రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా ఈ ఏడాది ప్రారంభంలో తమ బిఎస్6 వెర్షన్ ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రారంభ సమయంలో ఈ మోటార్‌సైకిల్ ధరను గడచిన మే నెలలో రూ.1000 మేర పెంచింది. కాగా, తాజాగా మరోసారి ఈ మోడల్ ధరను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

దీంతో యమహా అందిస్తున్న ఈ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ ధర వరుసగా రెండోసారి పెరిగినట్లు అయ్యింది. తాజా పెంపుతో యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 మూడు కలర్ ఆప్షన్ల ధరలు రూ.2,100 మేర పెరిగాయి.

రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

ధర పెరుగుదల తర్వాత ప్రస్తుతం మార్కెట్లో యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 థండర్ గ్రే, రేసింగ్ బ్లూ మరియు డార్క్ నైట్ కలర్ ఆప్షన్ల ధరలు వరుసగా రూ.1.47 లక్షలు, రూ.1.49 లక్షలు, రూ.1.50 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు ఇటీవలి లాక్‌డౌన్ కారణంగా ఏర్పడ్డ నష్టాలను పూడ్చుకునేందుకు కంపెనీ ధరలను పెంచినట్లు తెలుస్తోంది.

MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే ఇంజన్‌ను బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి కొత్త మోడల్‌లో ఉపయోగించారు. ఇందులోని 155 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 18.3 బిహెచ్‌పి శక్తిని మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

ఇందులో కన్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పూర్తి-డిజిటల్ ఎల్‌సిడి డిస్‌ప్లే, స్ప్లిట్-స్టైల్ స్టెప్-అప్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బిఎస్6 మోడల్‌లో చేసిన కొత్త మార్పుల విషయానికి వస్తే, ఇందులో కొత్త రేడియల్ టైర్లు, డ్యూయల్ హార్న్ మరియు సైడ్-స్టాండ్ యాక్టివేటెడ్ ఇంజన్ కట్-ఆఫ్ వంటి ఫీచర్లను అదనంగా లభిస్తాయి.

MOST READ:అంగారక గ్రహంపైకి నాసా పంపిన స్పేస్ షిప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 282 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 భారత మార్కెట్లోని ఈ సెగ్మెంట్లో కెటిఎమ్ ఆర్‌సి200, సుజుకి జిక్సెర్ ఎస్ఎఫ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ రెండు మోడళ్లతో పోల్చుకుంటే, ఈ జపనీస్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది, సరసమైన ధరలో పూర్తిస్థాయి స్పోర్ట్స్ వెర్షన్ మోటార్‌సైకిల్ కోసం వెతుకుతున్న యువ తరం కొనుగోలుదారులను ఇది చక్కగా సంతృప్తి పరుస్తుంది.

MOST READ:కెమెరాకు చిక్కిన బిఎస్ 6 ఇసుజు వి క్రాస్, ఎలా ఉందో చూసారా !

రెండవసారి యమహా ఆర్15 వి3.0 మోటార్‌సైకిల్ ధర పెంపు - వివరాలు

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకులలో ఒకటిగా నిలుస్తుంది. బైక్ మొత్తం ధరను పరిగణలోకి తీసుకుంటే, పెరిగిన ధర స్వల్పమే అనిపిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో ఉత్తమమైన పవర్ ఫిగర్స్‌ను కలిగి ఉంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha launched the R15 V3.0 BS6 motorcycle earlier this year in the Indian market. When launched it was already more expensive than its BS4 counterpart. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X