భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ 'యమహా' భారత మార్కెట్ కోసం మరో సరికొత్త రెట్రో-మోడ్రన్ బైక్‌ను సిద్ధం చేస్తోంది. గడచిన 2019లో యమహా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసిన 'యమహా ఎక్స్ఎస్ఆర్ 155' (Yamaha XSR 155) మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఈ ఏడాది మన మార్కెట్లో కూడా విడుదల చేసే అకాశాలు ఉన్నాయి.

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

పాత-కొత్త కలయిక మాదిరిగా ఉండే ఈ రెట్రో-మోడ్రన్ లుకింగ్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసినట్లయితే, దీని ధర సుమారు రూ.1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

ప్రపంచ మార్కెట్లలో యమహా విక్రయిస్తున్న 'స్పోర్ట్ హెరిటేజ్' విభాగంలో యమహా ఎక్స్ఎస్ఆర్ 155 అతి చిన్న బైక్. దీని డిజైన్ చూడటానికి ఓల్డ్ స్కూల్ మాదిరిగా అనిపించినప్పటికీ, ఫీచర్ల పరంగా మొత్తం మోడ్రన్ టచ్‌తో ఈ బైక్‌ని డెవలప్ చేశారు.

MOST READ: మీకు తెలుసా.. ఈ కారు, బైక్ కంటే చాలా చీప్

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

గుండ్రటి హెడ్‌లైట్, మజిక్యులర్ లుకింగ్ ఫ్యూయెల్ ట్యాంక్‌తో ఇది పాత కాలపు మోటార్‌సైకిళ్ల డిజైన్‌ను తలపిస్తుంది. ఇక ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇది పూర్తిగా డిజిటల్ ఫామ్‌లో ఉండి నేటి తరం టెక్నాలజీని ప్రతిభింభింపజేస్తుంది. అలాగే ఇందులోని సింగిల్ పీస్ సీట్ డిజైన్ కూడా రెట్రో డిజైన్‌ని తలపిస్తుంది.

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్‌లోని గుండ్రటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్‌కు కావల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, స్పీడో మీటర్, గేర్ ఇండికేటర్, ట్రిప్ ఇండికేటర్, టర్న్ ఇండికేటర్ అన్నీ కూడా డిజిటల్ రూపంలోనే ఉంటాయి. ఇందులో సంకేతాలను చదవటం / అర్థం చేసుకోవటంలో సులువుగా ఉండేలా దీనిని డిజైన్ చేశారు.

MOST READ: కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్‌లో 155సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. యమహీ వివిఏ టెక్నాలజీతో తయారైన ఈ ఇంజన్ గరిష్టంగా 18.9 బిహెచ్‌పిల శక్తిని, 14.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. యమహా అందిస్తున్న ఎమ్‌టి-15 మరియు ఆర్15 వి3.0లో కూడా ఇదే తరహా ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన అనేక విడిభాగాలను కొత్త యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్‌లోను ఉపయోగించే అవకాశం ఉంది. ఇలా చేయటం వలన దీని ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచి, పోటీ ధరకే ఈ మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ మోడళ్లలో ఉపయోగించిన ఫ్రేమ్, సస్పెన్షన్, బ్రేక్స్ వంటి భాగాలను కొత్త ఎక్స్ఎస్ఆర్ 155లోనూ ఉపయోగించవచ్చని అంచనా.

MOST READ: స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

రైడ్ చేస్తున్నప్పుడు మాగ్జిమం రిగిడిటీని ఆఫర్ చేసేలా కొత్త యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్‌ని స్టీల్-డెల్టాబాక్స్ ఫ్రేమ్ ఉపయోగించి తయారు చేశారు. ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ (యూఎస్‌డి) మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. అలాగే ముందు వైపు 282 ఎమ్.ఎమ్. డిస్క్ బ్రేక్‌ను మరియు వెనుక వైపు 240 ఎమ్.ఎమ్. డిస్క్ బ్రేక్‌ను ఉపయోగించారు. ఇందులో డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ స్టాండర్డ్‌గా లభించే ఆస్కారం ఉంది.

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ విడుదలైతే ఇది కంపెనీ అందిస్తున్న ఎమ్‌టి-15 మరియు ఆర్15 వి3.0 మోడళ్లకు దిగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా 150 సీసీ సెగ్మెంట్లో యమహా ఆఫర్ చేయనున్న మొట్టమొదటి నియో-రెట్రో మోటార్‌సైకిల్‌గా కూడా ఇది నిలువనుంది. గ్లోబల్ వెర్షన్‌కి ఇండియన్ వెర్షన్‌కి ఫీచర్ల పరంగా దాదాపు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఫ్రంట్ సస్పెన్షన్‌లో మాత్రం మార్పు ఉండే అవకాశం ఉంది.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : పెట్రోల్ బంక్ లో కొత్త సిస్టం

భారత్‌కు రానున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155; ఫీచర్లు, వివరాలు

యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ ఇండియా లాంచ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

యమహా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసిన ఎక్స్ఎస్ఆర్ 155 బైక్, దాని రెట్రో-మోడ్రన్ డిజైన్‌తో మంచి ఆదరణ పొందింది. ఇదే బైక్ భారత మార్కెట్లో విడుదలైతే, 150సీసీ సెగ్మెంట్లో యమహా ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించినట్లు అవుతుంది. సిటీ మరియు హైవే కమ్యూటింగ్ రెండింటికీ అనుకూలంహా ఉండేలా యమహా కొత్త ఎక్స్ఎస్ఆర్ 155 మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
The Yamaha XSR 155 is a retro-looking motorcycle that was launched in the international market back in 2019. The company is expected to launch the XSR 155 in the Indian market sometime during the end of this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X