వర్చువల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభించిన యమహా

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారతదేశంలో కొత్తగా వర్చువల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇందు కోసం కంపెనీ ఆన్‌లైన్ అమ్మకాల సౌకర్యంతో ఓ కొత్త యూజర్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. యమహా "ది కాల్ ఆఫ్ ది బ్లూ" అనే వ్యూహాత్మక ప్రచారంలో భాగంగా తమ కస్టమర్లకు ఆసక్తికరమైన మరియు ఇబ్బంది లేని అనుభవాలను అందిస్తుంది.

వర్చువల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభించిన యమహా

యమహా ఈ ఆన్‌లైన్ సేల్స్ మాడ్యూల్‌ను చెన్నై ప్రారంభిస్తుందని, ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 300 డీలర్‌షిప్‌లను కవర్ చేయనుందని కంపెనీ తెలిపింది.

వర్చువల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభించిన యమహా

యమహా వర్చువల్ స్టోర్ ప్రారంభించిన సందర్భంగా, యమహా మోటార్ ఇండియా గ్రూప్ కంపెనీల ఛైర్మన్ మోటోఫుమి శిటారా మాట్లాడుతూ, " భారతదేశంలో ద్విచక్ర వాహన కస్టమర్ల కోసం డిజిటల్ భవిష్యత్, మరియు వర్చువల్ స్టోర్‌తో మా కొత్త వెబ్‌సైట్ మెరుగైన కొనుగోలు అనుభవాన్ని మరియు పర్సనలైజ్డ్ కస్టమర్ సేవలను (వన్ టు వన్ సర్వీస్) అందించడానికి సిద్ధంగా ఉందని" అన్నారు.

MOST READ:స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా' కార్లు

వర్చువల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభించిన యమహా

"కస్టమర్ అంచనాలకు మించిన ఉత్సాహాన్ని అందించే యమహా ఫిలాసఫీతో ప్రారంభించిన కొత్త యమహా వెబ్‌సైట్ సరికొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది, ఎందుకంటే మేము యమహా రిటైల్ కార్యకలాపాల యొక్క డిజిటల్ పరివర్తనను సురక్షితమైన, నమ్మకమైన మరియు ఆకర్షణీయమైన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వేగవంతం చేస్తాము. భవిష్యత్తులో మా కస్టమర్‌లు ఇదే పోర్టల్ ద్వారా దుస్తులు మరియు ఉపకరణాలను కొనుగోలుచేసే విధంగా ఏర్పాట్లు చేస్తామని" ఆయన చెప్పారు.

వర్చువల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభించిన యమహా

కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇంటి నుంచి బయటకు రావల్సిన అవసరం లేకుండానే, సామాజిక దూర నిబంధనలను పాటించేలా ఈ కొత్త వర్చువల్ స్టోర్ కస్టమర్లను ప్రోత్సహిస్తుంది. యమహా ప్రారంభించిన ఈ కొత్త వర్చువల్ స్టోర్ సాయంతో, వెబ్‌సైట్‌ను సందర్శించే కస్టమర్లు యమహా ఉత్పత్తుల మధ్య స్పెసిఫికేషన్ పోలికతో పాటు ఉత్పత్తుల యొక్క 360-డిగ్రీల వీక్షణ పొందవచ్చు. ఇందులోని దశలన్నీ చాలా సులువుగా, కస్టమర్లకు అర్థమయ్యేలా డిజైన్ చేయబడి ఉంటాయి.

MOST READ:మహీంద్రా కార్లపై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు

వర్చువల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభించిన యమహా

కొత్త యమహా వాహనాల కొనుగోలు కోసం కస్టమర్లు షోరూమ్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఇంటి నుండే సురక్షితంగా తమకు నచ్చిన మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు. యమహా సామాజిక దూర నిబంధనలను పాటిస్తూ, కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ డెలివరీలను కూడా అందిస్తోంది. ఈ ఆన్‌లైన్ విధానంలో కస్టమర్ సహాయం కోసం ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ వాట్సాప్, ఇ-మెయిల్ లేదా వీడియో కాల్స్ ద్వారా నిర్వహించబడుతాయి.

వర్చువల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభించిన యమహా

యమహా వర్చువల్ స్టోర్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వర్చువల్ స్టోర్స్ భారతదేశానికి కొత్తేమీ కాదు. కోవిడ్-19 మహమ్మారి దేశంలో విప్లవాత్మకమైన డిజిటల్ మార్పులను తీసుకురావటంలో సహకరించిందనే చెప్పాలి. కరోనా భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు విముఖత చూపుతున్న తరుణంలో, యమహా ప్రారంభించిన ఇలాంటి కొత్త ప్రణాళికలు ఇప్పుడు కస్టమర్లకు మరింత భద్రను అందిస్తాయనేది మా అభిప్రాయం.

MOST READ:మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha has launched a new user-friendly website with online sales facility, through a virtual store in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X