బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. 'యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్' అని పిలువబడే బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీని కంపెనీ దేశంలో విడుదల చేసింది.

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

ఈ టెక్నాలజీ పొందిన మొట్టమొదటి మోటార్‌సైకిల్‌గా యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ నిలిచింది. భారత మార్కెట్లో బ్లూటూత్ ఎనేబుల్ చేసిన ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ ధరను రూ.1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.

యమహా 150సిసి విభాగంలో అందిస్తున్న ఇతర ఎఫ్‌జెడ్ సిరీస్ మోటార్‌సైకిళ్లలో కూడా ఈ కొత్త కనెక్ట్ ఎక్స్ బ్లూటూత్ టెక్నాలజీని చేర్చనున్నామని కంపెనీ ప్రకటించింది. అయితే, ఇందుకోసం వినియోగదారులు అదనపు ఖర్చుతో కంపెనీ యాడ్-ఆన్‌గా అందించే ఓ పరికరాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

యమహా తాజాహా విడుదల చేసిన బ్లూటూత్ ఎనేబుల్డ్ ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ మోటార్‌సైకిల్ నవంబర్ 1, 2020వ తేదీ నుండి అమ్మకానికి రానుంది. ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు వారికి సమీపంలో ఉన్న అధీకృత యమహా డీలర్‌షిప్‌లను సందర్శించవచ్చు.

MOST READ:కారు బోనెట్ మీద పడిన పోలీస్.. పట్టించుకోకుండా కార్ డ్రైవింగ్, చివరికి ఏమైందంటే ?

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ యొక్క స్టాండర్డ్ మోడల్ ధర రూ.1,05,200గా ఉంది. బ్లూటూత్ అప్‌డేట్ తర్వాత ఈ మోటార్‌సైకిల్ ధర రూ.1,07,700కి పెరిగింది. అంటే, ఈ కనెక్టింగ్ టెక్నాలజీ కోసం కంపెనీ అదనంగా రూ.2,500ల మొత్తాన్ని కస్టమర్ నుండి వసూలు చేస్తోంది. మరి ఇతర మోడళ్లలో యాడ్-ఆన్‌గా అందించే పరికరం కోసం కంపెనీ ఇంతే మొత్తం వసూలు చేస్తుందో లేదో చూడాలి.

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

‘యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్' యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది. యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్‌ను కేవలం రెండు సాధారణ దశల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. మొబైల్‌లో ‘సింగిల్ టచ్' ద్వారా రైడర్‌కు బైక్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఈ అప్లికేషన్ డిజైన్ చేశారు.

యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్ అప్లికేషన్‌లో ఆరు ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో మొబైల్ పరికరం నుండి రైడర్ ఆన్సర్ బ్యాక్, ఇ-లాక్, లొకేట్ మై బైక్ మరియు హజార్డ్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. అయితే, ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ లేదు.

MOST READ: దేశీయ మార్కెట్లో ఆడి క్యూ2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

యాప్‌లో ‘ఆన్సర్ బ్యాక్' ఫీచర్‌ను ఉపయోగించడం వల్ల బైక్ యొక్క బ్లింకర్ మరియు హార్న్ బీపింగ్ సౌండ్ యాక్టివేట్ అవుతాయి. అలాగే, ఇందులోని ‘ఇ-లాక్' ఫంక్షన్ సాయంతో వినియోగదారులు తమ బైక్‌ను రిమోట్‌గా లాక్ చేయడానికి సహకరిస్తుంది.

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

అలాగే, ఇందులోని ‘లొకేట్ మై బైక్' ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు బైక్ యొక్క ఇండికేటర్లు 10 సెకన్ల పాటు నిరంతరం బ్లింక్ అవుతూ, గుంపులో పార్క్ చేసిన బైక్‌ను గుర్తించేందుకు సహాయపడుతుంది. వినియోగదారులు ఆపదలో ఉన్నప్పుడు ‘హజార్డ్' ఫంక్షన్‌ను ఉపయోగించడం ద్వారా నాలుగు ఇండికేటర్లు బ్లింక్ అవుతూ అవతలి వారిని అప్రమత్తం చేయడంలో సహకరిస్తుంది.

MOST READ:తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల భీభత్సం ; భారీ సంఖ్యలో కొట్టుకుపోయిన వాహనాలు

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్ మొత్తం రైడింగ్ అనుభవాన్ని మారుస్తుంది మరియు ‘రైడింగ్ హిస్టరీ' ఫంక్షన్‌ను ఉపయోగించి రైడర్ ప్రయాణించిన దూరం, సగటు వేగం, బ్రేక్ కౌంట్ మరియు బ్యాటరీ వోల్టేజ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు సహకరిస్తుంది. అలాగే, ‘పార్కింగ్ రికార్డ్' ఫంక్షన్ సాయంతో బైక్‌ను చివరి సారిగా నిలిపిన ప్రదేశాన్ని కూడా గుర్తించవచ్చు.

బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

బ్లూటూత్ టెక్నాలజీతో కూడిన యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఇటీవలి కాలంలో టూవీలర్లలో బ్లూటూత్ ఎనేబుల్డ్ కనెక్టింగ్ టెక్నాలజీ చాలా ప్రధానమైన ఫీచర్‌గా మారిపోయింది. దీని సాయంతో రైడర్ తమ వాహనాన్ని రిమోట్‌గా కంట్రోల్ చేసేందుకు మరియు వాహనానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా యమహా కూడా తమ పాపులర్ ఎఫ్‌జెడ్ సిరీస్ మోటార్‌సైకిళ్లలో ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం స్వాగతించదగిన విషయం.

MOST READ:సైక్లిస్టులు ఇలా చేస్తే భారీ జరిమానా తప్పదు.. ఎలాగో తెలుసా ?

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha FZS Dark Knight Edition Launched With Bluetooth Technology. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X