కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

ప్రముఖ ద్విచక్ర వాహన బ్రాండ్ యమహా, భారత్‌లో కోవిడ్-19 పోరులో ముందున్న వారి కోసం ఓ ప్రత్యేకమైన సర్వీస్ క్యాంప్‌ని ప్రారంభించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పగలు రాత్రి శ్రమించిన పనిచేసిన యోధుల కోసం తమవంతు బాధ్యతగా ఈ సేవలను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

ఈ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవటంలో సమాజానికి సేవ చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తూ, అందరి కన్నా ముందుగా వారి వాహనాలను సర్వీస్ చేస్తామని అలాగే వారి కోసం ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

డాక్టర్లు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది మరియు వాలంటీర్లందరూ కోవిడ్-19 వారియర్ల క్రిందకు వస్తారు. అపాయింట్‌మెంట్ బేసిస్ ప్రకారం ఈ సర్వీస్ క్యాంప్‌ని నిర్వహిస్తారు. కస్టమర్లు సమీపంలోని డీలర్‌షిప్ కేంద్రాన్ని సంప్రదించి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని యమహా డీలర్‌షిప్ కేంద్రాలలో సోషల్ డిస్టెన్స్‌తో పాటుగా అన్ని కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నారు.

MOST READ: 19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

ఈ స్పెషల్ సర్వీస్ క్యాంప్‌ని యమహా 'కరోనా వారియర్స్ క్యాంప్' పేరుతో నిర్వహిస్తోంది. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన యమహా డీలర్‌షిప్‌లలో 15 రోజుల పాటు ఈ సర్వీస్ క్యాంప్‌ని నిర్వహించనున్నారు. జూన్ 8 నుంచి ప్రారంభమైన ఈ సర్వీస్ క్యాంప్ జూన్ 22, 2020 వరకూ ఉంటుంది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

యమహా మే 15వ తేదీ నుంచి దేశంలోని తమ డీలర్‌షిప్ కేంద్రాలను దశల వారీగా రీఓపెన్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం కంటైన్‌మెంట్ జోన్లు మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో యమహా తమ వ్యాపారాన్ని పునఃప్రారంభించింది. ప్రతి డీలర్‌షిప్‌లో తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమాలకు లోబడి వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

MOST READ: కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

యమహా ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని రకాల మోడళ్ల ధరలను పెంచింది. ఇందులో రే-జిఆర్ 125, రే-జిఆర్ 125 స్ట్రీట్, వైజిఎఫ్-ఆర్15, ఎమ్‌టి-15 మరియు ఎఫ్-జి సిరీస్ మోడళ్లున్నాయి.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

కోవిడ్-19 పోరుకు తమ వంతు సాయంగా దేశవ్యాప్తంగా ఉన్న యమహా ఉద్యోగులందరూ కలిసి తమ జీతాల నుంచి కొంత మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర సహాయ నిధులకు దానం చేశారు. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా రూ.61.5 లక్షల విరాళాన్ని పోగు చేశారు.

MOST READ: ఒకే ఫ్యామిలీ నాలుగు తరాలుగా ఉపయోగిస్తున్న సైకిల్

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ సర్వీస్ క్యాంప్

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా అందిస్తున్న సర్వీస్ క్యాంప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19పై పోరులో యమహా మొదటి నుంచి ముందంజలోనే ఉంది. విరాళం పోగు చేయటం నుంచి ఇప్పుడు కోవిడ్-19 వారియర్లకు ప్రత్యేక సేవలు అందించడం వరకూ యమహా చురుకుగా వ్యవహరిస్తోంది. కరోనా పోరులో తీరిక లేకుండా పనిచేస్తున్న వారి కోసం యమహా ప్రారంభించిన ఈ స్పెషల్ సర్వీస్ క్యాంప్‌లోని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోండి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha India has announced a special service camp for frontline COVID-19 warriors. As part of the special service camp, Yamaha will be offering exclusive discounts, service priorities and other benefits for all those who served the society during the COVID-19 pandemic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X