ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ.. ఎక్కడో తెలుసా ?

ఇటీవల భారత మార్కెట్లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ విడుదలైంది. ఇప్పుడు డెలివరీ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కొత్త అవతార్‌లో విదూడలైన ఈ హిమాలయన్ బైక్ ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ కారణంగా ఇటీవల కేరళలో ఒక రోజు 100 హిమాలయన్ బైకులు డెలివరీ చేయబడ్డాయి.

ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన హిమాలయన్‌ను 2016 లో దేశీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రారంభంలో దాని బరువు, నిర్వహణ మొదలైన వాటి వల్ల చాలా విమర్శలు ఎదుర్కొంది. అయితే కాలక్రమేణా ఈ బైక్ కస్టమర్లను ఎక్కువ ఆకర్షించింది.

ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ

ఇప్పుడు కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొత్త మార్పులతో హిమాలయన్ బైకుని తీసుకువచ్చింది. ఇప్పుడు దీనికి ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ కూడా జోడించబడింది. ట్రిప్పర్ నావిగేషన్ మొదట మీడియార్ 350 లో కనిపించింది. ఎగ్జాస్ట్ కోసం బ్లాక్ అవుట్ హీట్ షీల్డ్ ఇవ్వబడింది మరియు లగేజ్ రాక్ కూడా అప్డేట్ చేయబడింది.

MOST READ:పాస్టాగ్ లొల్లి షురూ.. ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారుకి రూ.310 టోల్ చార్జ్!

ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ సమీపంలో ఉన్న ఫ్రంట్ ఫోర్క్ ముందుకు నెట్టబడింది. ఫ్రంట్ హెడ్‌ల్యాంప్‌లో బ్లాక్ కేసింగ్ ఉంది. విండ్‌షీల్డ్ మునుపటి కంటే పొడవుగా ఉండటం మీరు గమనించవచ్చు. ఇది బైక్ యొక్క రహదారి ఉనికిని మెరుగుపరుస్తుంది.

ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ కి కేరళ రాష్ట్రంలో అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కొత్త మోడల్‌లో అప్డేటెడ్ ఫీచర్స్ ఉండటం వల్ల చాలంది ఈ బైక్ పై మక్కువ చూపిస్తున్నారు. అందుకే కేవలం ఒక్కరోజులోనే 100 యూనిట్లు డెలివరీ అయ్యాయి.

MOST READ:మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది. దీని మిరాజ్ సిల్వర్ మరియు గ్రావెల్ గ్రే కలర్ ఆప్షన్లను రూ. 2.36 లక్షలకు, లేక్ బ్లూ, రాక్ రెడ్, గ్రానైట్ బ్లాక్ రూ. 2.40 లక్షలకు, పైన్ గ్రీన్ కలర్ రూ. 2.44 లక్షలకు అందుబాటులో ఉంచారు.

ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ

ఇది 411 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది, ఇది 24 బిహెచ్‌పి శక్తిని మరియు 32 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో షాక్ సెటప్ కలిగి ఉంటుంది. దీనికి డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం ఇవ్వబడింది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

ఒక్క రోజులో 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ డెలివరీ

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఒకే రోజులో కేరళ ఒక్క రాష్ట్రంలోనే 100 యూనిట్లు డెలివరీ చేయబడ్డాయి. అంటే దేశవ్యాప్తంగా ఇంకా ఏవిధమైన రెస్పాన్స్ వస్తుందో తెలుసుకోవడానికి కొంత సమయం వేచి చూడాలి. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ చూడటానికి కొత్త కలర్స్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇది మునుపటికంటే చాలా మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహనదారునికి చాలా అననుకూలంగా కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
100 Units Of Royal Enfield Himalayan Sold In A Single Day. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X