Just In
Don't Miss
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యమహా ట్రేసర్ 9, ట్రేసర్ 9 జిటి స్పోర్ట్స్ టూరర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్, తమ సరికొత్త 2021 ట్రేసర్ 9 మరియు ట్రేసర్ 9 జిటి స్పోర్ట్ టూరింగ్ మోటార్‌సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ రెండు కొత్త మోడళ్లు మునుపటి మోడళ్లతో పోలిస్తే కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉన్నాయి.

సరికొత్త 2021 యమహా ట్రేసర్ 9ను ఒక స్ట్రిప్డ్-డౌన్ వెర్షన్ లేదా స్పోర్ట్-టూరింగ్ మోటార్‌సైకిల్‌గా చెప్పుకోవచ్చు. అలాగే, యమహా ట్రేసర్ 9 జిటి మోడల్ ఫిక్స్డ్ శాడల్ బాక్స్, ఎల్ఈడి కార్నరింగ్ లైట్లు మరియు హీటెడ్ గ్రిప్స్ వంటి టూరింగ్ ఆధారిత పరికరాలతో లభిస్తుంది.

ఈ రెండు మోటార్‌సైకిళ్లు అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ ఎండ్‌తో సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇవి ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇందులో ప్రధాన హెడ్‌ల్యాంప్‌లను ట్యాంక్ ఫెయిరింగ్ ముందు భాగంలో విలీనం చేయబడ్డాయి.
MOST READ:భారత్‌లో జీప్ రాంగ్లర్ రూబికాన్ 392 ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడో తెలుసా?

ఈ స్పోర్ట్-టూరింగ్ మోటార్‌సైకిల్‌లో సౌకర్యవంతమైన స్ప్లిట్-సీట్ డిజైన్, నిటారుగా ఉండే రైడర్ ఎర్గోనామిక్స్, నకల్ గార్డ్స్, పొడవైన విండ్‌స్క్రీన్ మరియు 19-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో టూ-స్టెప్ అడ్జస్టబల్ రైడర్ సీట్ ఉంటుంది, ఇది 810 మిమీ వద్ద సెట్ చేయబడి ఉంటుంది, కావాలనుకుంటే దీనిని 825 మిమీ వరకు పెంచుకోవచ్చు.

ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా ఒకే రకమైన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటాయి. ఇందులో డ్యూయెల్ 3.5 టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇందులో ఎడమ వైపు స్క్రీన్‌పై వేగం, గేర్ స్థానం, ఫ్యూయెల్ ఇండికేటర్ మరియు టాకోమీటర్‌ను ప్రదర్శిస్తుంది. కుడి వైపు స్క్రీన్‌పై ట్రిప్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.
MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

ఈ మోటార్‌సైకిల్‌లో లభించే వివిధ ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను కంట్రోల్ చేయటానికి రైడర్ స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు మరియు దీని సాయంతో హ్యాండిల్‌బార్‌లో స్విచ్‌లను కూడా టోగల్ చేయవచ్చు. అలాగే, ట్రేసర్ 9 జిటి మోడల్‌లో హీటెడ్ గ్రిప్స్‌ను కూడా దీని సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

ఇక కొత్త 2021 యమహా ట్రేసర్ 9 మరియు ట్రేసర్ 9 జిటి మోడళ్లలో అతిపెద్ద మార్పుగా, వీటిలోని ఇంజన్ గురించి చెప్పుకోవచ్చు. ఈ సరికొత్త ఇంజన్‌ను కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన కొత్త యమహా ఎమ్‌టి-09లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ స్పోర్ట్-టూరర్స్‌లోని 889 సిసి లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ త్రీ-సిలిండర్ డిఓహెచ్‌సి సిపి3 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 93 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా ఒకే రకమైన గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఇందులో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ లభిస్తుంది. అయితే, యమహా ట్రేసర్ 9 జిటి మోడల్ మాత్రం మరింత వేగవంతమైన మరియు సున్నితమైన క్లచ్లెస్ గేర్ షిఫ్టింగ్ కోసం బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్ (క్యూఎస్ఎస్)ను కలిగి ఉంటుంది.

యమహా ట్రేసర్ 9 మరియు ట్రేసర్ 9 జిటి మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఈ విభాగంలో 2021 యమహా ట్రేసర్ 9 మరియు ట్రేసర్ 9 జిటి మోడళ్లు అత్యంత సమర్థవంతమైన స్పోర్ట్-టూరింగ్ మోటార్‌సైకిళ్ళు. ఈ రెండు మోటార్‌సైకిళ్ళు కూడా అనేక రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లతో లభిస్తాయి. భారత మార్కెట్లో ఇవి వెర్సిస్ 1000 మరియు డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 ఎస్ మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. అయితే, యమహా వీటిని భారత్‌కి తీసుకువస్తుందో లేదో వేచిచూడాలి.
MOST READ:సాధారణ ట్రక్కులకంటే మరింత శక్తివంతమైన ఇన్‌ఫ్రా ప్రైమ్ ఎలక్ట్రిక్ ట్రక్కులు.. చూసారా !