మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం అన్ని సంస్థలు తమ వాహనాలను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా తయారు చేయబడాలి. కాబట్టి ఇప్పటికే చాల సంస్థలు తమ వాహనాలను బిఎస్ 6 వెర్షన్లో తయారు చేస్తోంది. ఇంకా కొన్ని సంస్థలు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

బిఎస్-6 నిబంధనలకు అనుకూలంగా తయారుచేయడానికి నిర్దేశించిన గడువు 2020 ఏప్రిల్ 1. ఏప్రిల్ 1 తరువాత బిఎస్-4 వాహనాలు నిలిపివేయబడతాయి. ఈ నేపథ్యంలో భాగంగా యమహా కంపెనీ తన బ్రాండ్ అయిన బిఎస్-4 ఆర్ 3 మోటార్ సైకిల్ ని నిలిపివేయనుంది.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

యమహా యొక్క బిఎస్-4 వెర్షన్ ఆర్3 బైక్ 321 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీనీకరించలేదు. వీటి గడువు మార్చి 31 కి నిర్దేశించడంతో ఈ మోటార్ సైకిల్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉండదు.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

ప్రస్తుత యమహా ఆర్ 3 ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్ కలిగి స్టైలింగ్ మరియు రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంది. ఆర్ 3 మోటార్ సైకిల్ సుదూర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది వాహనదారునికి చాలా అనుకూలమైన రైడింగ్ అనుభూతిని కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

యమహా ఆర్ 3 మోటార్ సైకిల్లో ఉండే 321 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 41 బిహెచ్‌పి మరియు 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

ఆర్3 డైమండ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. మోటారుసైకిల్‌ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనో-షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటుంది.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

యమహా ఆర్ 3 బైక్ యొక్క బ్రేకింగ్ విధులను గమనించినట్లయితే దీని ముందు భాగంలో 298 ఎంఎం డిస్క్ మరియు వెనుక వైపు 220 ఎంఎం డిస్క్ ఉంటుంది. దీనికి డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ మద్దతు కూడా ఉంది. ఆర్3 లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ రెండు మెట్జెలర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లను కలిగి ఉన్నాయి. యమహా ఆర్3 లో పార్ట్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, ఇది రైడర్‌కు బేసిక్ ఇన్పర్మేషన్ అందిస్తుంది.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

భారతదేశంలో యమహా ఆర్ 3 నిలిపివేయబడటంతో, ఎంట్రీ లెవల్ స్పోర్ట్ బైక్ కోసం చూస్తున్న కొనుగోలుదారులు టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 మరియు కెటిఎం ఆర్ సి 390 లని ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

మీకు తెలుసా.. ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడనున్న యమహా R3 బైక్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

యమహా ఆర్ 3 భారత మార్కెట్లో మార్చి 31 తరువాత నిలిపివేయనుంది. ఈ యమహా ఆర్3 ఎక్కువమంది వాహనదారులకు ఇష్టమయిన మోటార్ సైకిల్. ఇప్పుడు ఈ విభాగంలో బిఎస్-6 వాహనం అందించకపోవడం వాహనదారులను చాలా నిరాశకు గురిచేసింది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha R3 Discontinued From April 1 Until BS6 Model Introduced In India. Read in Telugu.
Story first published: Friday, March 20, 2020, 13:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X