫర్ చేసినట్లయితే, వారికి సరికొత్త ఫాసినో 125 ఎఫ్‌ఐ స్కూటర్‌ను గెలుచుకునేందుకు గాను లక్కీ డ్రాలో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది.
MOST READ:అక్కడ వాహనాలపై ఆ పేర్లు ఉన్నాయంటే.. ఇక అంతే..!

కస్టమర్లు తన స్కూటర్ ద్వారా టెస్ట్ రైడ్‌లను ఆఫర్ చేసిన తర్వాత అందుకు సంబంధించిన ఫొటోలు మరియు వివరాలను బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ధృవీకరించబడతాయి.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ప్రత్యేక ప్రచారం యొక్క మొత్తం లక్ష్యం ఏంటంటే, ప్రస్తుత యమహా కస్టమర్లతో మరింత బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడమే. అంతేకాకుండా, కంపెనీ అందిస్తున్న 125సిసి స్కూటర్ మోడళ్లలోని అధునాతన భద్రతా ఫీచర్లు మరియు సాంకేతికతలపై వారి కుటుంబం మరియు స్నేహితులలో అవగాహన కల్పించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
MOST READ:గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

టెస్ట్ రైడ్ మై యమహా క్యాంపైన్ దేశంలోని యమహా స్కూటర్ కొనుగోలుదారులకు టచ్ అండ్ ఫీల్‌తో పాటు వ్యక్తిగతీకరించిన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టెస్ట్ రైడ్ అందించేటప్పుడు ప్రస్తుత వినియోగదారులు యమహా స్కూటర్లలోని అధునాతన టెక్నాలజీలను మరియు భద్రతా ఫీచర్ల గురించి తమ సహచరులకు వివరించవచ్చు.

లేటెస్ట్ యమహా స్కూటర్లలో "స్టాప్ / స్టార్ట్ సిస్టమ్", "స్మార్ట్ మోటార్ జనరేటర్ (ఎస్ఎమ్‌జి) మరియు "సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ స్విచ్" మొదలైన అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం యమహా భారత మార్కెట్లో ఫాసినో 125 ఎఫ్‌ఐ, రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ మరియు స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ స్కూటర్లను అందిస్తోంది.
MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

ఈ స్కూటర్లన్నీ ఒకే రకమైన 125సిసి ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 6500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8 బిహచ్‌పి పవర్‌ను మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం అన్ని స్కూటర్లు బ్రాండ్ యొక్క స్టాప్ / స్టార్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి.

ఈ స్కూటర్లలోని ఇతర ఫీచర్లలో యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ (యుబిఎస్), మల్టీఫంక్షన్ కీ, హాలోజన్ హెడ్‌ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్, ట్యూబ్‌లెస్ టైర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. కాగా, యమహా రేజెడ్ఆర్ 125 స్ట్రీట్ ర్యాలీ స్కూటర్ మోడల్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్‌ఇడి పొజిషన్ లాంప్స్ మరియు నకల్ గార్డ్స్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.