యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యాన్నికి గురిచేసేలా ఓ సరికొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. యమహా ఎక్స్‌టి 500 హెచ్2ఓ అని పిలువబడే ఈ మోటార్‌సైకిల్‌ను 1970 లలో విక్రయించిన యమహా ఎక్స్‌టి500 మోటార్‌సైకిల్ నుండి స్పూర్తి పొంది డిజైన్ చేశారు. యమహా ఐదేళ్ల సుదీర్ఘ ప్రయోగ కాలానికి ఫలితమే ఈ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

యమహా ఎక్స్‌టి 500 హెచ్2ఓ మోటార్‌సైకిల్‌లో ప్రత్యేకమైన ఇంజన్ వ్యవస్థ ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది నీటితో నడుస్తుంది. ఇది బైక్ యొక్క తరగని థీమ్‌కు అనుగుణంగా ఉంటుంది. నీటితో నడిచే ఇంజన్ పనితీరును వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

ఈ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ గురించి తెలుసుకోవటానికి ముందుగా, దీని చరిత్ర తెలుసుకుందాం రండి. యమహా ఎక్స్‌టి 500 ఒకప్పుడు ఈ బ్రాండ్‌కు ఐకానిక్ మోటార్‌సైకిల్‌గా ఉండేది. ఇది 1976-1989 మధ్య ఫోర్-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో తయారు చేయబడిన మోటార్‌సైకిల్. అప్పటి డాకర్ ర్యాలీలో పోటీ చేయడానికి కూడా ఈ మోటార్‌సైకిల్‌ను ఉపయోగించేవారు.

MOST READ:మీకు తెలుసా.. ఈ కార్ ఒకే ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణిస్తుంది

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

ఇందులోని 499సిసి యూనిట్ గరిష్టంగా 31 బిహెచ్‌పి శక్తిని మరియు 38 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది. నిజానికి ఈ మోటారుసైకిల్ ఒక ఎండ్యూరో బైక్, దీని ముందు మరియు వెనుక వైపువ వరుసగా 21 ఇంచ్ మరియు 18 ఇంచ్ రిమ్‌లతో నాబీ టైర్లను కలిగి ఉండేది. ప్రజలు కమ్యూనికేట్ చేయడానికి పోస్ట్ బాక్సుల కోసం శోధించిన కాలంలోనే, ఈ మోటార్‌సైకిల్ యొక్క టాప్-స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లుగా ఉండేది.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

ఇక యమహా ఆవిష్కరించిన హెచ్2ఓ కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్‌ను తొలుత రెట్రో బాడీ స్టైల్‌లో డిజైన్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో దీని డిజైన్‌ను నిర్దిష్ట ప్రయోజనాల కోసం మార్చడం జరిగింది.

MOST READ:గ్రేట్ ఇండిపెండెన్స్ డే రైడ్ : 5 మంది ఫ్రెండ్స్, 5 దేశాలు, 5000 కి.మీ ప్రయాణం, ఎందుకో తెలుసా ?

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

ఇలా డిజైన్ మార్చాలనే ఆలోచన నుంచి మూడు వేర్వేరు మోడళ్లను అభివృద్ధి చేయటం జరిగింది. వాటిలో మొదటిది ఓ కాన్సెప్ట్ స్మార్ట్ బైక్, ఇకపోతే రెండవది పాత మోటారుసైకిల్ యొక్క తేలికపాటి వెర్షన్ కాన్సెప్ట్ ఇక ఇందులో చివరది మరియు మూడవదైన కాన్సెప్ట్‌ను "వర్ణించలేనిది" (ఇన్‌ఎగ్జాస్టిబల్)గా పిలువబడినది.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

ఈ మోటార్‌సైకిల్ డిజైన్ వెనుక ఉన్న బృందం మూడవ కాన్సెప్ట్‌ను ఎంచుకొని ఎక్స్‌టి 500 హెచ్2ఓ మోడల్‌ను డెవలప్ చేశారు. ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్‌లో ఒక్క బ్రేకింగ్ హార్డ్‌వేర్ తప్ప మిగిలిన యంత్రాంగం అంతా పూర్తిగా అధునాతన సాంకేతికతతో రూపొందినది.

MOST READ:కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

హ్యాండిల్‌బార్‌కి మరియు ఫ్రంట్ సస్పెన్షన్ కనెక్షన్ ఉండదు. స్టీరింగ్ జియోమెట్రీ కోసం సీటు కింద అమర్చిన మోటార్ సహకరిస్తుంది. అలాగే, మోటారుసైకిల్ వెనుక భాగం కాయిల్-ఓవర్ స్ప్రింగ్ లేకుండా దృఢమైన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

యమహా ఎక్స్‌టి 500 హెచ్2ఓలో చిన్న విండ్‌స్క్రీన్ మరియు ఎల్‌ఈడి లైట్ అప్-ఫ్రంట్ మరియు ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్‌తో పాటు రాడికల్-లుకింగ్ టెయిల్ సెక్షన్ ఉంటాయి. వాటర్ బ్లూ కలర్ వీల్స్, వైట్ కలర్ టైర్స్ ఈ మోటార్‌సైకిల్ అందాన్ని మరింత పెంచడంలో సహకరిస్తాయి.

MOST READ:డస్టర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ టీజర్ లాంచ్ చేసిన రెనాల్ట్

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

వాటర్ ఇంజన్ పనితీరు గురించి కంపెనీ ఎలాంటి సమాచారం వెల్లడించకపోయినప్పటికీ, పరిశ్రమ వర్గాల ఊహాగానాల ప్రకారం, ఇది మోటార్‌సైకిల్ సీటు క్రింద ఉంచిన ట్యాంక్‌లో నిల్వ చేసిన నీటిని ఉపయోగిస్తుంది. ఇది క్రింద ఉంచిన ద్వితీయ ఒత్తిడితో కూడిన ట్యాంకుకు పంపబడుతుంది. అప్పుడు నీరు ఒత్తిడితో కూడిన ట్యాంక్ నుండి మధ్యలో ఉంచిన పంపు వరకు ప్రవహిస్తుంది.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

ఇంపెల్లర్లను కదిలించే టర్బైన్ (వాటర్ ఇంజన్) లోకి ఒత్తిడి చేయబడిన నీరు పంప్ అయినప్పుడు ఒక రకమైన పవర్ సైకిల్ సృష్టించబడుతుంది. నీటి ఇంజన్‌ను నేరుగా వెనుక చక్రానికి అమర్చబడి ఉంటుంది. ఇంపెల్లర్లు ఇంజన్ లోపల కదలడం ప్రారంభించిన తరువాత, ఇంజన్‌ను అనుసంధానించే వెనుక చక్రాలు కూడా కదలడం ప్రారంభిస్తాయి.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

అయితే, పైన పేర్కొన్న పవర్ సైకిల్‌ను సృష్టించాలంటే, నీటిని కుదించడానికి ఒత్తిడి చేయబడిన ట్యాంకు కోసం శక్తి వనరు అవసరం. యమహా రూపకల్పనలో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది, భవిష్యత్తులో ఎప్పుడైనా ఇది తెలిసే అవకాశం ఉంది.

యమహా ఎక్స్‌టి500 హెచ్2ఓ - నీటితో నడిచే బైక్

యమహా వాటర్ బైక్ కాన్సెప్ట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

యమహా ఎక్స్‌టి 500 హెచ్2ఓ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ దశ నుంచి వాస్తవ రూపం దాల్చడానికి మరో ఐదేళ్ల సమయం పట్టొచ్చని అంచనా. శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేటి తరంలో, ఆటోమోటివ్ తయారీదారులు తమ వాహనాలకు శక్తినిచ్చేందుకు ప్రత్యామ్నాయ వనరుల కోసం అన్వేషిస్తున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే ఈ కాన్సెప్ట్. నీటితో నడితే బైక్, వినడానికైతే ఇది బాగానే ఉంది కానీ ఇది నిజజీవితంలో అందుబాటులోకి వస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha has globally unveiled a new concept motorcycle. Called the XT 500 H2O, it is modern-day reincarnations of the brand's XT500 motorcycle sold in the 1970s. The new motorcycle is expected to arrive only by 2025. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X