యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న స్కూటర్‌ని చూశారా.. దీని పేరు వినోరా. ప్రముఖ జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా దీనిని ఉత్పత్తి చేస్తోంది. యమహా నుండి లభిస్తున్న అత్యంత క్యూటెస్ట్ స్కూటర్‌గా దీనికి పేరుంది. యమహా ఇటీవలే తమ వినోరా స్కూటర్‌ను తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది.

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

యమహా వినోరా ఒక ఫంకీ లుకింగ్, నియో-రెట్రో స్టైల్ స్కూటర్. ఈ మోడల్ యమహా యొక్క కొత్త న్యూట్రో డిజైన్ లాంగ్వేజ్‌ను పుట్టుకొచ్చింది. అంటే పాత తరం మరియు కొత్త తరాలను రెండింటినీ కలగలపి వినోరా స్కూటర్‌ను తయారు చేసింది. దీనిని పాతకాలపు యానిమేటెడ్ చిత్రాల నుండి స్ఫూర్తి పొంది తయారు చేసినట్లుగా అనిపిస్తుంది.

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

ఈ స్కూటర్‌లోని ఫ్రంట్ బంపర్ డిజైన్‌ను గమనిస్తే, ఇది హోమర్ సింప్సన్ క్యారెక్టర్‌ను పోలినట్లుగా ఉంటుంది. అయితే, ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్‌, వృత్తాకారపు హాలోజెన్ ఇండికేటర్ ల్యాంప్స్ వంటి మోడ్రన్ డిజైన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:మాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

ఈ ఫంకీ లుకింగ్ యమహా విమోరా స్కూటర్‌లో 125సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ మరియు ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. యమహా ఇంకా ఈ ఇంజన్ పవర్, టార్క్ గణాంకాలను వెల్లడించనప్పటికీ, అవి బిఎస్6 ఫాసినో 125, రే-జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ మరియు రే-జెడ్ఆర్ 125 ఎఫ్ఐ వంటి మోడళ్లలో ఉపయోగిస్తున్న ఇంజన్ మారిదిగానే ఉంటుందని సమాచారం.

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

యమహా వినోరా స్కూటర్ లీటరుకు 57.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. వినోరాలో బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను గమనిస్తే, ముందు భాగంలో డిస్క్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. అలాగే, సస్పెన్షన్‌ను చూస్తే ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ స్కూటర్ మొత్తం బరువు 94 కిలోలు మాత్రమే.

MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఇప్పటికే 15000 మంది లిస్ట్ రెడీ

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

యమహా వినోరా స్కూటర్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. అంతేకాకుండా ముందు వైపు స్మార్ట్‌ఫోన్లను చార్జ్ చేసుకోవటం కోసం, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ మరియు యమహా యొక్క స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది జనరేటర్ అసెంబ్లీ టెక్నాలజీని ఉపయోగించి, ఇంజన్ క్రాంకింగ్ సౌండ్ లేకుండానే స్కూటర్ స్టార్ట్ అయ్యేందుకు సహకరిస్తుంది.

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

తైవాన్ మార్కెట్లో యమహా వినోరా రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి: స్టాండర్డ్ మరియు ఎమ్ వేరియంట్. వినోరా ఎమ్ వేరియంట్లో అదనంగా హెడ్‌లైట్ గ్రిల్, పిలియన్ రైడర్ కోసం పెద్ద గ్రాబ్ రైల్, ప్రీమియం సీట్ మరియు ప్రీమియం అప్పీల్ కోసం అక్కడక్కడా క్రోమ్ ట్రీట్మెంట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్‌.. ఇప్పుడు ఈ ట్వీట్‌‌లో ఏం పోస్ట్ చేసాడో తెలుసా ?

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

యమహా వినోరా బేస్ వేరియంట్‌ను తైవాన్‌లో 17,900 యువాన్లకు విక్రయిస్తుండగా, ఎమ్ వేరియంట్‌ను 18,700 యువాన్లకు విక్రయిస్తున్నారు. మనదేశ కరెన్సీతో పోల్చుకుంటే, వీటి ధరలు వరుసగా రూ.1.96 లక్షలు మరియు రూ.2.05 లక్షలుగా ఉన్నాయి.

యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

యమహా వినోరా స్కూటర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

యమహా ఈ అద్భుతమైన వినోరా స్కూటర్‌ను భారత్‌కు తీసుకువస్తుందా అంటే, లేదనే చెప్పాలి. ఈ మోడల్‌కి జోడించిన ప్రీమియం ప్రైస్ ట్యాగ్‌ను పరిగణలోకి తీసుకుంటే, మనదేశంలో ఈ విభాగంలో లభిస్తున్న వెస్పా వంటి ప్రీమియం 125సీసీ స్కూటర్ల ధరతో పోలిస్తే వినోరా ధర రెట్టింపుగా ఉంది.

MOST READ:గంటకు 532.93 కి.మీ వేగంతో ప్రయాణించే వరల్డ్ ఫాస్టెస్ట్ కార్.. మీరు చూసారా

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Launches the all-new Vinoora 125cc scooter in Taiwan market. Read more to find out the features, specs and pricing details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X