కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులను పదవులను నుంచి తప్పిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా యమహా మోటార్స్ ఇండియా దేశంలో తమ ఉద్యోగులను తప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

యమహా తమ కార్యకలాపాల యొక్క ప్రధాన పునర్నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈటి ఆటోలో ప్రచురించిన కథనం ప్రకారం, యమహాపై కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా భారతదేశంలో రెండు యమహా ప్లాంట్‌లో పునర్నిర్మాణం పేరిట భారీ మార్పులు చేస్తోంది.

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

తాజా నివేదికల ప్రకారం, సుమారు 200 మంది ఉద్యోగులను యమహా తొలగించనున్నట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే దాదాపు 80 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్, సేకరణ వంటి వివిధ యమహా విభాగాల్లో ఈ ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి.

MOST READ:భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త టైర్ తయారీ సంస్థ... గందరగోళంలో ఉన్న ఇతర సంస్థలు

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

కోవిడ్-19 ప్రభావం తర్వాత యమహా తమ కార్యకలాపాల పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కంపెనీ అమ్మకాలు 83 శాతానికి పైగా క్షీణించాయి. ఫలితంగా గ్రేటర్ నోయిడాలోని సూరజ్‌పూర్ ప్లాంట్‌లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ప్రక్రియ మందగించినట్లు తెలుస్తోంది.

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

ఈ నేపథ్యంలో, యమహా తమ స్కూటర్ అసెంబ్లీ లైన్‌ను చెన్నైలో ఉన్న ప్లాంట్‌కు మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సూరజ్‌పూర్ ప్లాంట్‌లో యమహా ఆర్15, ఎఫ్‌జెడ్ సిరీస్ మరియు ఎమ్‌టి-15 వంటి ప్రీమియం శ్రేణి మోటార్‌సైకిళ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.

MOST READ:కొత్త వాహనాలకు పాత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ; ఎక్కడో తెలుసా ?

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

యమహా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో కూడా తమ ఉద్యోగులను పూర్తిగా రీషఫుల్ చేస్తున్నట్లు ఈటి ఆటో నివేదించింది. అత్యుత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులకు యమహా సూరజ్‌పూర్ ప్లాంట్ నుంచి చెన్నై ప్లాంట్‌కు బదిలీ చేసే అవకాశం కూడా ఉందని ఆ నివేదికలో పేర్కొంది.

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేందుకే యమహా ఇండియా తమ కార్యకలాపాల పునర్నిర్మాణం మరియు ఉద్యోగుల రీషఫులింగ్‌లను చేపట్టింది. ఇండోనేషియాను కూడా అధిగమించి వచ్చే ఐదేళ్లలో ద్విచక్ర వాహనాల తయారీలో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా భారత్ మారుతుందని ఈ జపానీస్ బ్రాండ్ భావిస్తోంది. భారత మార్కెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యమహాకు మొదటి ప్రాధాన్యతగా పరిగణించబడుతోంది.

MOST READ:కొడుకు పరీక్ష రాయించడానికి 105 కి.మీ సైకిల్ పై తీసుకెళ్లిన తండ్రి

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

యమహా ఇటీవలే ఓ వర్చువల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా ఓ కొత్త యూజర్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులకు యమహా ఉత్పత్తులను చూడటానికి, బుక్ చేసుకోవడానికి మరియు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కరోనా ఎఫెక్ట్: యమహా ఇండియాలో ఉద్యోగాల కోత

యమహా జాబ్ కట్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశం యమహాకు త్వరలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లో యమహా భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేలా ఈ పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టింది. ఈ పునర్నిర్మాణ కార్యకలాపాలు యమహాకు భారత మార్కెట్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సహాయపడతాయనేది మా అభిప్రాయం.

MOST READ:సెక్యూరిటీ లేకుండా రోడ్ మీద బెంజ్ కారు డ్రైవ్ చేస్తున్న రతన్ టాటా [వీడియో]

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Motors India is said to be planning on a major restructuring of its operations in the country. According to reports from ET Auto, the two-wheeler manufacturer has been heavily impacted by the COVID-19 pandemic, causing a major reshuffle at its two facilities in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X