కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, భారత్‌లోని కోవిడ్-19 పోరులో ముందుండి పోరాడిన ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు మరియు వైరస్‌పై పోరులో భాగమైన ఫ్రంట్‌లైన్ యోధులకు ఈ ప్రత్యేక ఈఎమ్ఐ స్కీమ్ వర్తిస్తుందని యమహా మోటార్ ఇండియా ప్రకటించింది. ఈ స్కీమ్ జూలై 31 వరకూ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

యమహా ప్రకటించిన ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌లో భాగంగా, యమహా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు మొదటి మూడు నెలల పాటు ఈఎమ్ఐ మొత్తంలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. నాల్గవ నెల నుంచి వారికి సాధారణ ఈఎమ్ఐ వర్తిస్తుందని కంపెనీ వివరించింది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత యమహా డీలర్‌షిప్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కొత్త ద్విచక్ర వాహనం కొనాలని యోచిస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులపై ఒత్తిడిని తగ్గించడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశ్యమని కంపెనీ తెలిపింది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

యమహా ఇదివరకే కోవిడ్-19 ఫ్రంట్‌లైన్ యోధుల కోసం ఒక ప్రత్యేక సర్వీస్ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించింది. ఈ విపత్కర సమయంలో సమాజానికి సేవ చేసిన వారందరికీ ప్రత్యేకమైన తగ్గింపులు, సేవా ప్రాధాన్యతలు మరియు ఇతర ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ క్యాంపైన్‌ను ప్రారంభించింది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

యమహా ప్రకటించిన ఈ కోవిడ్-19 యోధుల జాబితా క్రిందకు వైద్యులు, పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో పాటుగా ఈ సమయంలో సేవలందించిన వారందరూ వస్తారు. యమహా అందిస్తున్న ఉచిత సర్వీస్ క్యాంపైన్‌లో ఈ ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ఉచిత 14-పాయింట్ల వాహన తనిఖీ, వాహన శానిటైజేషన్, విడిభాగాలు మరియు లేబర్ ఛార్జీలపై 10 శాతం తగ్గింపును అందిస్తున్నారు.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

గడచిన మే నెలలో లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వటంతో కంపెనీ గడచిన మే 15 న భారతదేశం అంతటా తమ డీలర్‌షిప్‌లు మరియు సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కంటైనర్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో యహామా తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

యమహా ఇటీవలే తమ బిఎస్6 రే జెడ్ఆర్ 125ఫై, బిఎస్6 యమహా రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125ఫై స్కూటర్ల ధరలను పెంచింది. రే జెడ్ఆర్ 125ఫై డ్రమ్ ధర ఇప్పుడు రూ.67,530, రే జెడ్ఆర్ 125ఫై డిస్క్ ధర రూ.70,530, రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125ఫై ధర రూ.71,530 గా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

ఈ మూడు మోడళ్ల ధరలు సుమారు రూ.800 మేర పెరిగాయి. స్కూటర్ల ధరలు మాత్రమే కాకుండా, బిఎస్6 యమహా ఆర్15 వి3.0, బిఎస్6 యమహా ఎఫ్‌జడ్-ఫై, బిఎస్6 యమహా ఎఫ్‌జెడ్ఎస్-ఫై, బిఎస్6 యమహా ఎమ్‌టి-15 మోటార్‌సైకిళ్ల ధరలను కూడా పెంచింది.

కోవిడ్-19 వారియర్ల కోసం యమహా స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ - వివరాలు

యమహా కొత్త ఫైనాన్స్ స్కీమ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 మహమ్మారితో పోరాడూతేన తమ రోజూవారీ ప్రయాణం కోసం కొత్త యమహా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మొదటి మూడు నెలల పాటు కేవలం సగం ఈఎమ్ఐని మాత్రమే చెల్లించేలా యమహా తీసుకువచ్చిన ఈ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా కస్టమర్లు మొదటి 3 నెలలు మొత్తం ఈఎమ్ఐని ఎలా చెల్లించాలో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Article Published On: Thursday, July 9, 2020, 9:20 [IST]
English summary
Yamaha Motor India has announced a special finance scheme for COVID-19 frontline warriors. The special EMI scheme will be valid for all the frontline warriors, like doctors, healthcare workers, police and others. Read in Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+