Just In
- 9 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 36 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 యమహా ఎమ్‌టి-125 ఆవిష్కరణ; ఈ స్ట్రీట్‌ఫైటర్ భారత్‌కు వచ్చేనా?
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా తమ సరికొత్త 2021 ఎమ్‌టి-125 మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. యంహా ఎమ్‌టి సిరీస్‌లో ఇదే ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్. కొత్త యమహా ఎమ్‌టి-125 స్ట్రీట్‌ఫైటర్ ఇప్పుడు ఆకర్షణీయమైన బ్లూ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ కలర్ ఆప్షన్ దాని పెద్ద ఇంజన్ వెర్షన్లయిన ఎమ్‌టి-09 మరియు ఎమ్‌టి-07 మోడళ్ల నుండి గ్రహించారు.

యమహా ఎమ్‌టి-125 యూరోపియన్ మార్కెట్లలో అత్యంత విజయవంతమైన ఎంట్రీ లెవల్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్. యమహా ఇప్పుడు ఈ మోడల్‌ను యూరో-5 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. ఇది మన దేశంలో బిఎస్-6 నిబంధనలకు సమానమైది.

కొత్త 2021 యమహా ఎమ్‌టి-125 ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే లభిస్తోంది. అయితే, వచ్చే ఏడాదిలో దీనిని భారత మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త మోడల్‌లో కంపెనీ స్వల్ప మార్పులు చేసింది.

ఇదివరకటి ఎమ్‌టి-125 మోటార్‌సైకిల్‌లోని 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో పోలిస్తే ఈ కొత్త వెర్షన్‌లో 11 లీటర్ల ట్యాంక్‌ను అమర్చారు. ఈ బైక్‌లో 124సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ బైక్‌లోని ప్రధాన ప్రత్యేకత దీని హెడ్‌ల్యాంప్ డిజైన్, ముందు వైపు నుండి చూసినప్పుడు ఇది కళ్ల మాదిరిగా కనిపిస్తుంది.

యమహా ఎమ్‌టి-125 మోటార్‌సైకిల్‌లో ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ బైక్ రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులోని బ్రేకింగ్ సిస్టమ్‌ను కంపెనీ మెరుగుపరచింది.

యమహా ప్రస్తుతం భారత మార్కెట్లో ఎమ్‌టి సిరీస్‌లో ఎమ్‌టి-15, ఎమ్‌టి-15 సివైడబ్ల్యూ మరియు ఎమ్‌టి-09 మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. ఒకవేళ యమహా తమ కొత్త ఎమ్‌టి-125ని భారత మార్కెట్లో విడుదల చేసినట్లయితే, ఇది దేశీయ మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది మరియు ఇది ఎమ్‌టి-15 155సీసీ బైక్‌కి దిగువన లభ్యం కానుంది.

కాగా.. యమహా మోటార్ ఇండియా తమ ఎమ్‌టి-15 మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం, కంపెనీ ఓ కస్టమైజ్ ప్రోగ్రామ్‌ను కూడా ఇటీవలే ప్రారంభించింది. "కస్టమైజ్ యువర్ వారియర్ (సివైడబ్ల్యూ)" పేరిట ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్‌లో కస్టమర్లు తమ అభిమాన యమహా ఎమ్‌టి-15 బైక్‌ను 11 రకాల రంగులలో కస్టమైజ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

యమహా మోటార్ ఇండియా తన ఎమ్‌టి-15 కొనుగోలుదారుల కోసం దేశంలో కస్టమైజ్ ప్రోగ్రాం ప్రారంభించింది. "కస్టమైజ్ యువర్ వారియర్ (CYW)" అని పిలువబడే, ఈ సంస్థ ఎమ్‌టి-15 ను కొనుగోలు చేసేటప్పుడు వీటిలో ఎంచుకోవడానికి మొత్తం 11 డిఫరెంట్ కలర్స్ లో వీటిని అందిస్తోంది.

మార్కెట్లో యమహా ఎమ్‌టి-15 సివైడబ్ల్యూ వేరియంట్ ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ మోడల్ కోసం మూడు బాడీ కలర్ ఆప్షన్స్, చక్రాల కోసం నాలుగు కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన విధంగా ఎమ్‌టి-15 కస్టమైజ్ చేసుకున్న తర్వాత, యమహా ఈ స్పెషల్ ఆర్డర్లను ప్రత్యేకంగా తయారు చేసి, డెలివరీ చేస్తుంది.

యమహా ఎమ్‌టి-15 మోటార్‌సైకిల్‌లో 155సిసి లిక్విడ్ కూల్డ్ ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 18 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ బ్రాండ్ యొక్క వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.