భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

బెనెల్లి కంపెనీ తన 2021 ఇంపీరియల్ 400 ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త (2021) బెనెల్లి ఇంపీరియల్ 400 ధర ఇప్పుడు దేశీయ మార్కెట్లో రూ 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). బెనెల్లి కంపెనీ గత ఏడాది ప్రవేశపెట్టిన బిఎస్ 6 కంప్లైంట్ వెర్షన్ కంటే ఇది రూ. 10,000 తక్కువ. ఈ కొత్త బెనెల్లీ ఇంపీరియల్ 400 గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ యొక్క ధర తగ్గడానికి ప్రధానంగా రెండు కారణాలే కారణమని కంపెనీ పేర్కొంది. అవి డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయిని బలోపేతం చేయడం మరియు భారతదేశంలో అనేక భాగాల తయారీ కొత్త బైక్ ధరను తగ్గటానికి కారణమని కంపెనీ తెలిపింది.

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

ప్రస్తుతం ఈ కొత్త బెనెల్లీ ఇంపీరియల్ 400 ధర తగ్గడం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది, తద్వారా భారత మార్కెట్లో అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుందని బెనెల్లి ఇండియా ఆశిస్తోంది.

MOST READ:భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

బెనెల్లి ఇంపీరియల్ 400 ఇప్పుడు 2 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల మ్యానుఫ్యాక్చర్ వారంటీతో ప్రామాణికంగా వస్తుంది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు తర్వాత సర్వేష్ష్ లో భాగంగా బెనెల్లి తన వినియోగదారులకు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ను కూడా అందిస్తుంది.

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ లో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేనప్పటికీ, ఈ మోటారుసైకిల్ అదే లేటెస్ట్ రెట్రో డిజైన్‌ను ముందుకు తీసుకువెళుతుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, స్పోక్ వీల్స్ వంటివి ఉన్నాయి.

MOST READ: విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

2021 బెనెల్లి ఇంపీరియల్ 400 కూడా అదే బిఎస్ 6 కంప్లైంట్ 374 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 19 బిహెచ్‌పి మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

మోటారుసైకిల్ యొక్క స్టీల్ ట్యూబ్స్ మరియు ప్లేట్స్ తో డబుల్ డయల్ చాసిసి కలిగి ఉంది. మోటారుసైకిల్‌ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ద్వారా అడ్జస్టబుల్ ప్రీలోడ్ ఉంటుంది.

MOST READ:ఔరా.. ఏమి క్రియేషన్.. స్కూటర్ సైకిల్ అయిపోయింది

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

ఇక ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపున 240 మిమీ డిస్క్ చేత నిర్వహించబడుతుంది. అంతే కాకుండా ఇందులో స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ మద్దతు కూడా లభిస్తుంది. మోటారుసైకిల్ 19 ఇంచెస్ మరియు 18 ఇంచెస్ స్పోక్డ్ రిమ్స్‌లో నడుస్తుంది. వీటిని 100/90 ముందు మరియు 130/80 వెనుక టైర్ ప్రొఫైల్‌లతో చుట్టారు.

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

కొత్త బెనెల్లీ మోటారుసైకిల్ 12 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఇది ఒక లీటర్ పెట్రోల్ తో దాదాపు 32 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఈ కొత్త మోటారుసైకిల్ బరువు 204 కిలోలు. ఇంపీరియల్ 400 కూడా 780 మిమీ సీట్ల ఎత్తు మరియు 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది.

MOST READ:సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు, ఎందుకో మరి

భారత్‌లో కొత్త 2021 బెనెల్లీ ఇంపీరియల్ 400 లాంచ్ : ధర & వివరాలు

బెనెల్లి ఇంపీరియల్ 400 చూడటానికి దాని మునుపటి మోడల్‌లాగా ఉంటుంది. అయితే ఈ కొత్త బైక్ ఇప్పుడు మరింత సరసమైన ధర‌తో లభిస్తుంది. బెనెల్లి ఇంపీరియల్ 400 భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటీయార్ 350, హోండా హైనెస్ సిబి 350 మరియు జావా వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Benelli Imperiale 400 Launched In India. Read in Telugu.
Story first published: Saturday, February 6, 2021, 9:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X