లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

జపాన్ వాహన తయారీ దారు అయిన యమహా ఇప్పుడు విపణిలోకి ఒక సరికొత్త స్పోర్ట్స్ బైక్ ను తీసుకు వచ్చింది. ఇప్పుడు దాని గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

యమహా మోటార్ ఇండియా సరికొత్త ఫాస్సినో మరియు రే జెడ్ఆర్ శ్రేణి స్కూటర్లతో పాటు అప్‌డేట్ చేసిన బిఎస్ 6 ఎమ్‌టి 15 స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించింది.

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

యమహా సంస్థ కేవలం స్కూటర్ల విషయంలో మాత్రమే కాకుండా సరికొత్త స్పోర్ట్స్ బైక్స్ తయారీ గురించి కూడా ఆలోచిస్తుంది. దాని ఫలితంగా మార్కెట్లోకి విడుదలైన వాహనమే యమహా ఎమ్‌టి15. ఈ వాహనానికి సంబంధించి చాలా విషయాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కంపెనీ ప్రకటనకు ముందే దీని గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. వాటిని తెలుసుకుందాం.

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

ఎమ్‌టి15 అనేది యమహా యొక్క ప్రసిద్ధ మోటారుసైకిల్. దీనితో పాటు యమహా ఆర్15 వి3 రెండు వెర్షన్ మోటారు సైకిళ్ళు ఒకే పవర్ ప్లాంట్‌ను పంచుకున్నప్పటికీ, రెండు ఉత్పత్తులపై స్ప్రాకెట్, స్వింగార్మ్ మొదలైన భాగాలు రెండూ కూడా వ్యక్తిగత రైడింగ్ ఫీచర్స్ కి అనుగుణంగా ఉంటాయి.

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

రెండు మోటార్‌సైకిళ్లలో ప్రధాన హైలైట్ ఏమిటంటే యమహా యొక్క డెల్టాబాక్స్ ఫ్రేమ్. నివేదికల ప్రకారం ప్రారంభ త్వరణాన్ని మెరుగుపరచడానికి బిఎస్ 6 యమహా ఎమ్‌టి15 పునర్నిర్మించిన సెకండరీ రిడక్షన్ గేర్‌ను పొందుతుంది. ప్రస్తుత బిఎస్ 4 అవతార్‌లో, యమహా ఎమ్‌టి -15 దాని 155 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ నుండి వివిఎ (వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్) తో 19 బిహెచ్‌పి మరియు 15 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ లను కలిగి ఉంటుంది. ఇంకా స్లిప్పర్ క్లచ్ ని కూడా కల్గి ఉంటుంది.

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

యమహా ఆర్15 V3 యొక్క బిఎస్ 6 వెర్షన్ గత నెలలో లాంచ్ చేయబడింది. కానీ ఈ మోటారుసైకిల్ అవుట్ పుట్ చూసి అభిమానులు నిరాశ చెందారు. బిఎస్ 4 వెర్షన్‌తో పోలిస్తే ఇందులో 18.3bhp మరియు 14.1Nm మాత్రమే ఉన్నాయి.

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

యమహా బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీనీకరించబడింది. ఇంజిన్ విభాగంలో మార్పులతో పాటు, నవీకరించబడిన యమహా ఎమ్‌టి -15 కొత్త పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం యమహా మోటారుసైకిల్ కేవలం రెండు రంగులలో లభిస్తున్నాయి. ఒకటి మెటాలిక్ బ్లాక్ రెండు డార్క్ మాట్ బ్లూ.

Read More:ఇండియాలో పెరిగిన కియా సెల్టోస్ ధరలు...పెరిగిన ధరల జాబితా ఇప్పుడే చూడండి!

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

యమహాలో ఉన్న ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో పూర్తి-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు టైలాంప్, ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సింగిల్-ఛానల్ ఎబిఎస్ మొదలైన ఇతర లక్షణాలు ఉంటాయి. ఇండియన్-స్పెక్ ఎమ్‌టి-15 సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్‌లను ఉపయోగించుకుంటుంది. మరికొన్ని వాహనాలకు ఆసియా మార్కెట్లలో లభించే మోడళ్ల USD ఫోర్కులు ఉపయోగించుకుంటాయి.

Read More:గుడ్ న్యూస్....ఇప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టనున్న ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్!

 లీక్ అయిన యమహా ఎమ్‌టి-15 బిఎస్ 6 యొక్క స్పెసిఫికేషన్స్!

యమహా ఎమ్‌టి -15 ప్రస్తుతం సుమారు రూ .1.36 లక్షల ధరని కలిగి ఉంది. అంతే కాకుండా బిఎస్ 6 వెర్షన్‌కు రూ. 5 వేలు అదనంగా ఖర్చవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత యమహా మోటారుసైకిల్ ప్రధానంగా కెటిఎమ్ 125 డ్యూక్ కి ప్రత్యర్థిగా ఉండబోతోంది. యమహా మోటార్ సైకిల్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

Source: Rushlane

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
2020 Yamaha MT15 BS6 specs leak – Power reduced-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X