యమహా బైక్స్ ఇప్పుడు వెరీ కాస్ట్లీ, ఎంతో తెలుసా !
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా. యమహా మోటార్స్ ఇండియా తన సిరీస్‌లో కొన్ని ఎంపిక చేసిన ప్రముఖ మోడళ్ల ధరలను కొంత వరకు పెంచాయి. యమహా తన మోటార్ సైకిల్స్ అయిన వైజెడ్ఎఫ్-ఆర్15, ఎంటి-15. ఎఫ్‌జెడ్15 మరియు ఎఫ్‌జెడ్ఎస్ ధరలను పెంచాయి.

ఈ బైకుల కొత్త ధరను యమహా తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా బైక్ అమ్మకాలు పడిపోయాయి. ఇంతలో యమహా తన పాపులర్ మోడళ్ల ధరను పెంచింది. యమహా తన ప్రసిద్ధ మోడళ్ల ధరలను పెంచడానికి ఖచ్చితమైన కారణం ఏమిటో తెలియదు.

ఈ ధరల పెరుగుదలను మీరు వివరంగా పరిశీలిస్తే, యమహా ఆర్ 15 వి 3.0 మూడు కలర్ ఆప్షన్లలో అమ్మబడుతుంది, ఈ మోడళ్లన్నింటి ధర పెంచడం జరిగింది. టాప్ వేరియంట్ ఆర్ 15 రేసింగ్ బ్లూ కలర్ ఛాయిస్ ధరను రూ. 1,000 రూపాయల వరకు పెంచడం జరిగింది.

యమహా ఆర్ 15 వి 3.0 మోడల్‌లో 155 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 18.3 బిహెచ్‌పి శక్తి మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ ఇంజిన్ స్లిప్పర్ అసిస్టెడ్ క్లచ్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇది యమహా ఎంటీ -15 బైక్ బ్రాండ్ యొక్క ఆర్15 మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ యమహా ఎంటీ -15 బైక్స్ 25,000 యూనిట్లు కేవలం 12 నెలల్లో అమ్ముడయ్యాయి.

బైక్ యొక్క 155 సిసి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ బిఎస్-6 కాలుష్య నియమానికి అనుగుణంగా నవీనీకరించబడింది. ఈ ఇంజన్ 18.5 బిహెచ్‌పి శక్తి మరియు 13.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త బైక్ బిఎస్-4 ఇంజన్ కంటే 0.8 బిహెచ్‌పి తక్కువ శక్తిని కలిగి ఉంది. యమహా ఎంటీ-15 బిఎస్ 4 19.3 బిహెచ్‌పి శక్తిని మరియు 14.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇప్పుడు యమహా ఎఫ్‌జెడ్ బైక్ ధరను కూడా పెరిగింది. ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్‌ల ధర మునుపటికంటే 500 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా యమహా తన కొత్త ఎఫ్‌జెడ్ 25 మరియు ఎఫ్‌జెడ్ఎస్ 25 ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్దమైంది.

యమహా తన సిరీస్‌లో కొన్ని ఎంపిక చేసిన ప్రముఖ మోడళ్ల ధరలను పెంచింది. దీనితో పాటు ఇతర ప్రముఖ కంపెనీలు కూడా తమ సిరీస్‌లోని కొన్ని మోడళ్లకు ధరలను పెంచాయి.


Click it and Unblock the Notifications








